Monday, June 29, 2020

శ్రీరాముడు రాజ్యాంగబద్ధమైన మరియు సాంస్కృతిక ప్రతీక. (రామజన్మభూమి ఉద్యమ గాధ-9)


     శ్రీరాముడు రాజ్యాంగబద్ధమైన మరియు సాంస్కృతిక  ప్రతీక: న్యాయమూర్తి హరినాథ్ తిల్హరి.


    మన దేశ ప్రజలకు సీతారాములన్నా, రామాయణమన్నా మక్కువ ఎక్కువ. దేశంలోని ప్రతి గ్రామంలోనూ కనిపించే రామాలయాలు,  హనుమంతుని  ఆలయాలే దీనికి ఉదాహరణ. రాముడి పేరు లేనటువంటి కుటుంబముండదు, రాముడి పేరులేని గ్రామమే ఉండకపోవచ్చు. ఇంతటి సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్న భారతప్రజలు సహజంగానే రామాయణాన్ని అనుసరించి తమ జీవితాన్ని ఆదర్శంగా గడుపుతున్నారు. అందుకే స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి నూతన రాజ్యాంగం తయారు చేస్తున్న సమయంలో, రావణ వధానంతరం శ్రీలంకనుండి పుష్పక విమానంలో  బయలుదేరి అయోధ్యవస్తున్న సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడి పురాణకాల సన్నివేశాన్ని చక్కగా చిత్రించారు. ఎక్కడైతే  మౌలిక హక్కుల విషయము  గురించి  చెప్పబడిందో  రాజ్యాంగంలోని  మూడవ అధ్యాయంలో ఈ చిత్రాన్ని ముద్రించారు.
            వేరువేరు మతాలకు చెందిన, వేరువేరు భావాలు కలిగిన  వ్యక్తులున్న రాజ్యాంగసభ ఏకగ్రీవంగా ఆమోదించి స్వీకరించింది. (ఈ అధ్యాయంలోనే వైదికకాలం నాటి గురుకులాలు, యుద్ధ మైదానంలో విషణ్ణ వదనంతో కూర్చున్న అర్జునుడికి ప్రేరణనిచ్చే శ్రీకృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు వంటి మన భారతీయ సంస్కృతిలో శ్రేష్ట వ్యక్తిత్వం కలిగిన పూజనీయుల చిత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు)  ఇలా మర్యాద పురుషోత్తముడైన  శ్రీరామచంద్రుడు రాజ్యాంగబద్ధమైన మహా పురుషుడిగా భారతజాతి స్వీకరించింది దీనినే హైకోర్టు లక్నోబెంచ్ న్యాయమూర్తి హరినాథ్ తిల్హరి ''శ్రీరాముడు భారత రాజ్యాంగబద్ధమైన మరియు భారతసాంస్కృతిక ప్రతీక " అంటూ తనతీర్పులో ఉదహరించారు.

*కేంద్ర ప్రభుత్వం హస్తగతం చేసుకుంది*
          జనవరి 7వ తేదీ 1993 బాబర్ కట్టడాన్ని తొలగించిన నెల రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న వివాదాస్పదమైన భూభాగంతో పాటు 67 ఎకరాల భూమిని ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. అనంతరం పార్లమెంటులో చట్టబద్దం చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఇస్మాయిల్ ఫరూకి అనే వ్యక్తి మరికొందరు సుప్రీం కోర్టులో కేసు వేశారు.

చారిత్రక విశేషతను నిరూపించమని
కోరిన రాష్ట్రపతి:
        1993 జనవరి ఏడో తేదీ అప్పటి గౌరవ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ ఆర్టికల్ 143(A) అంతర్గతమైన తన అధికారాన్ని ఉపయోగించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి స్థలంగా పేర్కొంటున్న భూభాగంలో  1528 సంవత్సరానికి ముందు అక్కడ  ఏదైనా హిందూ మందిరము లేదా భవనము ఉండేదా అంటూ,  సుప్రీంకోర్టును స్పష్టపరిచ వలసిందిగా కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఐదుగురు న్యాయమూర్తులతో పూర్తి న్యాయమూర్తులపీఠం, హస్తగతం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ వేసిన కేసులతో పాటు రాష్ట్రపతి కోరిన విషయానికి సంబంధించి ఏకబిగిన 20 నెలలు వాదనలు విని అక్టోబర్ 24 వ తేదీ 1994లో ఇస్మాయిల్ ఫారూకి Vs భారత ప్రభుత్వము పేరుతో పిలువబడిన (1994-6-SCC; 383 పేజి) తీర్పును ప్రకటించారు.
రామజన్మభూమి స్థలం యొక్క హక్కుదారులు ఎవరు మరియు గౌరవ రాష్ట్రపతి గారి ప్రశ్న రామ జన్మభూమి  వివాదానికి మార్గం చూపేదిగా ప్రకటిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అలహాబాద్ హైకోర్టుకు బాధ్యతను ఇచ్చింది సుప్రీంకోర్టు.

*రాడార్ తరంగాల ద్వారా సర్వే :*
      గౌరవ రాష్ట్రపతి ప్రశ్నను విశేషమైనదిగా భావిస్తూ అలహాబాద్ హైకోర్టు కెనడాకు చెందిన వైజ్ఞానిక శాస్త్రవేత్తలతో మాట్లాడి 2002వ సంవత్సరం నియుక్తి చేయగా రాడార్ తరంగాల ద్వారా నిర్దిష్టమైన స్థలంలో భూమి లోపలి పొరలలో ఉన్న భాగాలను పరిశీలించి 1528కి పూర్వం వివాదిత స్థలంలో పురాతన కట్టడం ఉండేదని నివేదికను సమర్పించింది.రాడార్ ద్వారా సర్వేతోపాటు  పురాతత్వశాఖ  2003వ సంవత్సరం తవ్వకాలు జరిపి రాడార్ పరీక్షలకు బలం చేకూరుస్తూ భూమి లోపల 27 గోడలు ఈ గోడలపైన, గోడలలోపల రాతి శిల్పకళాఖండాలు , 52 స్తంభాల  పురాతన నిర్మాణపు అవశేషాలు, మరియు ఒకశివాలయం అవశేషాలు కూడా లభ్యమయ్యాయని  ఆధారాలు, చిత్రాలతో కూడిన నివేదికను అలహాబాద్ హైకోర్టు వారికి అందజేశారు.

హిందూ - ముస్లింల చర్చలు:
      మొదట ప్రధానిగా రాజీవ్ గాంధీ  చొరవ తీసుకొని హోమ్ మినిస్టర్ బూటాసింగ్ నేతృత్వంలో సామాజిక పెద్దల సమావేశం ఏర్పాటు చేయగా సయ్యద్ షాబుద్దీన్ అసమంజసపు వ్యవహారం,అసమంజసపు మాటలతో చర్చలు విఫలమైనాయి.
     రెండవసారి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అలీమియా నవాదీ నేతృత్వంలో ముస్లిం ధార్మిక సామాజిక నాయకులు మరియు హిందూ సమాజంలోని సాధువులు మరి కొందరు ప్రముఖులతో కూడిన బృందంతో జరిగిన చర్చలో బాబర్ కట్టడం అడుగున మందిరానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటే ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించడానికి అభ్యంతరంలేదని షాబుద్దీన్ ప్రకటించాడు, ఆ ప్రకటనను మిగిలినముస్లిం ప్రతినిధులు వ్యతిరేకించారు. ఇలా ఏ తర్కానికి నిలువని మాటలు మాట్లాడుతూ మాటిమాటికి తమ వాదనలను మారుస్తుండగా,ఒక సమయంలో  ముస్లిం ప్రతినిధులు నమాజ్ చేయడానికి  లేచి వెళ్లారు, తిరిగి వచ్చిన వారితో  స్వామి  సత్యమిత్రానంద మహారాజ్ నేను దానం  తీసుకునే హక్కు ఉన్న సన్యాసిని,  మీరు నమాజ్ చేసి వచ్చిన తర్వాత  జకాత్  సమర్పించడం  మీకు గొప్ప విషయం కనుక మిమ్మల్ని నేను  రామజన్మభూమిని  దానం ఇవ్వవలసిందిగా  జోలెపట్టి  అడుగుతున్నాను  అంటూ జోలెను పట్టగా ముస్లింలు నిరాకరించారు.ఇలా హిందూ ముస్లింల  సద్భావన  కొనసాగడం కోసం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి.

       మూడవసారి 1990వ సంవత్సరం  చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో విశ్వహిందూ పరిషత్ మరియు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల మధ్యన చర్చలు ప్రారంభమయ్యాయి రెండు పక్షాల వారు తమ సాక్ష్యాలను లిఖిత రూపంలో కేంద్ర హోం మంత్రికి ఇచ్చారు మరియు పరస్పరం అందజేసుకున్నారు.
 ఒకరు ఇచ్చిన విషయాలపై మరొకరు అభ్యంతరాలను, జవాబులను తెలియజేసుకుంటూ చర్చించవలసిన బాబ్రీ మస్జిద్ ఆక్షన్ కమిటీ ప్రతినిధులు జనవరి 10వ తేదీ 1991 సంవత్సరం నాటి సమావేశానికి గైర్హాజరుకాగా జనవరి 25 వ తేదీకి వాయిదా పడింది ఈ సమావేశానికి కూడా బాబ్రీ మజీద్ యాక్షన్ కమిటీ ముస్లిం ప్రతినిధులు ఎవరు హాజరు కానందున మూడవ సారి కూడా చర్చలు విఫలమయ్యాయి.
 
ప్రభుత్వము శపథపత్రము :
     ఇలా ప్రతిసారి చర్చలు విఫలం అవ్వడం గమనించిన సుప్రీంకోర్టువారు రాష్ట్రపతి అడిగిన ప్రశ్నల విషయంలో మరింత స్పష్టత కోరగా సెప్టెంబర్ 14 వ తేదీ భారత ప్రభుత్వ ప్రతినిధిగా సొలిసిటర్ జనరల్ శ్రీ దీపాంకర్ గుప్తా రాతపూర్వకంగా శపథపత్రాన్ని విడుదల చేశారు. అది ఇలా ఉంది.
"చర్చలు విఫలం అయిన దరిమిలా ఉత్పన్నమైన ప్రతిష్టంభనను తొలగించడానికి సుప్రీంకోర్టు తగిన విధంగా స్పందించాలని, తొలగించబడిన కట్టడము క్రింద హిందూ మందిరం యొక్క అవశేషాలు ఉన్నట్లయితే హిందూ సమాజం యొక్క కోరిక అనుసరించి అప్పగించడం, ఎటువంటి అవశేషాలు లభించని ఎడల ముస్లిం సమాజం యొక్క కోరిక మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము". (ఇస్మాయిల్ ఫారూకి Vs భారత ప్రభుత్వము 1994-6-SCC పేజీ 383)

-ఆకారపు కేశవరాజు.

Sunday, June 28, 2020

పర్యావరణ శాస్త్రవేత్త కామెగౌడ కథ ( ఇతను ఒక గొర్రెల కాపరి )

భారత ప్రధాని 28 ఆదివారం జూన్ 2020 రోజున మన్ కీ బాత్ లో ప్రస్తావించిన ఒక గొర్రెల కాపరి కథ ఇది. కర్ణాటకలోనీ మలవల్లి, కుండినిబెట్ట అనే చిన్న గ్రామంలో 16 చెరువులను ఒంటరిగా తవ్వించిన పర్యావరణ శాస్త్రవేత్త కామెగౌడ కథ ఇది.
      ‘కేరే’ (సరస్సు) సహజంగానే అతని పేరుకు ముందే ఉండేది. ఈ మధ్యకాలంలో అతను వివిధ అవార్డుల ద్వారా వచ్చిన ధనాన్ని కూడా అతను దానిని వ్యక్తిగత వినియోగానికి ఖర్చు పెట్టడానికి బదులు, కార్మికులకు మరియు ఆధునిక పరికరాలను తీసుకోవడానికి ఉపయోగించి మరెన్నో సరస్సులను తవ్వించాడు. ఇలా వచ్చిన ధనంతో పర్యాటకులను కొండకు తీసుకెళ్లడానికి ఒక చిన్న రహదారిని కూడా నిర్మించాడు. అతని పిల్లలు ఇప్పటికీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా చిన్న హట్టిలలో(గుడిసెలు) ఉంటారు, మరియు వారి జీవనోపాధి కోసం గొర్రెలను మేపుతారు. పూరి గుడిసెల్లో ఉంటూ కూడా కొండకు రక్షణగా నిలబడ్డారు ఎందుకంటే తనకు కొండలన్నా పర్యావరణమన్నా అమితమైన ఇష్టం.

        కామెగౌడ మొదట ఈ కొండపై 40 సంవత్సరాల క్రితం చెరువులను తవ్వడం ప్రారంభించాడు. అతను సహజంగా గొర్రెల కాపరి కావడం వలన గొర్రెలను మేకలను కొండపైకి తీసుకెళ్లేవాడు గొర్రెలకు మేకలకు నీళ్ల కోసం చూస్తే ఎక్కడా నీటి గుంటలు కనిపించలేదు ఆ విధంగా మేకలకు గొర్రెలకు ఏదో రకంగా నీళ్లు అందించి దాహం తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇక అప్పటినుండి గొర్రెలను మేస్తున్న సమయంలో తన దగ్గర ఉండే కర్రతో నీటి జాడలు ఉన్న ప్రదేశంలో తవ్వడం ప్రారంభించారు అలా తవ్వి తవ్వి అలసిపోయాడు ఎన్నో రోజులకు ఒక ఒక గంటలో నీరు రావడం జరిగింది. అలా వచ్చిన నీటితో మేకలకు గొర్రెలకు మొదట దాహం తీర్చాడు. ఆ గుంట లో నీరు రాగానే తనకు అనిపించింది ఇక్కడ నీటి జాడలు ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద చెరువులు తవ్వుతూ ఒకదానికి ఒకటి అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ తన దగ్గరున్న కర్రతో తవ్వడం వలన ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అతను తవ్వే పరికరాన్ని మార్చాలని అనుకున్నాడు వెంటనే తన గొర్రెల్లో ని రెండు గొర్రెలు అమ్మి ఇనుప వస్తువులు తీసుకొచ్చారు వాటితో మరలా గుంతను పెద్దగా చేశారు.
       అలా ఒక చెరువు తవ్విన కామె గౌడ మనసులో లో కొండ పైన ఉన్నటువంటి జంతువులు జీవరాశులు గుర్తుకు వచ్చాయి ఇలా అనేక చెరువులు తవ్వడం వల్ల జంతువులు అన్నిటికీ దాహం తీర్చాలని ఆలోచన వచ్చింది వెంటనే తవ్వినా చెరువుకు అనుసంధానం చేస్తూ ఇంకో చెరువు తవ్వడం మొదలు పెట్టాడు. ఇలా 2017 వరకు ఒక చెరువుకి ఇంకొక చెరువుని అనుసంధానిస్తూ ఆరు చెరువు తవ్వాడు అదే సమయంలో సినిమా హీరో కిచ్చా సుదీప్ తనకు ఆర్థిక సహాయం చేశాడు. ఆ ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా కామె గౌడ మరో ఆరు చెరువులు తవ్వడానికి ధనాన్ని వినియోగించాడు చూడండి ఒక పేదవాడు అయివుండి కూడా గొర్రెల కాపరి తనకున్న డబ్బునంతా తనకు సహాయం చేసిన డబ్బునంతా కొండ మీద ఉన్నటువంటి జంతువుల కోసం పక్షుల కోసం అలాగే కొండ సంరక్షణ కోసం గుంతలు తవ్వి చెరువులు నిర్మించి ఒక దానికొకటి అనుసంధానిస్తూ 16 చెరువులు తవ్వాడు. కొండపైకి వెళ్లడానికి ఒంటరిగా రహదారిని కూడా నిర్మించాడు. 2018 కాలంలో అక్కడే రెండు వేల పైబడి మర్రి చెట్లను నాటాడు. 

     కామె గౌడ చదువుకోనప్పటికీ భారత పురాణాలు ఇతిహాసాల పై లోతైన అధ్యయనం కలవాడు అందుకే అనుకుంటా మొదట తవ్విన చెరువుకు గోకర్ణ అని అనుసంధానం చేసిన చెరువులకు రామ లక్ష్మణ్ పేర్లు కూడా పెట్టాడు. 84 సంవత్సరాల వయస్సులో కూడా, కెరె కామెగౌడ ఆరోగ్యంగా ఉన్నాడు, కొండపైకి మరియు క్రిందికి సులభంగా ఎక్కి దిగుతాడు.  అతను రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కొండపై గత నలభై సంవత్సరాలుగా కనీసం 12 గంటల పైన గడుపుతాడు, రాత్రి మాత్రమే పడుకునే సమయంలో గుడిసె కు వస్తాడు. తన కుమారుడు శ్రీకృష్ణుడు పదవ తరగతి తర్వాత తండ్రి బాటలోనే నడుస్తూ కొండను సంరక్షిస్తూ గొర్రెలను కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మైసూరుకు చెందిన సామాజిక కార్యకర్త జయరామ్ పాటిల్ కంటి శుక్లాల ఆపరేషన్కు సహాయం చేశారు.

    కేరె కామెగౌడను ప్రత్యేకత ఏమిటంటే, అతను తన సంపాదన మొత్తాన్ని చెట్లు, సరస్సులు మరియు కొండపై ఖర్చు చేసాడు.  మానవులు డబ్బు కోసం మరింత అత్యాశతో మారుతున్నప్పుడు, అతను మనకు నిజమైన మార్గాన్ని చూపుతున్నాడు అంటారు ఆ ప్రాంత ప్రజలు అలాగే కెరే అంటే సరస్సు అని ముద్దుగా ఈ ప్రాంత ప్రజలంతా పిలుచుకుంటారు కామె గౌడ్ ను.
     కెరె ఎప్పుడూ చొక్కా, చడ్డీ మరియు శాలువతో కొండ మీద చూడవచ్చు.  సాధారణంగా అతను ఇతరులు దానం చేసిన దుస్తులను ధరిస్తాడు. గడ్డం తో ఉంటాడు. అతను సపోర్ట్ స్టిక్ తో నడుస్తాడు. కంటిశుక్లం తప్ప కేరే కామెగౌడ కు ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉన్నాడు. కేరె కామెగౌడకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను తన పెద్ద కుమారుడు కృష్ణుడితో కలిసి ఉంటున్నాడు. కెరె కామెగౌడ తన మనవరాళ్ల సహాయంతో కొండ మీద రాతి స్తంభాలపై అటవీ, జీవావరణ శాస్త్రం, సరస్సు రక్షణకు సంబంధించిన సామెతలు రాశారు.  అతను తన మనవడికి ఒక సరస్సు పేరు పెట్టాడు. ముడ్డే, అంబాలి మరియు రోటీలతో సహా వేలి మిల్లెట్ తయారు చేసిన ఆహార పదార్థాలను కేరె కామెగౌడ ఇష్టపడతారు. ఇదండీ పెద్ద మనసున్న  కామె గౌడ కథ. పర్యావరణాన్ని రక్షించడమే మన బాధ్యత గా తీసుకుందాం. 

    జై హింద్.

Saturday, June 27, 2020

*గ్రామస్వావలంబనే దేశానికి వెన్నెముక*

*గ్రామస్వావలంబనే దేశానికి వెన్నెముక*     

  కరోనామహమ్మారితో అతలాకుతలమైన ప్రపంచంలోని అనేక దేశాలు ప్రకృతి, పర్యావరణం, గ్రామ స్వావలంబన గురించి ఆలోచించడం ప్రారంభించాయి. నేటికీ మన దేశం వ్యవసాయ ఆధారిత దేశమే. మన దేశంలో సహజ వనరులకు కొదువలేదు. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన సొత్తు. వేల సంవత్సరాల నుండి భారతీయులు తినే ఆహారమే ఔషధంగా ఉపయోగపడేది. ప్రత్యేకమైన వైద్యము, మందుల గురించి ఆలోచించే అవసరమే లేదు. మారిన జీవన శైలి, మారిన మన ఆలోచనా విధానం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది రోగాల బారిన పడుతున్నారు.
        ఇంగ్లాండ్ ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ నిర్మాణం,వ్యవసాయ పునరుద్ధరణ,మట్టి రోడ్ల నిర్వహణ, సైక్లింగ్ వంటి అనేక విధానాలను రూపొందించుకుంటుంది. అంటే టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్లినప్పటికీ స్వచ్ఛమైన గాలి లేకుండా జీవించలేము. మనిషి పుట్టుకతో మొదలై తుదిశ్వాస వరకు తప్పనిసరిగా అవసరమైనది ప్రాణవాయువు. అలాంటి గాలిని కలుషితం చేస్తున్నటువంటి జీవన విధానాన్ని సరి చేసుకోవడం చాలా అవసరం.వాస్తవంగా ప్రతి మనిషి ఒక చెట్టు నరికితే,రెండు చెట్లు నాటడం ధర్మం. ప్రపంచంలో నేడు ఒక్క రోజులో 10 కోట్ల చెట్లు నరకబడుతున్నాయి. కేవలం ఐదు కోట్ల మొక్కలు నాటుతున్నారు. రాజస్థాన్ లోని ప్రముఖ ధనవంతుడైన వ్యాపారి వారం రోజులు ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టుకుని ఆస్పత్రికి 50 వేల రూపాయలు చెల్లిస్తూ, "గత 56 సంవత్సరాలుగా భగవంతుని ద్వారా నేను పొందిన గాలికి ఎలా రుణం తీర్చుకోగలను"అని పశ్చాత్తాప పడ్డాడు.
      మానవ జీవితంలో అతి ముఖ్యమైన రెండవ విషయం నీరు. భూమి పై ఉన్న నీటిలో 95% సముద్రంలో ఉన్న ఉప్పు నీరు,మిగతా 3 శాతం భూమిపై ఉండేది. ఇందులో 2% నీటిని కర్మాగారాలే వినియోగించుకుంటున్నాయి. మిగతా ఒక శాతం నీరు మాత్రమే ప్రజల అవసరాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి వర్షపు నీటిని సంరక్షించుకో నట్లయితే రాబోయే నీరు లభించడమే కష్టం. చెన్నైలో 2000 ఫీట్ల లోతు బోరు వేస్తేనే నీరు లభిస్తుంది. అంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో చెన్నై నగరవాసులకు తాగునీరు లభించడమే కష్టం. రాజస్థాన్ లో 28 నుండి 35 సెం.మీ. వర్షం పడినప్పటికీ నీటి ఎద్దడి లేదు. చిరపుంజిలో 1200 నుండి 1300 సెంటీమీటర్ల వర్షం పడినప్పటికీ నీటి ఎద్దడి ఉంది. దీని అర్థం అక్కడ ప్రజలు చేస్తున్న జల సంరక్షణ విధానాలు. కావున ప్రతి ఒక్కరు తమ నివాస స్థలం లో ఇంకుడు గుంతలు ఏర్పాటు, వ్యవసాయ క్షేత్రంలో పడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే ఏర్పాటు చేసుకోవాలి.
      భూసంపదను కొల్లగొట్టే ప్రయత్నంలో సారవంతమైన భూమిని నిర్వీర్యం చేసే పనులు అనేకం జరుగుతున్నాయి. వానపాములు లేని భూమి తయారవడం మన దురదృష్టం. రసాయన మందుల వాడకాన్ని పెంచి,పంటలకు ఉపయోగపడే క్రిమి కీటకాలను సంహరించి భూమిపై ఉన్న జీవవైవిధ్యాన్ని కొల్లగొట్టడం జరుగుతుంది. ఫలితం ఎలా ఉందంటే సారాయి తాగిన దేహం మాదిరిగా, భూమిని నిర్జీవంగా మార్చుతున్నాము. మిశ్రమ పంటలు వేయని కారణంగా, వేల సంవత్సరాలయినప్పటికీ కరగని ప్లాస్టిక్ వస్తువులు వినియోగించిన కారణంగా, భూమి సారాన్ని కోల్పోయి చచ్చుబడిపోయింది. దీనికోసం గోమూత్రం,గోపేడ ఆధారంగా ఎరువుల తయారీ,ప్రకృతిలో ఉన్న ఆకులుఅలములచే ఎరువులు తయారు చేసి వినియోగిస్తే భూసంపద కాపాడబడుతుంది.
                 సమాజం నేడు గ్లోబల్ గా ఆలోచిస్తూ లోకల్ గా పని చేయాలి.అలా అయితేనే మంచి జరుగుతుంది. నేటి అపరిమిత వాహనాల వినియోగం, ఎయిర్ కూలర్ ల వినియోగం, రిఫ్రిజిరేటర్లు,అధిక కర్మాగారాలు వేడిని పెంచే కారకాలు అవుతున్నాయి.తద్వార మానవుని యొక్క ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. ఆకాశంలో ఉండే ఓజోన్ పొరకి చిల్లు పడుతున్నది. ఫలితంగా సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిపై చేరి వింత జబ్బులకు అవకాశం ఏర్పడుతుంది. కావున పైన పైన చెప్పబడిన పంచభూతాల సంరక్షణ గ్రామ స్వావలంబనకు మొదటి మెట్టు అవుతుంది.
        స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం నిర్వహించారు. నేడు స్వదేశీ ఆలోచనతో మన విత్తనాలను మనమే తయారు చేసుకోవాలి. మన ఎరువులని మనమే తయారు చేసుకోవాలి. మన భాషను మనమే కాపాడుకోవాలి.మన సంస్కృతిని మనమే రక్షించుకోవాలి. దురభిమానం ఉండొద్దు, కానీ స్వాభిమానాన్ని విస్మరించరాదు. మన అవసరాలు,మన చుట్టూ ఉన్న గ్రామాల అవసరాలు పూర్తిగా తీర్చుకునే విధంగా పంటలు పండించడం, ఉపాధికల్పన ఏర్పాటు చేసుకోవడం,యువతకు గ్రామ అభివృద్ధి లో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని కల్పించడం,ప్రభుత్వ సహాయం కోసం వెంపర్లాడకుండా,మన కాళ్లపై మనమే నిలబడి వ్యవసాయం చేసే విధంగా ప్రయత్నం చేయడం గ్రామ స్వావలంబనకు రెండో మెట్టు.
         ఈనాడు ఉన్నత విద్యావంతులైన యువతకి కొదువలేదు. కానీ స్వచ్ఛమైన ఆహారపదార్థాలను ఉత్పత్తి చేసే వ్యవసాయదారుల కొరత ఉంది. మానవ ఆరోగ్యానికి కావాల్సిన స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి,పండ్ల ఉత్పత్తికి, పప్పులు, నూనెలు తయారికీ విద్యావంతులైన యువకులు పూనుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకి ధనవంతులు సహకరించాలి. ప్రతిగా రైతులు మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. నేను-నా గ్రామం అనే ఆలోచన పెరగాలి. ఈనాడు గ్రామాలకి రవాణా సౌకర్యం పెరిగింది. ప్రచార సాధనాల సౌకర్యం కలిగింది. ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చింది. కాబట్టి జీవ వైవిధ్యంతో కూడిన విధానాలతో గ్రామాలని ముందుకు తీసుకెళ్తే గ్రామ స్వావలంబన సాధ్యం అవుతుంది. గ్రామ స్వావలంబన తో దేశ సర్వతోముఖాభివృద్ధి సాధించబడుతుంది.

-జిన్నా సత్యనారాయణ రెడ్డి
 తెలంగాణ గ్రామ వికాస ప్రముఖ్

Friday, June 26, 2020

ఎగిసిన ఉప్పెన - కూలిన దాస్య చిహ్నం (రామజన్మభూమి ఉద్యమ గాధ -8)

ఎగిసిన ఉప్పెన - కూలిన దాస్య చిహ్నం
(రామజన్మభూమి ఉద్యమ గాధ -8)

     ఉత్తరప్రదేశ్లో పాలకులు మారారు రామభక్తుడైన కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రయ్యారు. అయోధ్య  దర్శనానికి వచ్చే భక్తుల అవసర నిమిత్తం వారికోరిక మేరకు 'కథాకుంజ్' (హరికథ భవనం) నిర్మాణం చేయడానికై, కోర్టు కేసులోఉన్న వివాదాస్పదమైన స్థలం వదిలి బాబర్ కట్టడానికి తూర్పున మరియు దక్షిణం దిశలో 42 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్ పేరిట పట్టాచేసి ఇవ్వడం జరిగింది. అంతేకాక వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వము హస్తగతం చేసుకుని సురక్షితంగా ఉంచింది.
      జూన్ 18వ తేదీ 1992వ సంవత్సరం ఎగుడు దిగుడుగాఉన్న  భూమిని సమతలీకరణ చేయడం కోసం 12 ఫీట్ల వరకు తవ్వి సరి చేస్తుండగా ఆగ్నేయ దిశలో  సుందరమైన పార్వతీ పరమేశ్వరుల ఖండిత మైన విగ్రహం, సూర్యుని పోలిన అర్థ కమలము, మందిర శిఖరముపై ఏర్పాటుచేసే ఆమలకము, విష్ణుమూర్తి విగ్రహాలు కళాఖండాలు ప్రాచీనమైన మందిరం యొక్క ఆనవాళ్లుగా పురాతత్వ శాఖ తవ్వకాలలో  లభ్యమయి ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి.
 

సర్వదేవతా అనుష్ఠానము, మరియు
పునాదులు తీయడం :
 1992వ సంవత్సరం జూలై 9 వ తేదీ నుండి 60 రోజుల సర్వదేవ అనుష్ఠానం ప్రారంభమైంది. శిలాన్యాసము జరిగిన స్థలంలో నిర్మాణము చేయబోయే మందిరపు పునాదిపనులు ప్రారంభించడం జరిగింది. ఈ పునాదులు 290 ఫీట్ల పొడవు 155 ఫీట్ల వెడల్పు రెండు బై రెండు ఫీట్ల మందము కలిగిన మూడు అంచెల స్లాబులు వేయడం జరిగింది. భారత ప్రధాని నరసింహారావు గారు సాధు సంతులతో మాట్లాడి  కోర్టు తీర్పు త్వరగా వచ్చే విధంగా ప్రయత్నిస్తానని మాట ఇచ్చి పనిని వాయిదా వేసుకోవాల్సి ఉందిగా కోరారు దీనితో సాధువులు సమ్మతించి నిర్మాణపు పనులు ఆపివేశారు.

     శ్రీరాముడి వనవాస కాలంలో భరతుడు పాదుకలను తీసుకువచ్చి శ్రీరాముడు లేని అయోధ్యా నగరంలోకి ప్రవేశించలేనంటూ, అక్కడే ఉంటూ సింహాసనంపై పాదుకలనుంచి శ్రీరాముడి పేరుతో  రాజ్యం చేసిన స్థలంగా ఘనత కెక్కిన 'నందిగ్రామ్' లో సెప్టెంబర్ 26వ తేదీ 1992 సంవత్సరం శ్రీరామ పాదుకాపూజ జరిపి అక్కడి నుండి  ప్రతి రాష్ట్రానికి, గ్రామ గ్రామానికి పాదుకలను తీసుకువెళ్లి పూజలు జరిపి శ్రీరామభక్తులు మందిర నిర్మాణంకోసం ప్రతిజ్ఞలు తీసుకోవడం జరిగింది.

ద్వితీయ కరసేవ:

      ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా హస్తగతం చేసుకున్న భూమిపై ముస్లింలు అభ్యంతరం తెలుపుతూ హైకోర్టుకు వెళ్లారు.

    అక్టోబర్ 30వ తేదీ 1992 నాడు సాధుసంతులు ఢిల్లీలో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఇది 'ఐదవ ధర్మసంసద్'.  

    డిసెంబర్ 6 వ తేదీన రెండవ కరసేవ కొరకు దేశం నలుమూలల నుండి రామ భక్తులను  అయోధ్యకు ఆహ్వానించారు.  నవంబర్ 4వ తేదీ నాటికి వాదనలు విన్న హైకోర్టు త్వరలోనే  తీర్పునిస్తుందనే విశ్వాసంతో కరసేవలో పాల్గొనడం కోసం లక్షలాది భక్తులు డిసెంబర్ 1వ,2వ తేదీనాటికే అయోధ్య వచ్చి చేరుకున్నారు. హైకోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు, డిసెంబర్ 4వ తేదీనాడు హైకోర్టువారు తాము డిసెంబర్ 11వ తేదీన తీర్పు వినిపిస్తామని ప్రకటించారు. 

బాబర్ కట్టడంతోపాటు, కుహనా సెక్యులరిజం కుప్పకూలింది: 

1528 వ సంవత్సరం నుండి భారతదేశ అవమానాలకు చిహ్నంగా కళ్లెదురుగా కనబడుతున్న ఆక్రమణ కారుడి కట్టడం స్వాభిమానధనులకు  తీరని అవమానంగా ఉంది, స్వాతంత్ర్యానంతర పాలకులు స్పందించిన తీరుకూడా ప్రజల మనసులు గాయపరిచాయి,  భారత ప్రధానిగా పీవీ నరసింహారావు  ఇచ్చిన మాటను కూడా నిలుపుకోలేకపోయారు. మరొకవైపు హైకోర్టు తీర్పు  తేదీని ఉద్దేశపూర్వకంగా పొడిగించారు. ముస్లింల సంతుష్టీకరణ తారాస్థాయికి చేరింది.

సాధుసంతులు కరసేవకు ప్రతీకగా మందిర నిర్మాణం కోసం సరయునది నుండి ఇసుకను తీసుకురమ్మని పిలుపునిస్తూ వేదికపై నుండి ఉపన్యాసాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇసుకను తీసుకురావడానికి వేలాది మంది బారులుతీరి నిలబడ్డారు. కొందరు మట్టిని తీసి ఎగుడుదిగుడుగా ఉన్న గుంతలను పూడ్చి వేస్తున్నారు.

మరోవైపు జరుగుతున్న పరిణామాలన్నీ గమనించి ఇక సహించలేమంటూ హిందూ సమాజం ఆవేశపూరితులై అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తిరగబడింది. భారతమాత నుదిటి కలంకంగా ఉన్న కట్టడాన్ని దేశం నలుమూలల నుండి అయోధ్యకు చేరుకున్న కరసేవకులు తమవెంట ఏ ఆయుధాలను తీసుకెళ్లక పోయినా  కట్టడంచుట్టూ కంచెకొరకు ఏర్పాటుచేసిన ఇనుప గొట్టాలే ఆయుధాలుగా మారి పోయాయి, కోపోద్రిక్తులైన కొందరైతే పిడికిళ్ళతోనే గుమ్మటాలను కొడుతుండడం కనిపించింది ఏదేమైనప్పటికీ లక్షలాదిగా వచ్చిన కరసేవకులు మూడున్నర గంటలలోనే నేలమట్టం చేశారు, బాబర్ కట్టడంతో పాటే కుహనా సెక్యులరిజం  కుప్పకూలిపోయింది. 

గుమ్మటాల  క్రింద ఉన్న బాలరాముడి విగ్రహాన్ని ముందే బయటికి తీసుకు వచ్చిన కరసేవకులు రామజన్మభూమి స్థలంలోనే బాబర్ కట్టడం కూలిపోయిన వెనువెంటనే గుడ్డతో వెదురు బొంగులతో చిన్న టెంట్ వేసి, ఇటుకలు  మట్టితో  నాలుగు వైపులా గోడలుకట్టి అప్పటికప్పుడు  చిన్న మందిరాన్ని నిర్మించారు. బాలరాముడిని ప్రతిష్టించారు పూజలు అర్చనలు చేశారు, భజనలు చేశారు, కానుకలు సమర్పించారు, విజయంతో, సంతృప్తితో ఆనంద నాట్యాలు చేశారు.
ఆరోజు బాబర్ కట్టడాన్ని తొలగిస్తున్న సమయంలోనే మరొక విశేషం బయటపడింది 1154 సంవత్సరం నాటి సంస్కృతంలో చెక్కబడిన శిలాశాసనం బయటపడింది. అమూల్యమైన ఈ శిలాశాసనంలో "విష్ణుహరి  స్వర్ణ కలశముతో కూడుకున్న మందిరం యొక్క వర్ణన, అయోధ్యా నగరం యొక్క వర్ణన, దశకంఠుడైన రావణాసురుని గర్వభంగము వర్ణణ ఇందులో చెక్కబడి ఉన్నది.  దీనితో  భవ్యమైన ప్రాచీన అయోధ్యా రామజన్మభూమి మందిరం యొక్క  ఆనవాళ్లు  మరియు తగిన సాక్ష్యము  దొరికినట్లయింది.

బాల రాముని దర్శించుకోవడానికి 
మళ్లీ అనుమతి :
8 వ తేదీ ఉదయం కేంద్ర బలగాలు అయోధ్యకు చేరుకుని అక్కడి ప్రాంతమంతా స్వాధీనం చేసుకున్నాయి, కర్ఫ్యూ విధించి కరసేవకులందరినీ అక్కడి నుండి పంపించివేశాయి.

హరిశంకర్ జైన్ అనే న్యాయవాది నిత్య పూజలు మరియు దర్శనం కోసం అనుమతి కోరుతూ కేసు వేయగా లక్నో బెంచ్ న్యాయమూర్తి హరినాథ్ తిల్హరి అనుమతిస్తూనే,  దర్శనంకోసం వచ్చే హిందూ తీర్థయాత్రికులు తగినంత దూరంలో నిలబడి  దర్శనం చేసుకోవడం కోసం, వర్షము, చలీ, ఎండల నుండి విగ్రహం యొక్క  రక్షణ మరియు వివాదిత స్థలము  చుట్టూగల భూమి, వాటితో పాటు  పురాతన వస్తువుల యొక్క రక్షణ కూడా  ప్రభుత్వమే వహించాలని తీర్పు చెప్పారు.

~ ఆకారపు కేశవరాజు. 

Thursday, June 25, 2020

మరొక అడుగు...

మరొక అడుగు... 

దేశమంటే ప్రజలంటే? జాతీయ అంటే ? జాతీయ భావన అంటే? దేశభక్తి అంటే? సేవా భావం అంటే? త్యాగం అంటే ?ఇచ్చిపుచ్చుకోవడం అంటే? సేవా నిరతి అంటే ? మానవత్వం అంటే ? సహాయం అంటే ? ఒకరికి ఒకరు తోడ్పాటు అంటే ?అర్థాలు తెలియడం పుస్తకాలు చదవడం ఉపన్యాసాలు ఇవ్వడం వినడం కాదు . పుట్టిన ప్రతి బిడ్డ తన దేశం కోసం తన జాతి కోసం ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా పాటుపడాలి .

అదృష్టమో దురదృష్టమో మన తెలంగాణ రాష్ట్రానికి ప్రకృతి వైపరీత్యాలు... తీవ్ర భూకంపాలు సముద్రతీరం లేనందున వాయుగుండాలు గండాలు తుఫాన్ బీభత్సాలు భయానక ప్రకృతి ఉపద్రవాలు మనం చవిచూసిన దాఖలాలు లేవు . ఇంకొక విషయం ఏమిటంటే మన రాష్ట్రంతో  శత్రు దేశాల సరిహద్దులు లేవు . కనుక మన రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తికి సరిహద్దు కలిగిన రాష్ట్రంలో పుట్టిన వ్యక్తికి దేశమన్నా దేశభక్తి అన్నా జాతీయత అన్నా భావోద్వేగాలు శారీరకంగా మానసికంగా చాలా వ్యత్యాసం కనపడుతుంది. పంజాబ్ హర్యానా ఇలా... సరిహద్దు రాష్ట్రాల నుండి సైన్యం లోకి వెళ్లిన వారి సంఖ్య చూస్తే మనకు అర్థం అవుతుంది .మనకు సైన్యం లో చేరిక గూర్చి అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.... శత్రు దేశ సరిహద్దులు కలిగిన రాష్ట్రాలలో క్షణ క్షణం ఎదురయ్యే సమస్యలు కష్టాలు ఉద్వేగాలు మన అనుభవంలోకి రాకపోవడం మనం వాటిని కళ్ళారా చూడకపోవడం తో మన రాష్ట్రంలో ఉన్న యువత ఇతర ఉద్యోగాల్లో చేరిపోతున్నారు . కానీ దేశం కోసం జాతి కోసం పోరాటం చేసే సైన్యంలోకి తక్కువ శాతం చేరిపోతున్నారు. మన యువత ప్రకృతి వల్ల గానీ శత్రు దేశాల భౌతిక దాడుల వల్ల గానీ ఏ  ఇబ్బందులకు గురి కావడం లేదు కాబట్టి ప్రేమ దోమ లాంటి సినిమాలు చూసి వాటిలో నటించే వారిని రోల్ మోడల్ గా భావిస్తూ వారినే ఆరాధిస్తూ కొందరు కాలం గడిపేస్తున్నారు. ఇది  చాలా విచారించదగిన విషయం .

అనేక మంది విద్యార్థులకు రైతులు పంటలు ఎలా పండిస్తున్నారు. తినే ఆహారం మూలాలేమిటో తెలియడం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. అదే విధంగా అనేక మంది వ్యక్తులకు  దేశభక్తి అంటే హృదయ లోతుల్లోంచి అచ్చమైన భావోద్వేగాలు స్పురించడం లేదు. ఏ తల్లిదండ్రులైన కొడుకు వీర శివాజీ గానో  ఝాన్సీ లక్ష్మీబాయి గానో  రాణి రుద్రమదేవి గానో  కావాలని కలలు కనడం లేదు ..కనీసం దేశం కోసం పోరాడే సైనికునిగా నైనా కోరుకోవడం లేదు . అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళి డాలర్లు సంపాదించాలనే కోరుకుంటున్నారు. ఒక ఆఫీస్లో గుమాస్తా అయితే చాలు అనుకుంటున్నారు.అందుకే అనేక మంది యువకులలో దేశభక్తి జాతీయ భావన కొరవడింది. ఎవరైనా సైనికుడు శత్రుదేశం తో పోరాడి నేలకొరిగితే ర్యాలీలు తియ్యడం క్యాండిల్తో శ్రద్ధాంజలి ఘటించి నాలుగు నినాదాలు ఇవ్వడం వరకే మన దేశ భక్తి పొంగిపొర్లుతోంది. ఆ రెండు రోజులే దేశం కోసం మనం ఏమి వేయకపోతిమనే సోయి కలుగుతోంది . తలదించుకుని మాట్లాడడం జరుగుతోంది

 మన రాష్ట్రంలో పదవతరగతి చదివిన ప్రతి విద్యార్థి పుట్టిన ప్రతి బిడ్డ కచ్చితంగా రైతు శ్రమను తెలుసుకోవాలి . అంటే వయసును బట్టి చదివినా చదవకున్నా ఇంటర్మీడియట్ స్థాయిలో మొదటి సంవత్సరం విద్యార్థి తప్పనిసరిగా వ్యవసాయ క్షేత్రంలో పంట పొలాల్లో పని చేయాలి . ఒక పంట కాలం పూర్తి అయ్యే వరకు   పండించే పంటను ఫీల్డ్ వర్క్ చేయాలి ప్రాజెక్టు వర్క్ గా ఉండాలి. దానికి మొదటి సంవత్సరం లో మార్కులు ఉండాలి . తినే ఆహారం ఎలా పడుతుందో నేర్చుకోవాలి తెలుసుకోవాలి. అది తప్పనిసరి విద్యా విధానం కావాలి. ఇంటర్ రెండవ సంవత్సరం లో ప్రతి విద్యార్థి కనీసం నాలుగు నెలలైనా సరిహద్దులో సైనికులతో కలిసి డ్యూటీ చేయాలి. వారికి శత్రువు దేశాలతో యుద్ధం వస్తే యుద్ధంలో పాల్గొనే విధంగా ప్రాథమిక విషయాల పైన అంశాలమీద అవగాహన ఉండేటట్లు తర్ఫీదు ఇవ్వాలి . దేశమంటే దేశభక్తి అంటే జాతీయత అంటే ప్రతి ఒక్కరికి తెలియజేయాలి .ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రతి యువతలో పెంపొందించాలి. ఇంటర్ రెండవ సంవత్సరం లో సైనిక శిక్షణ తప్పనిసరి చేస్తూ ప్రాజెక్టు వర్క్ ఫ్రేమ్ చేసి మార్కులు ఇవ్వాలి. ఇలా చేస్తే  తన దేశమంటే తమ ప్రజలంటే రైతు శ్రమ అంటే సైనికుని త్యాగం అంటే ఏమిటో తెలిసి వస్తోంది.

 పుట్టి పెరిగిన దేశం మీద ప్రేమ భక్తి శ్రద్ధ ఆసక్తి లేనివానికి ఆ దేశంలో ఉన్న ప్రజల మీద ఎందుకు బాధ్యత ఉంటుంది .అందుకే వ్యవసాయ శిక్షణ సైనిక తర్ఫీదు విద్యా విధానంలో తప్పనిసరి చేయాలి.


 జై హింద్

జిందం అశోక్

ప్రథమ కరసేవ (రామజన్మభూమి ఉద్యమ గాధ-7)

        ప్రథమ కరసేవ

        1990వ సంవత్సరం మే 24వ తేదీ పవిత్ర హరిద్వార్ లో సాధు మహాత్ముల మార్గదర్శనంలో  విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో రాబోయే అక్టోబర్ 30వ తేదీ దేవోత్థాన ఏకాదశి రోజు అయోధ్య రామ జన్మభూమి మందిరం నిర్మాణం కొరకు  కరసేవచేయడానికై నిర్ణయం జరిగింది. ఈ సందేశాన్ని గ్రామ గ్రామం వరకు తీసుకెళ్లడానికి సెప్టెంబర్ ఒకటో తేదీ నాడు అయోధ్యలో అరణి మంథనం చేసి( చెక్కల రాపిడి వలన నిప్పును పుట్టించడం) వెలిగించిన దీపాలను రామజ్యోతి అని పిలిచి లక్షలాది గ్రామాలకు తీసుకువెళ్లారు. 1990 అక్టోబర్ 18వ తేదీన జరిగిన దీపావళి పండుగ దీపాలన్నీ రామజ్యోతులై వెలిగాయి, జ్యోతులతోపాటు లక్షలాది మంది అయోధ్య రావలసిందిగా సందేశం కూడా చేరింది.

          మరొకవైపు అహంకార పూరితుడైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ ఎవరినీ ఉత్తర ప్రదేశ్ లోకి అనుమతించనని, అయోధ్యలో పక్షి కూడా ఎగరకుండా చూస్తానని ప్రకటనలు చేశాడు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులను ఆపివేయడానికి రోడ్లు అన్నింటిని మూసి వేశాడు. అయోధ్యకి వెళ్లవలసిన రైళ్ళు బస్సులన్నింటిని రద్దు చేశాడు. 22వ తేదీ నుండి అన్ని దారులపైన ప్రతి 100 మీటర్లకు ఒక బ్యారికేడ్ చొప్పున నిర్మించి నగరాన్ని దిగ్బంధనం చేయగా అయోధ్య నగరం మొత్తం పోలీస్ స్టేషన్ గా మారింది. 


     దేవోత్థాన ఏకాదశి అక్టోబర్ 30వ తేదీ  రానే వచ్చింది దేశం నలుమూలల నుండి అనేక ఆటంకాలు దాటి స్థానిక ప్రజలు స్వాగతం పలుకుతూ ఉండగా ఆదరించి భోజనం పెట్టి సద్దులు కట్టి పంపుతుండగా అడవుల గుండా, పొలాల గట్ల వెంబడి ప్రయాణిస్తూ  వచ్చిన కరసేవకులు వానర సైన్యం మాదిరిగా అనుకున్న తేదీ,అనుకున్న సమయానికి కరసేవ చేయడానికై అయోధ్య రామజన్మభూమి మందిరము స్థలం వైపు బయలుదేరారు. వారిని దుష్టశక్తులు ఆపే ప్రయత్నాలెన్ని చేసినా జన్మభూమి  స్థలం  చేరనే చేరారు. చూస్తుండగానే గుమ్మటాల పైకెక్కి కాషాయ జెండాను ఎగురవేసారు. బాబర్ కట్టించిన గుమ్మటాలు, గోడలను త్రవ్వి ప్రతీకాత్మకంగా కరసేవను నిర్వహించారు.

       కరసేవ చేయడం కోసం వచ్చినవారు అయోధ్య లోనే ఉండి అనుకున్న పని మొత్తం చేసి వెళ్లడం కోసం నిరీక్షిస్తున్నారు. మరుసటి రోజు నవంబర్ 1 వ తేదీ భజనలు కీర్తనలతో గడిచిపోయింది. కరసేవ చేయడం వలన అహంకారి ముఖ్యమంత్రి ములాయం సింగ్ తల తీసేసి నట్లయింది అవమానం జరిగిందని కోపోద్రిక్తుడై తన పోలీసు బలగాలకు ఆజ్ఞ జారీ చేశాడు.... రెండవ తేదీ ఉదయం నుండే  మరింత సాయుధ పోలీసు బలగాలు వచ్చి చేరుతున్నాయి. ఇవేవీ గమనించని  రామభక్తులు భజనలు కీర్తనలతో సత్యాగ్రహం చేస్తూ వీధుల్లో కూర్చున్నారు. పోలీసు బలగాలు వచ్చీరాగానే స్వాతంత్ర్య పోరాటం సమయం జలియన్ వాలా బాగ్ లో నిరాయుధులను చంపిన భయంకరుడైన డయ్యర్ కన్నా మరింత అధమంగా ఆలోచించిన మూర్ఖ ములాయం నిరాయుధులైన భక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపండని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఘటనలో అనేక మంది ప్రాణాలు అర్పించారు. వేలాది మంది గాయపడ్డారు. బెంగాల్ కలకత్తా నుండి వచ్చిన కొటారి సోదరులిద్దరినీ పట్టుకొని పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చి హత్య చేశారు. ఇలా సాధువులను, సన్యాసులను,సామాన్య ప్రజలను ఎంత మందిని హత్య చేశారో.., కొందరి నైతే ఇసుక బస్తాలను కట్టి సరయూ నదిలో వేశారు, ఇళ్లల్లో దూరి  హత్యలు చేశారు. పోలీసులు  జరిపిన కాల్పులలో  తూటాల తగిలినవారి రక్తం అయోధ్య వీధుల్లో  ధారలై ప్రవహించాయి. ఆనాటి కాల్పులనాటి ఆనవాళ్ళు అయోధ్య వీధుల్లో ఇప్పటికీ కనబడతాయి. ఇలా సాధుజనుల హత్యలు చేసి రాక్షసుడయ్యాడు ములాయంసింగ్.

          బలిదానం అయిన కరసేవకుల అస్తికలను పూజించి యాత్ర రూపంలో తీసుకెళ్లి నదులలో కలుపుతూ ఉండేవారు. ఈ అస్తికలశ యాత్రలలో  కోట్లాది మంది రామభక్తులు పాల్గొన్నారు. ములాయం హత్యాకాండ పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దేశం నలుమూలలా సత్యాగ్రహపు జ్వాలలు ఎగిశాయి. 1991 జనవరి 14వ తేదీ మాఘమేళ సందర్భంగా ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో బలిదానమైన కరసేవకుల అస్థికలను సంపూర్ణంగా నిమజ్జనం చేసి మందిర నిర్మాణం పట్ల నిబద్ధులమై ఉన్నామని మరిన్ని బలిదానాలు చేయడానికి కూడా సిద్ధమేనని లక్షలాదిగా  సాధువులు సన్యాసులు  ప్రజలు ప్రతిజ్ఞలు తీసుకున్నారు.


ప్రపంచ చరిత్రలోనే  పెద్ద సభ :

               ములాయం హత్యాకాండతో ఆగ్రహంతో ఉన్న హిందూ సమాజం ఏప్రిల్ 4వ తేదీ 1991 సంవత్సరం ఢిల్లీలో బోట్స్ క్లబ్ పరిసరాల్లో సాధువులు  సన్యాసుల నాయకత్వంలో విశాలమైన సభ నిర్వహించడానికి నిర్ణయం అయింది.చరిత్ర సృష్టించిన  అద్భుతమైన సభ నాటి సంఘటనలను మనం వివరంగా తెలుసుకోవాల్సిందే.

      1991 ఏప్రిల్ 4వ తేదీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంఖ్యలో ప్రజల్ని సమీకరించిన విశ్వహిందూ పరిషత్.

      ఆరోజు రాత్రి న్యూఢిల్లీ  రైల్వే స్టేషన్లో నిలుచున్న మాకు ఆ రోజుల్లో కొత్తగా ఏర్పాటైన టెలివిజన్లలో బిబిసి న్యూస్ చూసే అవకాశం వచ్చింది. ఆనాటి వార్తల్లో ఢిల్లీలో జరిగిన కార్యక్రమాన్ని గురించి వర్ణిస్తూ చెప్పిన విషయాలు నాకే కాదు  భారత ప్రజలకెప్పటికీ  గుర్తుంటాయి .


 1) 25 లక్షలకు పైగా రామభక్తులైన హిందువులు పాల్గొనిఉంటారని చెబుతూ ఇది ప్రపంచంలోనే  అతి పెద్దదయిన సమావేశమనీ, సభా దృశ్యాలను చూపిస్తూ వర్ణిస్తూ చెప్పారు.

2) సభకొచ్చిన 25 లక్షలకు పైగా ఉన్న  రామభక్తులకు ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు భోజనం, వసతులు కల్పించారని.

3) అంతమంది పాల్గొన్న సభలో ఒక్క పోలీసు  కనిపించలేదని, 

4) లక్షలాదిగా వచ్చిన వారందరూ వేదికపై నుండి చెప్పే సూచనలను పాటిస్తూ క్రమశిక్షణతో కూర్చుండి పోయారని.

          ఇక ఆనాటి సభా వేదిక సరిగ్గా ఢిల్లీ లోనే అతిపెద్దదైన బోట్స్ క్లబ్ మైదానంలో, (రాష్ట్రపతి భవనం ఎదురుగా ) ఏర్పాటు చేయగా, స్వామి నృత్య గోపాల్ దాస్ స్వామి, రామానంద చార్యజీ, సాద్వి ఋతంభర, సాద్వి ఉమాభారతి వంటి అనేకమందిపూజ్య సాధుసంతులతో పాటు,కీర్తిశేషులు పూజనీయ అశోక్ సింగల్ జి, అప్పటి సర్ కార్యవాహ కీర్తిశేషులు మాననీయ శేషాద్రిగారు వంటి  అనేక మంది పెద్దలున్న ఆ వేదికపై   రెండు వందల మందికి పైగా మహాత్ములు కూర్చుని ఉన్నారు. ఆ సభకు గుజరాత్ కు చెందిన పంచఖండ్  పీఠాధిపతి శ్రీధర్మేంద్రజి మహరాజ్ అధ్యక్షత వహించారు.

          రామభక్తులు సభాస్థలమంతా నిండిపోవడమే కాదు,  మొత్తం ఢిల్లీ అంతా నిండిపోయి కిక్కిరిసి ఉన్నారు. సరిగ్గా అదే రోజు అయోధ్య  రామజన్మభూమిలో కరసేవకుల  పైన రాక్షసత్వంతో కాల్పులు జరిపి హత్యలు చేసిన ములాయం సింగ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.ఆ విషయాన్ని ప్రకటించిన పూజ్య సాధ్వి ఋతంభర గారి ఉత్సాహకరమైన ఉపన్యాసం విని ఒక్కసారిగా జయ కారాలు చేస్తూ లేచి నిలబడిన లక్షల మంది ముందుకు నడవడం ప్రారంభించారు.సభలో పాల్గొన్న వారు లేచి ముందుకు రావడం తొక్కిసలాటకు దారి తీసే అవకాశం ఉంది. దానిని ముందే గమనించిన సభా నిర్వాహకులు ధర్మేంద్రజి మహారాజ్ లేచి నిలబడి  సాద్విఋతంభర గారి చేతిలోని  మైకును  తీసుకొని ,

     "జో జో  రామభక్త్ హై  ఓ  వహి బైట్ జాయియే".  (ఎవరైతే  రామభక్తులో వారంతా ఎక్కడి వారక్కడే కూర్చుండి పొండి.) అని చేసిన ఒక్క  సూచనతో లేచి నిల్చున్న లక్షలమంది మరు నిమిషంలోనే క్రమశిక్షణతో కూర్చుండిపోయారు . ఇది నా కళ్ళతో చూసిన అద్భుతమైన ఘటన.

        ఉత్సాహంతో వేలాది మంది బోట్స్ క్లబ్ మైదానంలో ఉన్న వందలాది పెద్దపెద్ద వృక్షాలపై ఎక్కి కూర్చున్నారు. సంఖ్య పెరిగి చెట్లు కొమ్మలు వంగి విరిగిపోయే పరిస్థితిని చూసి 'చెట్లపై హనుమంతుని వలె కూర్చున్న భక్తులారా మీరందరూ మరుక్షణమే దిగి కింద కూర్చోండి',  ఈ సూచన కూడా మంత్రంవలె పనిచేసింది, సూచన తర్వాత మరెవరు చెట్టుపైన కనిపించలేదు. *ఇంత చక్కని మాస్ మేనేజ్మెంట్, మైక్ మేనేజ్మెంట్ దృశ్యాలు కండ్ల ముందు ఇప్పటికీ కదలాడుతున్నాయి.*


  -  ప్రతివీధి మూలమలుపు దగ్గర ప్రతి 500 మీటర్లకు  ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలోని ప్రజలు  వండి   ప్యాకెట్లుగా పంపిన లక్షలాది భోజన పొట్లాలు పాల్గొన్న వారందరి ఆకలితీర్చాయి.

 - తెలుగు రాష్ట్రాలు మరియు దక్షిణాది నుండి సభలో పాల్గొనడానికి వచ్చి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో దిగిన వారికి Bharat scouts guides కు చెందిన విశాలమైన మైదానము మరియు గుడారాలు కలిగిన ప్రదేశంలో వసతి ఏర్పాటు చేశారు.

     ఢిల్లీ బోట్స్ క్లబ్ సభానంతరం తిరుగు ప్రయాణమైన భక్తులు అయోధ్య, మథుర, కాశీ విశ్వేశ్వరుని పుణ్యక్షేత్రాలలో ఆలయాలను దర్శించుకుని అక్కడి పురాతన ఆలయాలను  విధ్వంసం చేసిన ముస్లింల దౌర్జన్యాలకు ఆనవాళ్లుగా కట్టబడిన మసీదు వంటి కట్టడాలను చూసి వేడి నెత్తురుప్పొంగగా, రక్త కన్నీరు కార్చిన రామభక్తులు కసితో తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారు.


ఇంకా ఉంది...

         -ఆకారపు కేశవరాజు.

Tuesday, June 23, 2020

*శ్రీ రామ జన్మభూమి న్యాస్ నేతృత్వంలో రామమందిర ఉద్యమం* (ఉద్యమగాథ-6)

 
*శ్రీ రామ జన్మభూమి న్యాస్ నిర్మాణము:*
       1985వ సంవత్సరం డిసెంబర్ లో మందిర నిర్మాణం కోసం'రామజన్మభూమి న్యాస్' జగద్గురు రామానందాచార్య, శ్రీ శివరామాచార్యజి మహారాజ్ ల నేతృత్వంలో ఏర్పాటయింది.  అట్టి సమితిలో జ్యోతిష్పీఠాధీశ్వరుడైన జగద్గురు శంకరాచార్యులు శాంతానందజి మహారాజ్ (ప్రయాగ) మహంత్ అవైద్యనాథ్ జీ మహారాజ్ (గోరక్ పూర్) పరమహంస రామచంద్రదాస్ జి మహారాజ్, మహంత్ నృత్యగోపాల్ దాస్ జి మహారాజ్, రామ్ కేవల్ దాస్ జి మహారాజ్ (వీరందరూ అయోధ్య) ప్రభుదత్త బ్రహ్మచారిజి మహారాజ్ (ప్రయాగ) మరియు శ్రీదావూదయాళ్ ఖన్నా, శ్రీ విష్ణుహరి దాల్మియా, శ్రీ అశోక్ సింగల్ గారు సభ్యులుగా ఉన్నారు.

*ప్రస్థావిత మందిరం నమూనా:*
        రామ జన్మభూమిలో నిర్మించబోయే భవ్యమైన మందిరం నమూనాను గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన ప్రసిద్ధ శిల్పాచార్యులు శ్రీమాన్ చంద్రకాంత్ సోంపురా గారు (వీరి తాతగారు సోమనాథ మందిరం యొక్క నమూనాను తయారు చేశారు.)  270 ఫీట్ల పొడవు 135 ఫీట్ల వెడల్పు 125 ఫీట్ల ఎత్తు కలిగిన (సుమారు 12 అంతస్థుల భవనం అంత ఎత్తు ) రాళ్ళతో నిర్మాణం చేయబోయే రెండు అంతస్తుల మందిర నిర్మాణం యొక్క  నమూనాను తయారుచేసి ఇచ్చారు. (మనం తరచుగా చూస్తుండే చిత్రం అదే)

                   ఐదవ కేసు:
       జూలై 1వ తేదీ 1989 వ సంవత్సరం అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ పొందిన శ్రీ దేవకీనందన అగ్రవాల్ గారు విరాజమానుడైన 'రామ్ లలా' (బాలరాముడు) మరియు శ్రీరామచంద్రుడు పుట్టిన స్థలం ఈ రెండూ కూడా కోర్టులో కక్షిదారులుగా వాదులుగా ప్రకటిస్తూ రామజన్మభూమి ఆలయ పరిసరాలను 'రామ్ లలా' సంపత్తి గా ప్రకటించాలని మరియు నూతన మందిర నిర్మాణం జరగటానికి వెంటనే అనుమతి ఇవ్వాలని అభ్యంతరాలన్నింటినీ కొట్టివేయాలని కేసు వేశారు.జూలై 1989లోనే దాఖలైన అన్ని కేసులు ఒకే విషయ సంబంధమైనవిగా ప్రకటిస్తూ సామూహిక విచారణ జరిపి త్వరగా తీర్పు ప్రకటించేందుకు గాను అలహాబాద్ హైకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల పీఠం ఎదుట సమర్పించారు.

*రామశిలా పూజలు*
        జనవరి 1989 వ సంవత్సరం పూర్ణ కుంభమేళ సమయంలో ప్రయాగరాజ్ లో మళ్ళీ ధర్మ సంసద్ జరిగింది పూజ్య దేవరహాబాబా సమక్షంలో అయోధ్య రామ జన్మభూమి భవ్య మందిరం నిర్మాణంకోసం గ్రామ గ్రామాల నుండి పూజించబడిన రామశిలలు అయోధ్య పంపించాలని నిర్ణయం కాగా మొదట హిమాలయాలలోని బద్రీనాథ్ ఆలయంలో పూజలు జరిపి పంపగా దేశంలోని  రెండులక్షల డెబ్బైఅయిదు వేల నగరాలు గ్రామాల నుండి రామశిలలు అయోధ్యకు చేరాయి. ఈ కార్యక్రమంలో  6 కోట్ల 25 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. భారతదేశం నలుమూలల నుండేకాక విదేశాల నుండి కూడా వందలాది స్థలాలు నుండి రామశిలలు అయోధ్యకు పంపించ బడ్డాయి.

*శిలాన్యాసం- విప్లవాత్మక నిర్ణయం:*

నవంబర్ 9వ తేదీ 1989 వ సంవత్సరం ఉదయం నిర్ధారిత సమయం ప్రకారం శిలాన్యాస కార్యక్రమం  పూర్తయింది అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హోంమంత్రి బూటాసింగ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి  నారాయణ దత్ తివారి మొదలగు వారి సమ్మతితోనే పూజ్య మహంత్ అవైద్యనాథ్ జి, వీతరాగ్ పూజనీయ వామదేవ్ జీ మరియు మహంత్ రామచంద్ర దాస్ పరమహంస వంటి మహామహుల సమక్షంలో జరిగింది .
         తరతరాలుగా  అంటరానితనాన్ని అనుభవిస్తూ, అక్కడక్కడ ఆలయాలలోనికి కూడా  అనుమతి నిరాకరించబడిన వారి ఇబ్బందులకు చరమగీతం పడుతూ హిందువులందరూ ఒక్కటేనని  ఎవరు కూడా  పతితుడు అంటరానివాడు కాడని అసలు  ఈ అంతరాన్ని తనం  వేద సమ్మతం  కానే కాదని  ప్రకటిస్తూ సామాజిక సమరసతను సాధించేందుకు ఆయాకులాల ప్రతినిధిగా బీహార్ అనుసూచిత వర్గానికి చెందిన  శ్రీకామేశ్వర్ చౌపాల్ గారి చేతుల మీదుగా శిలాన్యాసం జరిగింది దీనితో తరతరాలుగా కొందరు చేస్తున్న వికృత చేష్టలకు చరమగీతం పాడుతూ హిందూ సమాజం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లయ్యింది.
(ఇంకా ఉంది...)

-ఆకారపు కేశవరాజు.

"కరోనోనిల్" ఔషధంతో వైరస్ ను తరిమేద్దాం

" కరోనోనిల్ " ఔషధంతో వైరస్ ని తరిమేద్దాం 

ప్రపంచ చరిత్రలో  ఈ భారత భూమికి 'కరోనా' ను కట్టడి చేసె  ఆయుర్వేద ఔషదాన్ని ఆవిష్కరించిన ఘనత లభించింది.

కరొనా  వైరస్ విషవలయం లో చిక్కుకుని ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్న తరుణంలో, లక్షలాది మంది  ప్రజలు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే, కోట్లాది ప్రజలు భయ భ్రాంతులకు గురై,చడీ చప్పుడు లేకుండా ఇంటికే పరిమితమై భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే, అంతే కాదు ప్రపంచ ఔషధ రంగంలో ఇప్పటి వరకు  పూర్తి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ వచ్చిన అలొపతిక్ వైద్య జగత్తు  దిక్కు తోచక చేష్టలుడిగి చూస్తున్న తరుణంలో చీకటిలో కాంతి రేఖ వోలే భారతీయ ఆయుర్వేదం ఒక అద్భుతం ప్రదర్శించింది.

హిమాలయాల్లో దారితప్పి తిరిగే సన్యాసి,కాషాయ వస్త్రధారి, ధొవతీ కట్టుకున్న సాధారణ మనిషి కరొనాకు మందు కనుక్కొవటమా ?  అంటూ ప్రపంచం ముక్కున వేలేసుకుని ఈర్ష్య, అసూయ లతో ఆశ్చర్యానికి గురౌతున్న సందర్భంలో అసాధ్యాన్ని సాధ్యం చేసి, కోట్లాది ప్రజలకు సోకిన కరొనా వైరస్ నివారణ మందుని మార్కెట్లో ప్రవేశ పెట్టిన ఘనత స్వామి రామ్ దేవ్ బాబా కే దక్కుతుంది. వారు ధరించిన  వస్త్రాలు కాదు గతంలో చేసిన పనులు, నిర్వహించిన భూమిక,దేశ ప్రజలకు చేసిన యొగదానం మొదలైనవి స్వామి రాందేవ్ బాబాని ఆర్తజన బాంధవుడిగా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు.

పతంజలి రీసర్చ్ సెంటర్ మరియు జైపూర్ కి చెందిన నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో 500 మంది శాస్త్రవేత్తలు 3 నెలలుగా సామాజిక దూరం పాటిస్తూ, దివారాత్రులు పరిశ్రమించారు.

'కరోనోనిల్' అను పేరుతో ఒక కిట్ రూపొందించారు. ఈ కిట్ లో 1.అణు తైలమ్ 2.శ్వాసారి 3.కరోనిల్ ఈ మూడు  ఔషధాలు ఉంటాయి. (1)అణు తైలమ్ మూడు నుండి 5చుక్కలు ముక్కులో వేసుకోవాలి, (2)శ్వాసారి మాత్రలు ఖాళీ కడుపుతో 3 పూటలు 3 మాత్రలు, (3)కరోనోనిల్ మాత్రలు తిన్న తరువాత 3 పూటలు 3 మాత్రలు వేసుకోవాలి. 
అంతర్జాతీయ వైద్యశాస్త్ర కొలమానాల కనుగుణంగా నియమాలు పాటించారు. సెంట్రల్ ట్రయల్ ఆఫ్ రిజిస్ట్రి ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందారు. నైతిక ప్రమాణాలు పాటించారు. 
పది రోజుల్లో 100% నయం :
ఈ ఔషధాన్ని 100కు పైగా కరోనా వైరస్ సోకి పాజిటివ్ వచ్చిన రోగులపై ప్రయోగాలు చేశారు. 3 రోజుల్లో 69 శాతం రోగం నయం కాగా,7 రోజుల్లో 100 శాతం నయమైందని డాక్టర్లు ప్రకటించారు.

అల్పలమ్,కాకడాసింగి,అశ్వగంధ,తులసి, తిప్పతీగ  రుదన్తి, అకర్కరా,దాల్చిన చెక్క,సొంఠి, మిరియాలు, లవంగాలు మొదలైనవి వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు పరిశొధన చేసి ఉపయోగించే మూలికలతో పతంజలి రీసర్చ్ సెంటర్ అద్భుత ఆయుర్వేద ఔషదాన్ని ప్రపంచానికి అందించింది.
కరోనా వైరస్ తో, జబ్బు,పడిసం, దగ్గు,జ్వరం వచ్చి, ఊపిరితిత్తులు పని చేయడం ఆగిపోయి,ఉచ్వాస నిస్వాశ లకు ఆటంకం ఏర్పడి ఆక్సీజన్ తగ్గిపోయి,మరణావస్థ లోనికి వెళ్తున్న రోగులలో,రోగ నిరోధక శక్తి ని శక్తిని పెంచి,శ్వాస నిరాటంకంగా కొనసాగే విధంగా బలాన్ని కలిగిస్తుంది.గుండె వేగంగా కొట్టుకోవటం,బ్లడ్ ప్రెషర్,మధుమేహాన్ని మరియు నాడీ వ్యవస్థను నియంత్రించే అత్యద్భుత ఆయుర్వేద ఔషధం "కరోనోనిల్". 

అంతర్జాతీయ జర్నళ్ళలో పతంజలి రీసర్చ్ పత్రాలు ప్రచురించబడి, అందరి ఆమోదం తో రానున్న కొద్దిరోజులలో ప్రపంచ మార్కెట్లలో లభించనున్న 'కరోనోనిల్' ని ప్రజలకు పరిచయం చేయాలి. వ్యాపారం,లాభాల గురించి కాదు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ కనుగొన లేక అంతర్జాతీయ వైద్య జగత్తు తలలు పట్టుకుంటున్న తరుణంలో ప్రజలను పెద్ద విపత్తు నుండి తప్పించే ఔషధంగా భావించాలి.

రాజనీతి వైతాళికుడు శ్యామ ప్రసాద్

దూరదృష్టితో కొందరు మహనీయులు జీవించి ఆశయాలకు ఊపిరిపోసి తమ అడుగుజాడలతో కొంగ్రొత్త సమాజ నిర్మాణానికి బాటలు వేస్తారు. అటువంటి కోవకు చెందిన వారే డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. స్వతంత్ర భారతావనిలో అంతర్భాగమైన కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం అక్కడి ప్రజల వ్యక్తిగత సామాజిక భద్రత కోసం ప్రజా ఉద్యమాలతో పునాదులు వేసి తాను స్థాపించిన రాజకీయ సంస్థ భారతీయ జనసంఘ్ ద్వారా కశ్మీర్ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించారు. తర్వాతి కాలంలో సుధీర్ఘ రాజకీయ ప్రయాణ అనంతరం 75 ఎండ్ల తర్వాత భారతీయ జనసంఘ్ సైద్ధాంతిక రూపమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా కశ్మీరీ ప్రజల హక్కులు కాపాడబడ్డాయి. కాశ్మీరీ ప్రజల హక్కులను కాలరాస్తున్న 35a, 370 అధికరణలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేయడం ద్వారా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను సహకారం చేసింది. డాక్టర్ ముఖర్జీ ప్రారంభించిన ఉద్యమాన్ని జనసంఘం, బీజేపీల అది నాయకులు అటల్ బిహారి వాజ్ పాయ్, ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి శతాబ్దాల పాటు కొనసాగించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు సుందర కాశ్మీరం మనదే , 370 అధికరణ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించాలంటూ లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు ఏళ్ల తరబడి చేసిన నినాదాలను నరేంద్ర మోడీ, అమిత్ షా ల నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నెరవేర్చింది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో సాగిన నాటి ఉద్యమం నేడు ఫలప్రదం కావడం ఆయన ఆశయాలకు భారతీయ సమాజం ఇచ్చిన ఘనమైన నివాళి అవుతుంది.

      ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చెలెంగే.... అంటూ 52 సంవత్సరాల జీవితకాలం 14 ఏళ్ల రాజకీయ జీవితం ఇంతటి స్వల్పకాలంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి చరిత్రలో చిరస్థాయిగా వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. ఆ కోవకు చెందిన వారే డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. 1901 జులై 6న కలకత్తాలో  జన్మించిన శ్యామ ప్రసాద్ అనూహ్యంగా అనుమానాస్పద పరిస్థితుల్లో 1953 జూన్ 23న శ్రీనగర్ లో తుదిశ్వాస విడిచారు. శ్యాం ప్రసాద్ విద్యారంగంలో రాణించి కలకత్తా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పోస్టు గ్రాడ్యుయేషన్ లో అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 
అంతేకాకుండా ఇంగ్లాండులో బారిష్టరు పూర్తిచేసి ఇంగ్లీష్ బార్ లో సభ్యులయ్యారు అక్కడి యూనివర్సిటీల పనితీరు అధ్యయనం చేసి ఇరవై మూడు సంవత్సరాలకే సిండికేట్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ సభ్యులయ్యారు.  33 వెళ్లకే అసాధారణ స్థాయిలో రెండు పర్యాయాలు కలకత్తా   విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్ గా పనిచేశారు. 

             తదనంతర కాలంలో మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో శక్తివంతమైన మతతత్వ పార్టీగా ముస్లిం లీగ్ అవతరిస్తున్న సందర్భంలో ముఖర్జీ శ్యాంప్రసాద్ రాజకీయ రంగంలో ప్రవేశించారు. 1939 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఆల్ ఇండియా హిందూ మహాసభ నాయకులు వినాయక దామోదర్ వీర సావర్కర్ బెంగాల్ లో పర్యటించారు. అదే సమయంలో సావర్కర్ తో ముఖర్జీకి ఏర్పడింది. సావర్కర్ ప్రభావంతో ఆయన హిందూ మహాసభలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు.
       జాతీయ భావాలు కలిగిన శ్యాంప్రసాద్ రాజకీయ ప్రవేశాన్ని గాంధీజీ స్వాగతిస్తూ మదన్ మోహన్ మాలవీయ అనంతరం హిందువులకు నాయకత్వం వహించాల్సిన అవసరం తీరిందని కితాబిచ్చారు. డాక్టర్ ముఖర్జీ సామర్థ్యం పట్ల అపార విశ్వాసం ఉన్న గాంధీజీ ఒత్తిడితోనే ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర హోదాతో మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు.  అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులకు నమ్మదగిన నాయకుడిగా శ్యాం ప్రసాద్ అవతరించారు. ఆల్ ఇండియా హిందూ మహాసభ కార్యనిర్వాహక అధ్యక్షులుగా దేశమంతా విస్తృతంగా పర్యటించారు. అదే సమయంలో 1940 లాహోర్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించడమే కాకుండా మబ్బుపట్టి మసకబారిన భారత వినీలాకాశంలో ఆర్ఎస్ఎస్ ఓ వెలుగురేఖ గా అభివర్ణించారు.భారత రాజకీయాల్లో నిబద్ధత కలిగిన విశ్వాస నాయకుడిగా పేరుతెచ్చుకున్న శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాల్ ప్రభుత్వంలో ముస్లిం లీగ్ దురాగతాలపై పోరాడుతూనే తూర్పు బెంగాల్ గా పిలువబడే నేటి బంగ్లాదేశ్ లో విస్తృతంగా పర్యటించి హిందువులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సమయంలో శ్యాం ప్రసాద్ కు మహాత్మాగాంధీ , సర్దార్ పటేల్ అండగా నిలిచారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రధాని నెహ్రూ అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు, మైనారిటీ సంతూష్టీకరణ విధానాలతో డాక్టర్ ముఖర్జీ భవిష్యత్తులో దేశంలో ఎదురుకానున్న పరిస్థితులను అంచనా వేశారు. ప్రధాని నెహ్రూ వైఖరిని తీవ్రంగా తప్పు పడుతూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం కలకత్తా చేరుకున్న శ్యాంప్రసాద్ ముఖర్జీ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

               ఏ రాజకీయ పార్టీ చెందని నాయకుడిగా కొనసాగుతున్న డాక్టర్ ముఖర్జీ  అప్పటి ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ గురూజీ గోల్వల్కర్ ను కలిశారు.  పార్టీ స్థాపించాలన్న మనోగతాన్ని వెల్లడించిన ముఖర్జీకి ఆర్ఎస్ఎస్ నుండి పూర్తి సహకారం ఉంటుందని గురూజీ గోల్వల్కర్ అభయ హస్తం ఇచ్చారు. గురూజీ గోల్వల్కర్ డాక్టర్ ముఖర్జీ స్థాపించబోయే పార్టీకి పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ , అటల్ బిహారీ వాజపేయి, కుశభావు ఠాక్రే, నానాజీ దేశ్ ముఖ్, సుందర్ సింగ్ బండారి,  జగదీష్ మాథూర్ లాంటి నాయకులను జతచేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల మేధావులు, నాయకులతో జరిపిన చర్చలు , వచ్చిన ప్రతిపాదనలు , ఆలోచనలతో 1951 అక్టోబర్ 21వ తేదీన ఢిల్లీలోని రఘు మల్ ఆర్య కన్యా విద్యాలయంలో జరిగిన సమావేశంలో భారతీయ జనసంఘ్ పార్టీ ఆవిర్భవించింది. ఆవిర్భావ తొలినాళ్లలోనే భారతీయ జనసంఘ్ 1951- 52 ఎన్నికల్లో మూడు లోకసభ స్థానాలను సాధించింది. అదే సమయంలో కాశ్మీర్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతూ వస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా కాశ్మీర్ సమస్యపై న్యాయసమ్మతమైన, ప్రజా ఆమోదమైన పరిష్కారాన్ని డాక్టర్ ముఖర్జీ చూపించినప్పటికి ప్రధాని నెహ్రు అబ్దుల్లా చెప్పినట్లు గానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన శ్యాం ప్రసాద్ కశ్మీర్ సమస్య పై జాతీయవాద ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో షేక్ అబ్దుల్లా నెహ్రు లతో కలిసి త్రైపాక్షిక భేటీ ఏర్పాటు చేయాల్సిందిగా అనేకసార్లు డాక్టర్ ముఖర్జీ ప్రధానికి లేఖలు వ్రాసారు. పరిష్కారం చూపాల్సిన ప్రధాని పండిట్ నెహ్రు కాలయాపన చేస్తుండడంతో ప్రజాందోళనలు మార్గమని నిర్ణయించారు. ప్రజాపరిషత్ పార్టీ పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా నేతృత్వంలో షేక్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా  పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఆందోళనకు శ్యాం ప్రసాద్ సంపూర్ణ బహిరంగ మద్దతు తెలిపారు. అధికారపక్షాన్ని నిలదీసే సభ్యుడిగా ,  ప్రతిపక్ష నేతగా నెహ్రూను భయపెట్టే ఏకైక పార్లమెంటేరియన్ గా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రజల చెరగని ముద్ర వేశారు. కేవలం ఆందోళన కార్యక్రమాలు , ప్రతిపక్షనేత పాత్రకే పరిమితం కాకుండా మరోవైపు తాను స్వహస్తాలతో ప్రారంభించిన భారతీయ జనసంఘ్ పార్టీని దేశమంతా విస్తృత పరిచేందుకు వేగవంతమైన ప్రణాళికను రూపొందించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకుల రూపంలో తనకు అందివచ్చిన యువ నాయకులు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజపేయిలకు కీలక బాధ్యతలు అప్పగించారు. పండిట్ దీన్ ఉదయాలను జాతీయ ప్రధాన కార్యదర్శి గా వాజపేయిని వ్యక్తిగత సహాయకుడిగా ఎంచుకున్నారు. డాక్టర్ ముఖర్జీ  ఆరోజు తీసుకున్న నిర్ణయంతో భారతీయ జనసంఘ్ తదనంతర రూపం భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామానికి విస్తరించి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. ఆయన అడుగుజాడల్లో దీన్ దయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతకర్తగా, మరో నేత అటల్ బిహారీ వాజపేయి కాలక్రమంలో ప్రధానమంత్రిగా దేశానికి విశేష సేవలందించారు. ఓవైపు పార్టీని విస్తరిస్తూనే ప్రధానంగా కశ్మీర్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆనాడు జమ్మూకాశ్మీర్లో ప్రవేశించాలంటే రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలన్న నిబంధన చేశారు. దీనిని జాతి, దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రక్షణ శాఖ అనుమతి లేకుండానే జమ్మూకాశ్మీర్లో పర్యటించాలని నిర్ణయించారు. అక్కడ కశ్మీర్ షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిని ప్రత్యక్షంగా పర్యటించి పర్యవేక్షించి అక్కడ పరిస్థితులను బాహ్య ప్రపంచానికి వివరిస్తూ నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. 

    1953లో 8వ తేదీన ఢిల్లీ నుండి ప్యాసింజర్ రైలులో గురుదత్త వైద్, అటల్ బిహారీ వాజపేయ్,టేక్ చంద్, బలరాజ్ మధోక్ తో పాటు పలువురు పాత్రికేయ మిత్రులతో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జమ్ము కాశ్మీర్ పర్యటన ప్రారంభించారు. అంబాలా,  పఠాన్ కోట్ , జలంధర్ లో పెద్ద ఎత్తున జాతీయవాదులు తరలివచ్చి డాక్టర్ డాక్టర్ ముఖర్జీ తో చేతులు కలిపి స్వాగతిస్తూ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. తూర్పు పంజాబ్ ,జమ్ము కాశ్మీర్ సరిహద్దు లో ఉన్న పఠాన్ కోట్ చేరుకునే ముందు గురుదాస్ పూర్ లో తామే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు డిప్యూటీ కమిషనర్ ముఖర్జీతో పేర్కొన్నారు. అదే సమయంలో వారికి జమ్మూకాశ్మీర్లో ప్రవేశించేందుకు పోలీసులకు ఆదేశాలందాయి అయితే దీని వెనుక పెద్ద పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉందని ప్రపంచానికి తర్వాత తెలిసింది. జమ్ము కాశ్మీర్ లో ప్రవేశం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని దీంతో అక్కడ ఏం జరిగిన ఎదురయ్యే పరిస్థితులను తారుమారు చేయొచ్చని షేక్ అబ్దుల్లా,  ప్రధాని నెహ్రూల కుట్రగా తర్వాత ప్రజలు నిర్దారణకు వచ్చారు. గురుదాస్ పూర్ లో డాక్టర్ ముఖర్జీని అరెస్ట్ చేసివుంటే సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ తో డాక్టర్ శ్యాం ప్రసాద్ బయటకు వచ్చేవారు. డాక్టర్ ముఖర్జీని అరెస్ట్ చేసి రాత్రి బటోటెకు తరలించారు. మరుసటి రోజు ఉదయం శ్రీనగర్ కు తరలించారు. నిర్మానుష్యమైన చిన్న పాటు గదిని సబ్ జైలుగా మార్చి అసౌకర్యాల మధ్య నిర్బంధించారు. దీంతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. అదే ఉద్రిక్త సమయంలో ప్రధాని నెహ్రూ, హోమంత్రి డాక్టర్ కట్జూ 1953 మే 24వ తేదీన శ్రీనగర్లో సందర్శించారు. దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ నుపరామర్శించాలన్న సంస్కారాన్ని వారిద్దరూ మరిచారు. జూన్ 19 - 20 మధ్యరాత్రి డాక్టర్ ముఖర్జీ వెన్నెముక, చాతి నొప్పి తీవ్రమవడం 22వ తేదీ వరకు పూర్తి అనారోగ్యానికి గురయ్యారు.
 
        ఉద్దేశపూర్వకంగానే నెహ్రూ, షేక్ అబ్దుల్లా అటు బెయిల్ ఇవ్వకుండా, ఇటు మెరుగైన వైద్యం అందకుండా చేశారన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో జూన్ 23వ తేదీ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని అధికారులు పోలీసు అదుపులో ఉన్న నాయకులు త్రివేది, పండిట్ ప్రేమనాథ్ డోగ్రా కు సమాచారమందించారు. సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైన, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విచారణ కమిషన్ వేస్తారు. అందుకు కమీషన్స్ ఆప్ ఎంక్వయిరీ యాక్ట్ నైటు 22 అవకాశం కల్పిస్తుంది. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ అదృశ్యంపై 1956 లో షానవాజ్ కమీషన్ , 1970 లో జి.డి ఖోస్లా కమీషన్ , 1999లో మనోజ్  ముఖర్జీ కమీషన్  విచారణ చేపట్టాయి. మహాత్మా గాంధీ హత్య పై కపూర్ కమీషన్, ఇందిరాగాంధీ మరణం పై ఠక్కర్ కమీషన్ , రాజీవ్ గాంధీ మృతిపై జె. ఎస్. వర్మ కమీషన్, ఎమ్. సి. జైన్ కమీషన్ నియమించారు. వీరి మరణాలతో పోలిస్తే డాక్టర్ ముఖర్జీ మరణం భిన్నమైనది. సుప్రీంకోర్టు  పరిధిలో లేని ప్రాంతంలో అనూహ్యంగా, అనుమానాస్పదస్థితిలో రహస్య ప్రాంతంలో మృతిచెందారు. జయప్రకాశ్ నారాయణ, పురుషోత్తం దాస్ టాండన్, హరి విష్ణు కామత్, ఎమ్మార్ జయకర్, మాస్టర్ తారా సింగ్, సుచేత కృపలానీ, పండిట్ హృదయనాథ్ కుంజృ , పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు డాక్టర్ బి.సి.రాయ్, అతుల్యఘోష్ లాంటి ప్రముఖులు డాక్టర్ ముఖర్జీపై మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తీయటి ఓదార్పు పదాలతో సమాధానం ఇచ్చిన ప్రధాని నెహ్రు విచారణ కమిషన్ వేయాలన్న డిమాండ్ తిరస్కరించారు. జాతీయ, అంతర్జాతీయ, సంతుష్టీకరణ రాజకీయ కుట్రల్లో భాగంగా జరిగిన డాక్టర్ ముఖర్జీ మరణం మాత్రం వృధాగా పోలేదు. దేశాన్ని అన్ని రంగాల్లో మేటిగా తీర్చిదిద్దాలన్న ఆయన ఆశయాలు ప్రజలు, పార్టీ, కార్యకర్తల ముందున్నాయి. పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తుంది. ఈ సమయంలో ఆయన ఆశయాలు , పూర్తి తో సమున్నత, సమైక్య భారత్ కలను సాకారం చేసుకునేందుకు మనమంతా కలిసి పనిచేద్దాం. ఇదే బలిదాన దివస్ ప్రతిజ్ఞ....

                                                                         -కొట్టె  మురళీకృష్ణ 
         బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,              తెలంగాణా. 

              

                               (భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి జూన్ 23వ తేదీన బలిదాన్ దివస్ గా నిర్వహిస్తున్న సందర్భం లో) 

Monday, June 22, 2020

శ్రీ పూరి జగన్నాథ రథయాత్ర

      స్వామి మూర్తి నుంచి ప్రసాద వితరణ వరకు ఎన్నో అంశాలలో భిన్నత్వం కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రథోత్సవమే శూన్య మాసంగా వ్యవహరించే ఆషాఢంలో జరగడం ఒక ఉదాహరణ. నిరాటంకంగా సాగిపోయే జగన్నాథ చక్రాలకు కరోనా మహమ్మారి వేగనిరోధకంగా నిలిచింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి కారణంగా ప్రభుత్వ నిబంధనలు ఈ ‘శోభాయాత్ర’ను నిలువరించినట్లయింది.

       సర్వవ్యాపి నారాయణుడి విశిష్ట, వైభవాలను యావత్‌ ‌ప్రపంచానికి చాటుతూ ఉత్తరాదిన బదరీనాథ్‌, ‌ద్వారక, దక్షిణాదిన శ్రీరంగం, తిరుపతి, మధ్య తూర్పున పూరీధామాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. శ్రీమహావిష్ణువు రామేశ్వరంలో స్నానసంధ్యా దులు ముగించుకుని, బదరీనాథ్‌లో అల్ఫాహారం స్వీకరించి, మధ్యాహ్న భోజనానికి పూరి ధామం చేరుకుంటారని, రాత్రి ద్వారకలో విశ్రమిస్తాడని పురాణ గాథ.

       జగన్నాథుడు అంటే విశ్వరక్షకుడు. ఆయనను ‘దారుబ్రహ్మ’అంటారు. మనకు తెలియని బ్రహ్మ పదార్థం ఏదో ఆయనలో ఉంది.

       పూరిని శ్రీ క్షేత్రంగా వ్యవహరిస్తారు. నీలాచలం, నీలాద్రి, జగన్నాథపురి, పురుషోత్తమధామం అనీ అంటారు. శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామాదుల దేవేరులతో కాకుండా అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో జగన్నాథస్వామిగా కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీపీఠం’గా పిలిచే పూరీ ఆలయం 214 అడుగుల ఎత్తయిన గోపురంతో 68 అనుబంధ ఆలయాలతో భక్తజనావళిని అలరిస్తోంది.

  స్వామివారికి పూజాదికాలు ఘనంగా నిర్వహించినా దర్శనం మాత్రం సాధారణంగా, నిరాడంబరంగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు ఉండవు. ‘కోటికి పడగెత్తిన ధనవంతుడూ నీ గుడి ముంగిట సామాన్యుడు’ అని ఒక కవి అన్నట్లు, ఎంతటి ఉన్నతులైనా జగన్నాథుడి ముందు అతి సామాన్యులే. ప్రతి ఉదయం ‘సహనమేళ’పేరుతో దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు నేరుగా ‘రత్నసింహాసనం’ వద్దకు చేరి స్వామిని అతి సమీపం నుంచి దర్శించుకోవచ్చు.


శంకర భగవత్పాదులు

   రామానుజయతీంద్రులు, మధ్వాచార్యులు తదితర ఎందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. పీఠాలు నెలకొల్పారు. శంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా నలుదిక్కులా నెలకొల్పిన నాలుగు పీఠాలలో ఇదీ ఒకటి. దీనిని ‘భోగవర్థన’మఠంగా వ్యవహరిస్తారు. బదరినాథ్‌లో జ్యోతిర్మతి, రామేశ్వరంలో శృంగేరి, ద్వారకలో శారద పీఠాలు స్థాపితమయ్యాయి. వీటిని వరుసగా త్యాగ, భోగ, ఐశ్వర్య క్షేత్రాలుగా అభివర్ణిస్తారు. పూరీ మఠానికి ‘కర్మ’ క్షేత్రమని పేరు. స్వామి సదా తన కన్నుల ముందే ఉండాలంటూ ‘జగన్నాథస్వామి నయన పథగామీ భవతుమే’ అని జగన్నాథాష్టకంలో శంకరులు స్తుతించారు. రామానుజులు వైష్ణవ సంప్రదాయాన్ని ప్రతిష్ఠించేం దుకు ప్రయత్నించారు. ఆయన ద్వారా తెలుగునాట ‘జగన్నాథ సేవ’ ప్రాచుర్యం పొందింది. చైతన్య మహాప్రభువు శేష జీవితం ఇక్కడే గడిపారు. సిక్కుగురువు గురునానక్‌, శ్రీ‌పాదవల్లభులు, కబీర్‌, ‌తులసీదాస్‌ ‌వంటి మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని చరిత్ర. జయదేవుడు స్వామి సన్నిధిలో రచించిన ‘గీత గోవిందం’ కావ్యాన్ని ఆయనకే అంకితమిచ్చారు.

  ఈ క్షేత్రంలోని దేవదేవతా విగ్రహాల నుంచి ఊరేగింపులు, ఉత్సవాలు, ప్రసాద వితరణ వరకు ఎన్నో అంశాలలో ఎన్నో ప్రత్యేకతలు. సాధారణంగా ఆలయాలలో స్వామి మూలరూపం స్వయంభువు గానో, ప్రతిష్ఠించో ఉంటుంది. పూరీనాథుడు జగన్నాథుడు ‘దైవం చెక్కిన దారుశిల్పం’. బలభద్ర, సుభద్ర, జగన్నాథుల విగ్రహాలు మొండి చేతులతో, నడుం వరకే దర్శనమిస్తాయి. విచిత్రంగా… దారుమూర్తులుగా పెద్ద కళ్లు మినహా, కాళ్లు, చేతులు, పెదవులు, చెవులు లేకుండా కేవలం ఒక చెట్టుకు పసుపు, కుంకుమలతో అలంకరించినట్లు ఉంటాయి. బలభద్రుడి విగ్రహం ఐదు అడుగుల ఐదు అంగుళాలు, సుభద్ర విగ్రహం ఐదు అడుగులు, జగన్నాథుని విగ్రహం ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఉంటాయి.

      అవయవ లోపంగల విగ్రహాలు అర్చనకు అనర్హమంటారు. కానీ ఈ నీలాచల క్షేత్రంలో అదే ప్రత్యేకత. ఇందుకు సంబంధించి వాడుకలో ఉన్న కథనం ప్రకారం, పూరీనాథుడికి నీలమాధవుడు అనీ పేరు. విశ్వావసు అనే శబర నాయకుడు ఈ స్వామికి తొలి పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. గంగ వంశీయులు స్వామికి ఆలయం నిర్మించారు. నీలమణితో తయారైన నీలమాధవుని విగ్రహం కాలగర్భంలో కలసిపోగా దాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రయత్నాలు సాగాయి. ‘సముద్రంలో కొట్టుకు వచ్చే కలప దుంగతో తన మూర్తిని చెక్కించవలసింది’గా ఇంద్రద్యుమ్నుడనే రాజును శ్రీ మహావిష్ణువు స్వప్నంలో ఆదేశిస్తారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ కార్యభారాన్ని స్వీకరిస్తారు. 21 రోజలు వరకు తన పనికి ఆటంకం కలిగించవద్దని సూచిస్తారు. అయితే రాజదంపతులు ఉత్సుకతతో పక్షం రోజులకే తలుపులు తెరిపించగా, మూడు ప్రతిమలు అసంపూర్ణంగా కనిపించాయట. శిల్పి జాడలేదు. దాంతో ఆ శిల్పిని సాక్షాత్‌ శ్రీ‌మన్నారాయుణుడిగా భావించిన రాజు తమ పొరపాటునకు చింతించి, ఆ మూర్తులను యథాతథంగా ప్రతిష్ఠించి మందిరం కట్టించారట.


రథయాత్ర వైశిష్ట్యం

     పూరీ పేరు విన్నవెంటనే స్ఫురించేది రథయాత్ర. ప్రపంచంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన పూరీ‘నాథుడి’ రథయాత్రకు గల విశిష్టత, వైభోగం మరెక్కడా లేదు. ఇది విశ్వజనీనమైన వేడుక. ‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే…’ రథంపై ఊరేగే విష్ణుదర్శనంతో పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందునా పూరీ జగన్నాథుడి రథోత్సవం మరింత విశిష్టమైందిగా చెబుతారు. ఇతర క్షేత్రాలలో ఉత్సవమూర్తులు ఆలయ/పురవీధుల్లో విహరిస్తే, ఇక్కడ మూలవిగ్రహాలే తరలి వెళతాయి. ఈ రథయాత్రను సోదరి ప్రేమకు ప్రతీకగా కూడా చెబుతారు. రథయాత్ర నేపథ్యంలో రకరకాలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సోదరి సుభద్రను ఆనందపరచడమే ఈ రథయాత్ర లక్ష్యమంటారు. బలరామకృష్ణులు కంసవధకు బయలుదేరిన ఘట్టానికి ఈ యాత్ర చిహ్నం పేర్కొంటారు. వారితోపాటు వెళ్లాలనుకున్న సుభద్రదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్రని కూడా చెబుతారు.

త్రివిధ రథాలు

ఏ ఆలయంలోనైనా ఊరేగింపు సేవలో ఎప్పడూ ఒకే రథాన్ని వినియోగిస్తారు. ఇందుకు భిన్నం పూరీ క్షేత్రం. ఇక్కడ ఏటా కొత్త రథాలు తయారవుతాయి. ఇతర ఆలయాలలోని దేవదేవేరులను ఒకే రథంలో ఊరేగించడం కనిపిస్తుంది. ఇక్కడ అందుకు భిన్నంగా ముగ్గురికి వాహనాలు. 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో గల బలరాముని రథాన్ని ‘తాళధ్వజం’ అంటారు. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో దీనిని అలంకరిస్తారు. 43 అడుగుల ఎత్తు12 చక్రాలతో గల సుభద్రాదేవి రథాన్ని ‘పద్మధ్వజం’ (దర్పనదళ) అంటారు. ఎర్రటి చారలుగల నలుపు వస్త్రంతో అలంకరిస్తారు. జగన్నాథస్వామి రథాన్ని ‘నందిఘోష్‌’ అం‌టారు. 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తుగల ఈ రథాన్ని ఎరుపు, పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు… ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం గల తాళ్లను కడతారు. గజపతి మహారాజు జగన్నాథుడి తొలిసేవకుడు. రథయాత్ర ఆరంభానికి ముందు ఆయన తన కిరీటాన్ని తీసి నేలపై ఉంచి బంగారు చీపురుతో రథాలను శుభ్రపరచి మంచిగంధం నీటితో కడుగుతారు. దీనిని ‘చెర్రాపహరా’ అని వ్యవహరిస్తారు. దైతపతులనే శబరులు గిరిజన సంప్రదాయం ప్రకారం పెద్ద పూలకిరీటాలు, రంగురంగుపూలు, పూసలతో ‘జగన్నాయకుల’ను అలకరించి, తప్పెట్లు, శంఖనాదాలు, భాజాభజంత్రీల మధ్య పాటలు పాడుతూ విగ్రహాలను రథాలపైకి చేరుస్తారు. శబరులే ఈ పక్రియనంతా నిర్వహిస్తారు తప్ప ఎక్కడా వేద పండితులు ఉండరు.

          ఇతర క్షేత్రాలలో ఉత్సవమూర్తులు పురవీధుల్లో విహరిస్తే, ఇక్కడ మూలవిగ్రహాలే తరలి వెళతాయి. ‘యాత్ర’లో బలభద్రుని రథం ముందుభాగంలో, దాని వెంట సోదరి సుభద్ర రథం వెళుతుంటే, జగన్నాథుడి తేరు వారిని అనుసరిస్తూ చెల్లెలిని సు‘భద్రం’గా చూసుకోవలసిన తీరును బోధిస్తున్నట్లుంటుంది. ఆలయ నిబంధనల ప్రకారం ‘యాత్ర’ ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితల్లోనూ రథం తిరోగ మించకూడదు. ఈ ‘ఘోషయాత్ర’ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని ప్రమాదవ శాత్తు ఎవరైనా రథం కింద పడినా, దారిలో ఏ దుకాణమైనా అడ్డు వచ్చిన రథం వెనకగడుగు వేసే ప్రసక్తి ఉండదు. ఆలయం వద్ద ప్రారంభమైన రథయాత్ర అంగుళం అంగుళం కదులుతూ మూడు కిలోమీటర్ల దూరంలోని గుడించా (దేవతామూర్తులను ప్రతిష్ఠించిన రాజు ఇంద్రుద్యుమ్నుడి పట్టపురాణి గుడించ మందిరమని స్థలపురాణం)ఆలయానికి చేరడానికి 10నుంచి 12 గంటల సమయం పడుతుంది. ఆ రాత్రి ఆరుబయట రథాలలోనే మూలమూర్తులకు విశ్రాంతినిస్తారు. మరునాడు ఉదయం మేళతాళాలతో మందిరంలోకి తీసుకువెళతారు. వారం రోజులు గుడించా ఆతిథ్యం స్వీకరించి దశమినాడు తిరుగు ప్రయాణమవుతారు. దీనిని ‘బహుదాయాత్ర’ అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు శ్రీపీఠం (జగన్నాథ ఆలయం) చేరుకుంటాయి. ఇక్కడా విగ్రహాలు ఆరుబయటే ఉండిపోతాయి. మరునాడు (ఏకాదశి) స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. దీనిని ‘సునావేష’అని వ్యవహరిస్తారు. విగ్రహాలను ఆలయ ప్రవేశం చేయించి, రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర ముగుస్తుంది.

     కులం, భాష, సంస్కృతి, లింగ, పేద – ధనిక, పండిత-పామర, వయోభేద రహితంగా లక్షలాది మంది ఈ రథయాత్రలో పాల్గొంటారు. రథాన్ని లాగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఊరేగింపునకు బయలుదేరిన రథం మరునాడు సూర్యోదయంలోగా యథాస్థానానికి తిరిగి రావలన్నది శాస్త్రవచనం. కానీ ఈ క్షేత్రంలో బయలుదేరిన మూడు రథాలు తొమ్మిది రోజుల తర్వాతే ఆలయానికి చేరుకుంటాయి.


సర్వం శ్రీ జగన్నాథం

      జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. నిత్యం 64 రకాల పిండివంటలను కట్టెలపొయ్యిల మీదనే తయారు చేస్తారు. ఆయన వంటశాల దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలలోని వంటశాలల కంటే పెద్దది. ప్రసాదాలన్నీ మట్టి కుండలలోనే వండుతారు. ఒకసారి వాడిన పాత్రను మరోసారి ఉపయోగించరు. కుండమీద కుండపెట్టి అన్నం వండడం, అన్ని పాత్రలలోని పదార్థం ఒకేలా ఉడకడం విశేషమే. శ్రీ మహాలక్ష్మీ దేవి వంటలను స్వయంగా పర్యవేక్షిస్తారని భక్తుల విశ్వాసం. జగన్నాథుని ప్రసాదం రెండు రకాలు. అన్నప్రసాదం, శుష్క ప్రసాదం. దైవదర్శనం తర్వాత తీసుకునేది అన్నప్రసాదం కాగా, ఇళ్లకు తీసుకువెళ్లేది శుష్కప్రసాదం. మహాప్రసాదం స్వీకరణలో అంటూ సొంటూ ఉండదు. ‘సర్వం శ్రీ జగన్నాథం’ నానుడి అలానే పుట్టిందంటారు. ఎందరు భక్తులు ఎప్పుడు వచ్చినా కాదనకుండా, లేదనుకుండా అన్నం దొరికేది జగన్నాథధామం.


నవకళేబర ఉత్సవం

         ఎనిమిది నుంచి ఇరవై ఏళ్లకోసారి నవకళేబర ఉత్సవం నిర్వహిస్తారు. అంటే గర్భాలయంలోని మూలవిరాట్‌లను ఖననం చేసి, కొత్త విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరం ఉగాదినాడు ఈ ఉత్సవం ప్రారంభమై నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. ఆ సందర్భంగా పాత విగ్రహాలలోని బ్రహ్మ పదార్థాన్ని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహాలలో నిక్షిప్తం చేస్తారు. విగ్రహాలు నిర్మాణం తరువాత సహజసిద్ధంగా ఆకులు, బెరడు నుంచి సేకరించిన రంగులు పూస్తారు. జగన్నాథుడి విగ్రహానికి వాటితోపాటు కస్తూరి నుంచి తీసిన రంగును అద్దుతారు. రథయాత్రకు ముందు రోజు నూతన విగ్రహాలను శ్రీపీఠంపై ప్రతిష్ఠించి విశేష అర్చనాదులు నిర్వహించి భక్తులకు జగన్నాథ దర్శన భాగ్యం కల్పిస్తారు. దీనిని ‘నవ యవ్వన దర్శనం’ అంటారు. ఏటా జరిగే జగన్నాథ రథయాత్రే విశిష్టమైనదనుకుంటే, నవకళేబర ఉత్సవ సంవత్సరం నాటి ‘యాత్ర’ మరింత ప్రత్యేకమైంది. స్వామి వారి నూతన రూప సందర్శనకు భక్తులు పోటెత్తుతారు. ఏటా జరిగే రథోత్సవానికి హాజరయ్యే భక్తుల కంటే సుమారు అయిదారు రెట్లు ఎక్కువగా తరలివస్తారు. నవకళేబర మొదటి ఉత్సవం క్రీ.శ.1308లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ శతాబ్దపు మొదటి ఉత్సవాన్ని అయిదేళ్ల క్రితం (2015)లో నిర్వహించారు. తరువాతి ఉత్సవం 2035లో జరుగుతుంది.


సమానత్వం జగన్నాథ తత్వ్తం

      సర్వమానవ సమానత్వం, లౌకికతత్వ్తం జగన్నాథుని సిద్ధాంతం. దానిని అవగాహన చేసుకుంటే లోకమంతా అనందమయ మవుతుందని, కులమతవర్ణ వైరుధ్యాలకు అతీతమైన సమసమాజం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ స్వామి సన్నిధిలో దర్శనం, అర్చనాదులలో హెచ్చుతగ్గులు, ‘మహాప్రసాద’ స్వీకరణలో తేడాలు, అంటూసొంటూ ఉండదు. ఎంగిలి అంటదు. ఆనందబజారులో ఒకే పంక్తిన ప్రసాదాలు అందచేస్తారు. ఎవరైనా వడ్డించవచ్చు. ఎవరైనా తినవచ్చు. కనుకనే ‘సర్వం శ్రీ జగన్నాథం’ అనేది వాడుకలోకి వచ్చింది. పదార్థాలను పూర్తిగా వినియోగించవలసిందే తప్ప పారవేయడానికి వీలులేదు. ఇక, దేవదేవుడికి అందే సేవలు మానవ జీవిత చక్రాన్ని పోలి ఉంటాయి. ఆయనకు సహితం మానవుడిలా ఆకలిదప్పులు, అనారోగ్యం, మమతలు, అభిమానాలు, అలకలు తదితర లౌకిక జీవన ఘట్టాలు కనిపిస్తాయి. రథోత్సవం ప్రారంభానికి ముందు 108 బిందెలతో దేవతామూర్తులకు మంగళ స్నానం చేయిస్తారు. ఈ ‘సుదీర్ఘ’ స్నానంతో వారు మానవ సహజమైన అనారోగ్యం బారిన పడి, తిరిగి కోలుకునే వరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారట. పదుల సంఖ్యలో రకరకాల ఆహార పదార్థాలు స్వీకరించే భోజన ప్రియస్వామికి అనారోగ్యం కారణంగా ఆ సమయంలో కేవలం కందమూలాలు, పండ్లను ‘పథ్యం’గా సమర్పిస్తారు. రథయాత్ర అనంతరం అంతరాలయ పునః ప్రవేశంతో ‘నేత్రోత్సవం’ పిదప యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు. శ్రీవారు తనను మరచి అన్నా చెల్లెళ్లతో పురవిహారం సాగించారన్న కినుకతో శ్రీమహాలక్ష్మి – జగన్నాథుడిని మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకుందని, స్వామి కొన్ని మధుర పదార్థాలు ఇచ్చి ఆమెను ప్రసన్నం చేసుకొని మందిర ప్రవేశం చేస్తారని కథనం. అర్చకులు ఆ సన్నివేశాన్ని పాటలతో అభినయించడం ఆకట్టుకునే దృశ్యం.

భాగ్యనగరిలో ‘ఉత్కళ’ నాథుడు

    భాగ్యనగర్‌ (‌హైదరాబాద్‌)‌లో ఉత్కళనాథుడు కొలువుదీరాడు. పూరీ ఆలయ శిల్పకళా సౌందర్యానికి ప్రతీకగా బంజారాహిల్స్‌లో ఎకరంన్నర విస్తీర్ణంలో జగన్నాథ మందిరం నిర్మితమైంది. 74 అడుగుల ఎత్తు గోపురంతో కల ఆలయ ప్రాంగణంలో శ్రీమహాలక్ష్మి, కాశీ విశ్వనాథ, విమల (దుర్గాదేవి), గణపతి, హనుమాన్‌, ‌నవగ్రహ ఉపాలయాలు ఉన్నాయి. కళింగ కల్చరల్‌ ‌ట్రస్ట్ ఆధ్వర్యంలో పూరీ క్షేత్రం తరహాలోనే ఇక్కడా అర్చనాదులు నిర్వహిస్తున్నారు.

నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే!

సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్‌!!’


 -‌ డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి


(సేకరణ :-జాగృతి వారపత్రిక)

Sunday, June 21, 2020

*స్వాతంత్ర్యం తర్వాత అయోధ్య ఉద్యమ సంఘర్షణ* (రామజన్మభూమి ఉద్యమగాథ-5)


బాలరాముడు ప్రత్యక్షం కావడం :
        1949 డిసెంబర్ 23వ తేదీ తెల్లవారు జామున నుండి తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. అభ్యంతరం తెలియజేస్తూ కొందరు  కేసు వేయగా ఆరోజు ఏం జరిగిందని అక్కడి రక్షణ బలగాలను ప్రశ్నించగా ఆరోజు ఒక్కసారిగా మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన కాంతి పుంజం కనబడగా ఆ వెలుగుకు నాకళ్ళు మూసుకుపోయాయి అని , కళ్ళు తెరిచి చూస్తే "బాల రాముడు మందిరంలో ప్రత్యక్షమయ్యారు" బాల రాముని దర్శించుకోవడం కోసం వేలాదిగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారని ఈ భవనము బయట సంకీర్తన కూడా ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.

        డిసెంబర్ 29వ తేదీ అప్పటి జిల్లా అధికారి అయిన శ్రీ కే.కే.నాయర్ ఆ ప్రాంతం అంతా వివాదాస్పదమైనదని ప్రకటించి నిషేధాజ్ఞలు జారీ చేశాడు. ఆ కట్టడం యొక్క ముఖ్య ద్వారాన్ని లోహపు తలుపులు బిగించి కట్టడి చేసి తాళం వేశాడు. పక్కనే ఒక చిన్న ద్వారము చేయించి ప్రతిరోజు బాల రాముడికి అర్చన పూజ జరగాలని, కేవలం పూజారి మాత్రమే లోపలికి వెళ్లి పూజలు నిర్వహించాలని భక్తులు  ద్వారం బయటనే  ఉండి దర్శనం చేసుకోవాలని , పూజారికి ప్రభుత్వమే వేతనం ఇవ్వాలని ఆజ్ఞ జారీ చేసి నగరపాలిక అధ్యక్షుడైన శ్రీరామవర్మను రిసీవర్ గా నియుక్తి చేశాడు.
స్వాతంత్ర్యానంతరం కోర్టు మెట్లెక్కిన భక్తులు:
            జనవరి 1950 వ సంవత్సరం ఒక భక్తుడు ఫైజాబాద్ జిల్లా కోర్టులో అయోధ్య రామజన్మభూమిలో వెలసిన బాలరాముడి నిత్యదర్శనము నిత్యపూజ చేసుకోవడంలో ఎదురవుతున్న ఆటంకాలను తొలగించ వలసిందిగా కేసు వేశాడు, ఇదే విషయంపై మరొక భక్తుడు కూడా మరో కేసువేశాడు ఈ రెండు కేసుల్లోనూ భక్తులకు విజయం చేకూరింది. దీనిని హైకోర్టు కూడా నిర్ధారించింది. ఈ మధ్యలోనే 13 మంది అయోధ్యా నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు 'వివాదాస్పదమైన కట్టడము' రామజన్మభూమిపై  ఉన్న మందిరాన్ని పడగొట్టి  నిర్మించారని  అది సహజంగా హిందువులకే  చెందుతుందని మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మెజిస్ట్రేట్ ఎదురుగా శపథపత్రాన్ని రాసి సంతకాలు చేశారు. మూడవ కేసు 1959వ సంవత్సరం బైరాగి సంప్రదాయానికి చెందిన నిర్మోహీ అఖాడా ద్వారా వేయబడింది ఇందులో రిసీవర్ ను తొలగించాలని మరియు మందిరం యొక్క పాలనా వ్యవహారాలను చూడడానికి మహంత్ జగన్నాథ్ దాస్ గారికి అప్పగించాలని కోరారు.

        మరోవైపు 1961 వ సంవత్సరం డిసెంబర్లో కేంద్రీయ సున్నీ వక్ఫ్ బోర్డు ద్వారా కేసు వేయబడింది బాబర్ కట్టడంలో వెలసిన బాలరాముని విగ్రహాలను తొలగించాలని దానిని సాధారణ మసీదుగా ప్రకటించాలని మరియు వక్ఫ్ బోర్డ్ కు అప్పగించాలని కోరారు.

హిందూ సమ్మేళనం, 
గుల్జారీలాల్ నందా సమక్షంలో తీర్మానం:
        1983 సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో హిందూ సమ్మేళనం జరిగింది ఈ సభలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు 'గుల్జారీలాల్ నందా' గారు మరియు మొరదాబాద్ నుండి 5 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ మంత్రివర్యులూ అయిన 'దావూదయాళ్ ఖన్నా' గారు పాల్గొని అయోధ్య శ్రీరామ జన్మభూమి, మథుర శ్రీకృష్ణ జన్మభూమి, కాశీ విశ్వేశ్వరుని మందిరాలపై నిర్మించబడిన మసీదులు ఇప్పటికీ సవాలు విసురుతున్నాయని ఆయా దేవాలయాల విముక్తి జరగాలని చేసిన ప్రసంగము అందరిని ఆకట్టుకొన్నది. ఈ మూడు మందిరాల విముక్తి కోసం సభ తీర్మానం చేసింది. ఈ తీర్మానమే మొట్టమొదటి పౌరతీర్మానంగా మనం భావించాలి.

      అనంతరం శ్రీ రామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి అనే సంస్థ స్థాపన జరిగింది. గోరక్ష పీఠాధీశ్వరుడైన మహంత్ అవైద్యనాథ్ జి మహారాజ్ అధ్యక్షులుగా మరియు దావూదయాళ్ ఖన్నా గారు ప్రధాన కార్యదర్శిగా సమితి ఏర్పాటయింది.

రథయాత్రలు:
          1984 సంవత్సరం అక్టోబర్ ఈ మాసంలో శ్రీ రామ జానకి రథయాత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది దురదృష్టవశాత్తు భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్య కారణంగా ప్రకటించబడిన 'శోక సంవత్సరం' కారణంగా యాత్ర రథయాత్ర ఆగిపోయింది. 1985 అక్టోబర్లో కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో జరిగిన ధర్మసంసద్ లో నిర్ణయం తీసుకోగా మళ్లీ రథయాత్రలు ప్రారంభమై పెద్దఎత్తున ప్రజలని జాగృతం చేయడంలో విజయవంతమయ్యాయి.
 
 ఆలయ తాళం తెరుచుకుంది:
          1984 ఏప్రిల్ 8 వ తేదీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మొదటి ధర్మ సంసద్ జరిగింది. రామజన్మభూమి ఆలయ తాళం తెరవాలని జరిగిన రథయాత్రల అనంతరం 1986 లో రాజీవ్ గాంధీ ప్రధానిగా  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన  వీర బహదూర్ సింగ్  ఉన్న సమయంలో శ్రీ ఉమేష్ పాండే అనే ఒక న్యాయవాది ఫైజాబాద్ జిల్లా కోర్టులో రామజన్మభూమి మందిరం యొక్క తాళం తెరిచి భక్తులకు లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వ వలసినదిగా కోరగా 1986 సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ కె.ఎం.పాండే అనుమతినిస్తు తీర్పు చెప్పగా భక్తులు గర్భగుడిలోకి వెళ్లి దర్శించు కోవడానికై తాళం తెరుచుకుంది.
(ఇంకా వుంది...)

         -ఆకారపు కేశవరాజు.

నవ భారత్ నిర్మాణం దిశగా అడుగులు



నవ భారత్ నిర్మాణం దిశగా అడుగులు


       నరేంద్ర మోదీతో సాధ్యంకానిదంటూ ఏదీ లేదు. ఇది బీజేపీ ఎన్నికల నినాదం కూడా. ఇది కేవలం నినాదంగానే మిగిలిపోలేదు. గత ఆరేళ్ల బీజేపీ పాలన దీన్ని రుజువు చేసింది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ దశాబ్దాలుగా దేశం ఎదుర్కొంటున్న అనేక కఠిన సమస్యలను పరిష్కరించింది. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. ప్రపంచంలో భారతదేశ కీర్తి, ప్రతిష్టలను పెంచింది.


        2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే ముందు.. పదేళ్ల యూపీఏ పాలనలో పైనుండి కింది స్థాయి వరకు అధికార యంత్రాంగం అవినీతిలో కూరుకుపోయింది. భారీ అక్రమూలు అనేకం వెలుగులోకి వచ్చాయి. సంస్కరణల విషయంలో ముందడుగు వేయలేకపోయారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం సంక్షోభస్థాయికి చేరింది. వృద్ధిరేటు మందగించింది. ద్రవ్య లోటు, వాణిజ్య లోటు హద్దులు దాటాయి. ఈ పరిస్థితులు మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశవ్యాప్తంగా జరిగిన తీవ్రవాద దాడులు ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. దీంతో విసిగి వేసారిన ప్రజలు యూపీఏ పాలనకు చరమగీతం పాడారు.


        తన అద్భుత మేధోశక్తితో, సమర్థ నాయకత్వంతో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన అభివృద్ధిని చూసి, ఆయనపై పూర్తి విశ్వాసంతో సంపూర్ణ మెజారిటీ ఇచ్చి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాలనను గాడిలో పెట్టి, అనేక సంస్కరణలు చేపట్టి దేశంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులను సాధించారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు చేయలేని అనేక పనులను ఈ ఆరేళ్లలో చేసి చూపించారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. అంతేకాదు, పారదర్శక పాలనతో సామాన్యులకు సైతం చేరువయ్యారు. జన్‌ధన్‌, ఆధార్‌, ‌మొబైల్‌ ‌త్రయాన్ని ప్రయోగించి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ పథకాల ఫలాలను నేరుగా ప్రజలకు అందేలా చేశారు. పనికిరాని చట్టాలను తొలగించి వ్యాపార సౌలభ్యాన్ని పెంచారు. ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులలో పైరవీలకు చెక్‌ ‌పెట్టింది. ఫలితంగా అసాధారణ సేవలందిస్తున్న అత్యంత సామాన్యులు సైతం పద్మ అవార్డులను అందుకుంటున్నారు.

      ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా, సామాజిక భద్రత, కనీస అవసరాలైన ఇల్లు, గ్యాస్‌, ‌విద్యుత్తు కనెక్షన్‌, ‌మరుగుదొడ్డి, ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం వంటివి కల్పించి పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. సౌరవిద్యుత్తును ప్రోత్సహించి దేశవ్యాప్తంగా 24 గంటలు నిరంతరంగా విద్యుత్తు సరఫరా అయ్యేట్టు చేశారు. కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అంతేకాదు రైతులు పండించిన పంటలకు రికార్డు స్థాయిలో మద్దతు ధరలను పెంచారు.


         తాత్కాలిక ప్రయోజనాలు ఒనగూర్చే పథకాలకు, ప్రజలను పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడేట్లుగా చేసే పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల ఆర్థికశక్తిని పెంచే వాటిపై దృష్టిసారించింది మోదీ ప్రభుత్వం. చిరు వ్యాపారులకు ముద్ర రుణాల ద్వారా రుణ సదుపాయం కల్పించి వారికి స్వయం ఉపాధి అవకాశాలను పెంచింది. స్టార్ట్ అప్‌ ఇం‌డియా, స్టాండ్‌ అప్‌ ఇం‌డియా ద్వారా అంకుర కంపెనీలను ప్రోత్సహిస్తోంది. యువతలో నైపుణ్యాన్నిపెంచడానికి స్కిల్‌ ఇం‌డియా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. తన అంతర్జాతీయ పర్యటనల ద్వారా, దౌత్య చతురతతో మోదీ ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకొని పాకిస్తాన్‌ను ఏకాకి చేశారు. చైనా దూకుడుకు కళ్లెం వేశారు. ప్రపంచ దేశాలతో అనేక ఒప్పందాలు చేసుకొని, విదేశీ పెట్టుబడులను సాధించి, విదేశీ పెట్టుబడిదారులకు భారత్‌ను తమకు ఇష్టమైన గమ్యంగా తీర్చిదిద్దారు.

    ఇలా దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న మోదీ 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తూ 303 స్థానాలు సాధించి తిరిగి రెండవసారి అధికారంలోకి వచ్చారు. గడిచిన ఏడాది అనేక సవాళ్ల మధ్య సాగింది. దేశం ఎదుర్కొంటున్న అనేక కఠిన సమస్యలను నరేంద్ర నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిష్కరించింది.


    

   పాకిస్తాన్‌, ఆఫ్ఘానిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌లలో మతపరమైన వివక్షను ఎదుర్కొని భారత్‌కు వలస వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే బిల్లుకు చట్టబద్ధత కల్పించారు. మతపరమైన వేధింపులు భరించలేక భారత్‌కు వలస వచ్చి దశాబ్దాలుగా ఎటువంటి గుర్తింపు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతూ నలిగిపోతున్న వారికి స్వాంతన చేకూర్చారు. దేశ వ్యతిరేకశక్తులు, కొన్ని ప్రతిపక్షాలు ఈ బిల్లును ద్వారా దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసినా వాటిని మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగింది. త్రివిధ దళాలను సమన్వయం చేయడానికి, సమర్థవంతంగా తమ బాధ్యతల్ని నెరవేర్చడానికి చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ని నియమించాలని రక్షణ వర్గాల నుండి ఏళ్లుగా డిమాండ్‌ ఉం‌ది. దాన్ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

          యూపీఏ తప్పటగుల వల్ల సమస్యల కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేయడానికి, వాటి రుణ సామర్థ్యం పెంచడానికి పది బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసింది. దేశంలో కార్పొరేట్‌ ‌పన్నును 22 శాతానికి తగ్గించి మన వ్యాపార సంస్థలు ప్రపంచ సంస్థలతో పోటీ పడడానికి వీలు కల్పించింది. కొత్తగా ప్రారంభించే ఉత్పత్తి సంస్థలకు కేవలం 15 శాతమే పన్ను విధించి వాటిని ప్రోత్సహిస్తున్నది. వ్యక్తిగత పన్నును కూడా సరళీకరించి మధ్య తరగతి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించింది.


          ఇటీవల యావత్‌ ‌ప్రపంచాన్ని చివురుటాకులా వణికిస్తున్న చైనా మహమ్మారి కరోనా వైరస్‌ ‌నివారణలో సైతం నరేంద్ర మోదీని ప్రపంచ దేశాల నేతలు కూడా కొనియాడారు. సమయానుకూలమైన నిర్ణయాలు, సాహసోపేతమైన చర్యలతో, ప్రజల భాగస్వామ్యంతో భారతదేశం ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా కరోనాను కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడగలిగింది. సరైన సమయంలో లాక్‌డౌన్‌ను విధించి, పటిష్టంగా అమలు చేయడం ద్వారా పెను ప్రమాదం నుండి దేశాన్ని గట్టెక్కించారు. అంతేకాదు, దేశంలో ఆరోగ్య వసతులను పెద్ద ఎత్తున పెంచుకోగలిగాం. కరోనా భారత్‌కు చేరుకునే వరకు ఇలాంటి వైరస్‌లను పరీక్షించి నిర్ధారించేందుకు దేశంలో కేవలం ఒకే ఒక్క పరీక్షా కేంద్రం ఉండేది. ఇప్పుడు 600 పైగా పరీక్షా కేంద్రాలున్నాయి. గతంలో దేశంలో ఏడాదికి 45 వేల పిపిఈ కిట్లు ఉత్పత్తి అయ్యేవి. ఇప్పుడు రోజుకు 3 లక్షల పిపిఈ కిట్లు ఉత్పత్తి జరుగుతున్నది. 3.5 లక్షల ఎన్‌ 95 ‌మాస్కులు ఉత్పత్తి అవుతున్నాయి. 10 లక్షల మందికి ఏకకాలంలో చికిత్స అందించే వసతులు కల్పించారు.


        కరోనా నివారణలో భాగంగా రూ. 20 లక్షల కోట్లను ‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌’ ‌పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. మూడు లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్యాకేజీకి రూపకల్పన చేశారు. మొదటిది లాక్‌డౌన్‌ ‌సందర్భంగా పేద ప్రజలు ఎవరూ కనీస అవసరాలకు ఇబ్బంది పడకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే దేశంలోని 80 కోట్ల మంది పేదలకు మూడు నెలల పాటు మనిషికి 5 కిలోల బియ్యం, కిలో పప్పు సరఫరా చేశారు. 20 కోట్ల మంది జన్‌ధన్‌ ‌ఖాతా కలిగిన మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ. 500 చొప్పున సహాయం అందించారు. వీటికి అదనంగా పెన్షన్‌దారులకు రూ. 1000 అందిస్తున్నారు. వలస కార్మికులకు ఆహారానికి, వసతికి ఇబ్బంది కలుగకూడదని విపత్తు నిర్వహణ నిధుల నుండి ప్రభుత్వం రూ. 11,092 కోట్లు విడుదల చేసింది. ఇలా మొత్తం 1.72 లక్షల కోట్ల రూపాయలతో గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన ద్వారా పేద ప్రజలను, శ్రామికులను ఆదుకునే ప్రయత్నం చేశారు.


       రెండవది, లాక్‌డౌన్‌ ‌కారణంగా ఎవరూ ఉపాధిని కోల్పోవద్దు అనే ఉద్దేశంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి భారత్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టింది. అంతేకాదు, ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవడానికి రూ.30 వేల కోట్లు, ఈక్విటీ ద్వారా మరో రూ.50 వేల కోట్లను ప్రకటించింది. లాక్‌డౌన్‌లో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకూడదని వ్యవసాయ పనులకు మినహాయింపు ఇచ్చి, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవకుండా రాష్ట్రాలకు నిధులందించారు. కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన ద్వారా 73,000 కోట్ల రూపాయలను ముందస్తుగా అందించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేశారు.


       మూడవది, కరోనా కారణంగా ప్రజల జీవన పద్ధతుల్లో వచ్చే మార్పుల కారణంగా వ్యాపార స్థితిగతులు, పరిధులు కూడా మారుతాయి కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా అనేక రంగాల్లో నూతన ప్రభుత్వ విధానాలను ప్రకటించారు. ఇలా గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అంతర్జాతీయ మాంద్యపు పరిస్థితులను, కరోనా పరిస్థితులను ప్రజల భాగస్వామ్యంతో అధిగమించి నవ భారత్‌ ‌నిర్మాణం దిశగా మోదీ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. ఇందులో ప్రధానంగా ప్రశంసించాల్సింది ప్రజలనే. మోదీ పట్ల వారు ప్రకటిస్తున్న అచంచలమైన విశ్వాసమే ఆయన బలం, అస్త్రం. అదే ఈ దేశం బలం కూడా.


ఏనుగుల రాకేష్‌రెడ్డి , బీజేపీ

తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి

(సేకరణ:- జాగృతిి వార పత్రిక)

Saturday, June 20, 2020

మానవాళి ఆరోగ్యానికి ఆయువు పోసేది యోగ*.

మానవాళి ఆరోగ్యానికి ఆయువు పోసేది యోగ*.

         ప్రపంచమంతా అంధకారంలో మునిగి పోయి ఉన్నప్పుడు భారతదేశం ఒక సూర్య బింబమై ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టింది.ఈ జ్ఞానం  కళలు, ఆహారం, ఆరోగ్యం, శాస్త్రం, మనస్సు, శరీరం ఒకటేమిటి బహుముఖీన ప్రజ్ఞతో పరిఢవిల్లింది.

        ఆరోగ్యాన్ని అందించే అశ్వినీదేవతలు,  అగ్నివేశుడు, చరకుడు ,ధన్వంతరి, ప్రపంచంలోనే మొదటి శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు లాంటి గొప్ప వైద్యులు శరీరాన్ని రోగ,జరా,మరణ పీడనాలనుండి రక్షించితే మనస్సును, శరీరాన్ని ఏకం చేసే దివ్యమైన యోగశాస్త్రాన్ని పతంజలి మహర్షి ఈ మానవాళికి అందించిన మహాపురుషుడు. పతంజలి యోగ శాస్త్రానికి దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. చిత్తవృత్తి నిరోధ: అని పతంజలి మహర్షి యోగం అంటే ఏమిటో వివరించారు. వీరు రచించిన యోగ సూత్రాలలో మొత్తం 195 సూత్రాలు ఉన్నాయి. సమాధి, సాధన, విభూతి, కైవల్య పాదాలు అని యోగ సూత్రాలను నాలుగు భాగాలుగా విభజించారు. భగవంతునిపై చిత్తం లగ్నం చేసే సాధనమే యోగ అని పతంజలి మహర్షి పేర్కొన్నారు.

౹        ఈనాడు మహర్షి పతాంజలి సూచించిన మార్గంలో నడుస్తూ ఎందరో సాధకులు అలౌకికానుభూతితో పాటు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకొని వారి వారి జీవితాలను సార్ధకం చేసుకోవడంతో పాటు యోగ విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేస్తున్నారు.
అలాంటివారిలో ఈష ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్, పతంజలి యోగ పీఠం వ్యవస్థాపకులు బాబా రాందేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ,  మహర్షీ మహేశ్ యోగి తదితరులు నేడు యోగ ఔన్నత్యాన్ని నేటి సమాజంలో విస్తృత పర్చుతూ,భారతీయ యోగ,ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచ నలుదెసల చాటుతున్నారు. నేడు ఇటువంటి యోగుల సరసన కర్మయోగియైన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడి గారు భారతీయ సాంస్కృతిక విలువలను,యోగ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు.
 
       నేటి సమాజంలో పెరిగిపోతున్న అశాంతి, అనారోగ్యం, శారీరక, మానసిక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం యోగ సాధన. పరమ పూజ్య సర్ సంఘఛాలక్ జీ  చెప్పినట్లు కరోనా వైరస్ ను ప్రస్తుత పరిస్థితుల్లో అరికట్టే బలమైన ఔషధం యోగ సాధన. అందువల్ల వారు సూచించిన విధంగా యోగసాధన చేస్తూ  శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. యోగ వలన మనసు ప్రశాంతం అయి బుద్ధి వికసిస్తుంది. కరోనా వైరస్ వంటి వైరస్లను,బ్యాక్టీరియాలను తట్టుకొని నిలబడే శారీరక దృఢత్వం పెంపొందుతుంది.
 శరీరము, మనస్సు వజ్రతుల్యమైన స్థితికి చేరడం వలన రోగ,జర వ్యాధులు పీడింపబడవు.
        అందుకే యోగ సాధన యొక్క గొప్పతనాన్ని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో యోగ గొప్పతనాన్ని పేర్కొనడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని ఆ సమావేశంలో వారు ఐక్యరాజ్యసమితిని కోరారు. ఈ ప్రతిపాదనను 193 ప్రపంచ దేశాలు వెంటనే ఆమోదించడం అందుకనుగుణంగా ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించడం జరిగింది. ఇలా మన భారతీయ ప్రాచీన యోగ శాస్త్రానికి అంతర్జాతీయ వేదిక మీద అందలం ఎక్కించి భారత పురా వైభవాన్ని చాటిన నరేంద్రుడి వల్ల మనం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 
        భారత్ మాతాకీ జై.
                  శ్రీ గాజుల రవీందర్ గారు
                  కరీంనగర్ 
                  9848255525

మార్కెట్లో స్వదేశీ సత్తా చూపు... చైనా దూకుడు ఆపు

మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లు, చైనా వాడి బ్రతుకు భారతీయుడి జేబులో ఉంది. మార్కెట్లో సత్తా చూపు - చైనా దూకుడు ఆపు.

చైనాను ఎదిరించేందుకు

     భారత దేశానికి దృఢమైన ప్రధాని ఉన్నాడు. సరిహద్దుల్లో వీర సైనికులున్నారు. మరి 'దృఢమైన దేశభక్త  భారత పౌరులు ఏరీ ? అంటూ భారత మాత వెతుకుతున్నది.కీలక సమయం రానే వచ్చింది.మరి భారతీయుల సత్తా చూపుదామా?


1. స్వామి వివేకానంద - స్వదేశీ 
) దేవాలయం లో కళ్లు మూసుకుని భజన చేస్తూ 'భగవాన్!నీ రూపం అపురూపం, నీ కళ్లు అతి సుందరం' అంటూ భక్తితో జపించటం నేను కాదనను.కాని కళ్లు తెరిచి తమ చుట్టూ చూసుకుంటే లక్షలాది దీనులు,దుఖి:తులు,నిర్భాగ్యులు ఆకలితో అలమటిస్తుంటే, ఆ దరిద్ర నారాయణ స్వరూపులకు కూడా అన్నం పెట్టాలని స్వామి వివేకానంద సూచించాడంటే ఆర్థిక వికాసం గురించి స్వామీజీ కి ఎంత శ్రద్ద వుందో ఆలోచించండి.

ఆ) 1893లో జపాన్ నుండి అమెరికా పడవ లో ప్రయాణం చేస్తూ జంశెడ్జీ టాటా తో జరిగిన సంభాషణ స్వదేశీ చరిత్ర లొనే అపూర్వం. జపాన్ నుండి అగ్గిపెట్టెలు తెచ్చి భారత్ లో కొంత కమిషన్ కి అమ్ముతున్న విషయం తెలుసుకుని,భారత్ లొనే పరిశ్రమ పెట్టి 10మందికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వకూడదు? అన్న స్వామీజీ ప్రశ్నయే ప్రేరణగా గ్రహించి మొదటి ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పి, అలాగే  ముంబాయిలో నూతన సాంకేతిక పరిజ్ఞానపు శాస్త్రీయ  పరిశోధన కేంద్ర స్థాపనకు ఎక్కువ మొత్తంలో ధన సహాయం చేసిన  జంశెడ్జీ టాటా అందరికీ ఆదర్శం. 


2.నౌరోజీ - స్వదేశీ
స్వదేశీ,స్వాతంత్ర్యం,జాతీయ విద్యా , విదేశీ వస్తు బహిష్కరణ -- ఈ నాలుగు సూత్రాలు బోధిస్తూ స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యమించిన మహానుభావుడు దాదా భాయి నౌరోజి. కొంత  ఆడంబరం గల వ్యక్తి యైనప్పటికినీ  ఆంగ్లేయులు 17 లక్షల కోట్ల పౌండ్లు భారత్ నుండి తరలించుకుని పోయి,ఒకప్పటి బంగారు పిచ్చుక నేడు రెక్కలు విరిగి, దేశం కరువు కాటకాలతో  దరిద్రంతో విలవిల్లాడుతోందని తెలిసి, వేదన చెంది బానిసత్వం నుండి దేశం విముక్తి  చెందాలని  ఉద్యమించారు.

3.గాంధీజీ - స్వదేశీ
 
) మోతీ లాల్ నెహ్రూ (జవహర్ లాల్ నెహ్రూ తండ్రి)  ప్యారిస్ లో  ఇస్త్రీ చేసి, తెచ్చిన దుస్తులు ధరించే    వ్యక్తి. అటువంటి ఆయనతో ఖద్దరు ధరింప చేసిన ఘనుడు గాంధీజీ.

) గాంధీ- ఇర్విన్ ఒప్పందం సమయంలో వైస్రాయి ఇర్విన్ కోసం చాయ్ తీసుకుని రాగా,గాంధీజీ కోసం నిమ్మరసం వచ్చింది.చాయ్ లో ఇర్విన్ చక్కెర కలుపుకుంటే, గాంధీజీ తన వద్ద వున్న పొట్లం విప్పి ఉప్పు తీసి నిమ్మరసం లో కలిపాడు. ఇర్విన్ 'ఇదెమిటి?' అని అడిగినప్పుడు "మా నిత్యావసర వస్తువైన ఉప్పుపై మీరు పన్ను విధించారు. ఆ శాసనాన్ని వ్యతిరేకిస్తూ మేము స్వయంగా తయారు చేసిన ఉప్పుని కలుపుకుని మీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాను"అని గాంధీజీ అన్నారు.ఇదీ స్వదేశీ భావన అంటే.

 ). గాంధీజీ విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని గోపాల కృష్ణ గోఖలే గారిని కలిసి, తాను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే విషయం ప్రస్తావిస్తే,  'సూట్ బూట్ వేసుకుని,ఇంగ్లీష్ మాట్లాడితే  జనం నమ్మరు' అని చెప్పి, దేశీయంగా కనబడాలని సూచిస్తారు. గాంధీజీ  మధురై వెళ్లి ధొవతీ ధరించి, దేశమంతా తిరిగి ప్రజల హృదయాలలో స్వాతంత్య్ర భావాలు నింపాడు. ఆసేతుహిమాచలం ప్రజలతో మమేకమై స్వదేశీ ఉద్యమానికి గాంధీజీ నేతృత్వం వహించారు.

 4. అబ్దుల్ కలాం - స్వదేశీ
డా అబ్దుల్ కలాం శాస్త్రవేత్త గా వున్న రోజుల్లో జరిగిన సంఘటన.
అంతరిక్షంలోనికి పంపే ఉపగ్రహాలను మొసుకుని పోయే క్రయొజనిక్ రాకేట్లను అడిగితే  రష్యా,అమెరికా,జపాన్ తదితర దేశాలు తిరస్కరించాయి. ఆ రాకేట్లలో వుంచే డయాఫ్రేంలు ఇవ్వడానికి అమెరికా ఒప్పుకుని చివరి దశలో 'ఇది మా  రక్షణ వ్యూహం లో భాగం కాబట్టి ఇవ్వలెము' అన్నది. డయా ఫ్రేములలో వుంచే రాడ్ లు జపాన్ నుంచి వస్తాయి.'ప్జపాన్' రాడ్ లు ఇవ్వలేదు. వాటిలో ఉపయోగించే ముడి ఖనిజం పేరు 'బెరిలియం'. ఇది మన ఝర్ఖండ్ లో విరివిగా దొరుకుతుంది.వెంటనే డా  కలాం సూచన మేరకు మన ప్రభుత్వం బెరిలియం ఎగుమతిని 4 సంవత్సరాలు నిషేధించడం జరిగింది. ఆ సమయంలోనే కలాం శాస్త్రవేత్తల బృందం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయొజనిక్ రాకేట్లు  రూపొందించారు.
విదేశాలపై ఆధారపడితే దీర్ఘ కాలం లో బానిసత్వం తప్పదని డా కలాం హెచ్చరించారు.

     గాంధీజీ రాట్నం పట్టి నూలు వాడికినా, డాll అబ్దుల్ కలాం రాకెట్ పట్టి,టెక్నాలజీ కనిపెట్టినా, సందేశం ఒక్కటే.. స్వావలంబన కోసం స్వాతంత్ర్యం కావాలని ఒకరు, స్వాతంత్ర్యం కోసం  దేశ సరిహద్దులు రక్షించుకోవాలని ఇంకొకరు. ఇద్దరు కూడా  స్వదేశీ కోసం పరితపించిన  వారే......
'స్వదేశీ' అనే శబ్దం  హృదయం నుండి సహజసిద్ధంగా పొంగిపొరలే ఆత్మాభిమానం.



      ఆంగ్లేయులతో జరిపిన వ్యాపారం మన కొంప ముంచిందన్న చరిత్ర గుణపాఠాలు గుర్తులేవా? 17 లక్షల కోట్ల పౌండ్లు ఇంగ్లాండ్ కి తరలించుకునిపోయి, భారత్ ని పేద దేశంగా,బానిస దేశంగా మార్చిన ఘటనలు 70 ఏళ్లు గడవక ముందే పునరావృతం అవుతున్నది నిజమే అయితే మరో ఆర్థిక స్వాతంత్య్ర పోరాటానికి  నేటి యువతీ యువకులు నడుము కట్టాల్సిందే.

      1850 - 1904 మధ్య కాలం లో నౌరోజీ,గోఖలే,తిలక్,రానడె తదితరులు స్వదేశీకి శ్రీకారం చుట్టారు. 1871-72 బాబూ రామ్ కూకా ఆధ్వర్యంలో నామధారీలు స్వదేశీ ఉద్యమం నడిపించారు.

   1905 లో లార్డ్ కర్జన్ ప్రకటించిన  'వంగ విభజన' దేశమంతటా ప్రకంపనలు సృష్టించింది. ఇంగ్లాండు లోని మాంచెస్టర్ లో తయారై వచ్చిన వస్త్రాలను కుప్పలుగా పోసి దహనం చేసి హొళీ జరుపుకున్నారు. గంగానదిలో స్నానం చేసి,పాద రక్షలు లేకుండా కాలి నడకన యాత్రలు చేస్తూ స్వదేశీ భావనను రగుల్కొల్పారు.
సురేంద్రనాథ్ బెనర్జీ,కేకే మిత్రా,పృథ్వీశ్ చంద్ర రాయ్,అజిత్ సింగ్,సయ్యద్ హైదర్ రజా, అబ్దుల్ రసూల్,లియఖత్ హుస్సేన్, చిదంబరం పిళ్లై , అరబింద ఘోస్, స్వాతంత్ర్య వీర సావర్కర్, లాల్, బాల్, పాల్ వంటి దేశభక్త యోధులు స్వదేశీ ఉద్యమానికి ప్రాణం పోశారు. గణపతి నవరాతృలు, శివాజీ జయంత్యుత్సవాల  ద్వారా  'విదేశీ వస్తువులు - ఇంగ్లాండు కుటిల నీతి" ని ఎండగడుతూ ప్రజలను జాగృతం చేశారు.

 రాజీవ్ దీక్షిత్  స్వదేశీ  
   ఉపన్యాసాలు,రచనలు లక్షలాది ప్రజలలో ఆలోచనలు రేకెత్తించాయి. యోగ సాధకులు స్వామి రామ్ దేవ్ బాబా దేశీయ వస్తువుల ఆవశ్యకత గురించి చేసిన  ప్రసంగాలతో కూడిన యోగాసనాలు దేశ నలుమూలలా ప్రజలలో  స్వాభిమానాన్ని నెలకొల్పి , విదేశీ వస్తువుల కొనుగోలుని తగ్గించింది. పతంజలితో పాటు స్వదేశీ కంపనీల తయారీ వస్తువులకు డిమాండ్ పెరిగింది. 

       విదేశీ కంపనీ వస్తువులకు డబ్బు ఖర్చు పెడితే, ఆ ధనం విదేశాలకు తరలి పోతుంది. కనీసం దేశానికి విపత్తులు వచ్చినప్పుడు కూడా విదేశీ కంపనీలు ఒక్క పైసా కూడా విదల్చవు. చైనా ప్రతి సంవత్సరం 24 వేల కోట్ల రూపాయలు పైగా మొత్తం  తన దేశానికి దోచుకుని పోతూ, ఆ ధనంతో ఆయుధాలు తయారుచేసి,సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తుంటే, అంతెందుకు?   నిన్న గాక మొన్న మన 20 మంది  జవానుల ప్రాణాలు తీసి రాక్షస కృత్యానికి ఒడిగట్టింది. మన వేలుతో మన కంటినే పొడుచుకుందామా? మన డబ్బుతో చైనా వస్తువులు కొని,  మనపైకి శతృవులని కొని తెచ్చుకుని  ఆర్థిక  స్వాతంత్య్రం కోల్పోదామా? 

       స్వాతంత్య్ర పోరాట క్రమంలో  విదేశీ వస్త్రాలు ధరించిన వారి బట్టలు రజకులు ఉతక లేదని, విదేశీ పారితోషకాలు ఇచ్చుకునే వివాహాలు పురోహితులు జరపలేదని, ఆంగ్లేయుల జుట్టుని మంగలి వారు కత్తిరించలేదని చరిత్రలో చదివిన తర్వాత, స్వదేశీ భావన నివురుగప్పిన నిప్పు వలె సాధారణ భారతీయుల గుండెల్లో దాగివుండి, నేడో రేపో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, ఆర్థిక,భౌగోళిక దురాక్రమణతో చొచ్చుకుని వస్తున్న చైనాను మాడ్చి మసి చేయగలవు.

     మన వస్తువులు కొంటే మన అంటే 130 కోట్ల భారతీయుల డబ్బు ఈ దేశంలోనే ఇల్లిల్లూ తిరిగి,పరిశ్రమలను నిలబెడుతుంది, ఉద్యోగులకు భద్రతనిస్తుంది. వలస కార్మికుల పని హక్కుని కాపాడుతుంది. వెనుక బడిన, అట్టడుగు వర్గాలకు చెందిన  లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతుంది. చైనాకి  చెందిన  సూది మొదలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవీ కూడా ఒక్క సంవత్సరం వరకు కొనడం మానెయండి..ఆ తర్వాత  చైనా కాళ్ల బేరానికి రాకపోతే  చూడండి.

--- అప్పాల ప్రసాద్

*మరణం లేని మహావీరులు*

*మరణం లేని మహావీరులు*          "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...