Thursday, December 31, 2020

కొంత విషాదాన్ని కొంత కనువిప్పును కలిగించి తెరమరుగు అవుతున్న 2020

కొంత విషాదాన్ని కొంత కనువిప్పును  కలిగించి తెరమరుగు అవుతున్న 2020
ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబర్ 31 గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత 2020 వ సంవత్సరం కాలప్రవాహంలో కలిసిపోయి 2021 తెరపైకి వస్తుంది.  మన పంచాంగం ప్రకారం శ్రీ శార్వరి నామ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన ముగిసిపోయి,  ఏప్రిల్ 13వ తేదీ నాడు ప్లవ నామ సంవత్సరం వస్తుంది.  2020సంవత్సరం వస్తూ వస్తూ కోవిడ్ మహమ్మారిని వెంటబెట్టుకుని వచ్చింది అది వెళ్ళిపోతూ కోవిద్ ను  ఇక్కడే వదిలి ఒంటరిగా వెళ్ళి పోతున్నది.
 
    Covid 19 మహమ్మారి మానవజాతి చెరిపేసుకున్నా  అనేక హద్దుల రేఖలను యూటర్న్ చేసింది,  ఆరోగ్యం కోసం కొన్ని పరిమితుల హద్దులు ఉండాలని గుర్తు చేసింది.  ప్రజలు దానిని అర్థం చేసుకునే లోపే అది  తన ప్రతాపం ఏమిటో ప్రపంచానికి  చూపించింది  భయాల మధ్య ప్రజల మనుగడను నెట్టివేసింది,  మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది.   అనేక లక్షల మందిని కబళించింది,  కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రశ్నార్థకం చేసింది,  ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రపంచ మానవాళి  పెనుగులాటలలో  ఉంది దీనికి సరైన ఔషధము ఇంతవరకూ కనుక్కోలేదు ఆ ప్రయత్నాలలో ప్రపంచంలో అనేక  దేశాల వైద్య శాస్త్రజ్ఞులు  కృషి చేస్తున్నారు. గడచిన వందేళ్లలో 2020 లాంటి సంవత్సరాన్ని ఎరుగం. మానవాళి ఇలా ఓ మహమ్మారి బారిన పడింది... 1914-18 మధ్యకాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రెండు కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా, మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక 1918-20 కాలంలో. అప్పట్లో స్పానిష్‌ ఫ్లూ దాదాపు 50 కోట్ల మందికి సోకింది. ప్రపంచ జనాభాలో అది మూడో వంతు. అయిదు కోట్ల నుంచి పది కోట్ల మంది ఆ అంటువ్యాధికి బలయ్యారు. ఒక్క భారతదేశంలోనే ఒకటిన్నర కోట్ల నుంచి రెండు కోట్ల మంది దాకా మృతులైనట్లు అంచనా. నాటి మహమ్మారితో పోలిస్తే కొవిడ్‌ తీవ్రత తక్కువే. స్పానిష్‌ ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినవారిలో 10 నుంచి 20 శాతం మృతి చెందగా, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ మరణాలు ఒకశాతంలోపే ఉన్నాయి. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక విధ్వంసం మాత్రం అప్పట్లో కంటే అనేక రెట్లు ఎక్కువ స్పానిష్‌ ఫ్లూ సృష్టించిన విధ్వంసం చరిత్రలో ఎవరూ మరచిపోలేనిది. తమ జనాభాలో ఎక్కువ మంది కొవిడ్‌ బారిన పడటం చాలా దేశాలను వణికించింది. ఇతర  దేశాల్లో కంటే మన దేశంలో వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉంది. వ్యాధి సోకినవారిలోనూ ఎక్కువమందిలో తీవ్రత తక్కువగా ఉంది. ఫ్లూ, ఇతర కరోనా సమస్యలకు మనలో జన్యుపరమైన నిరోధం ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం కావచ్చు.

విపత్తులు
                                                                 మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్న ఎనిమిది సాంక్రామిక వ్యాధుల జాబితాలో ఊహకందని మరో ఉపద్రవమూ పొంచి ఉందంటూ 2018 జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు హెచ్చరిక చేసింది. జన చైనాలో పుట్టి అచిరకాలంలోనే పలు దేశాల్ని చుట్టబెట్టిన మహమ్మారికి కొవిడ్‌ అని డబ్ల్యూహెచ్ఓ నామకరణం చేసి పారాహుషార్‌ పలికినా- ప్రపంచాన్నే సరిహద్దుల్లేని సంగ్రామస్థలిగా మార్చేసిన కరోనా ఈ ఏడాదంతా సామాజిక ఆర్థిక విలయాన్నే సృష్టించింది. దేశ దేశాల్లో ఎనిమిది కోట్ల మందికి సోకి 18 లక్షల మందికిపైగా అభాగ్యుల్ని కబళించిన కొవిడ్‌ ప్రపంచార్థికానికి కలిగించిన నష్టం రూ.150 లక్షల కోట్ల పై మాటే ఇండియాలో లాక్‌డౌన్‌ కారణంగా స్థూలదేశీయోత్పత్తికి వాటిల్లిన నష్టం రూ.20 లక్షల కోట్లని అంచనా. ఉన్న ఊళ్లో ఉపాధి కరవై రవాణా సేవలు నిలిచిపోయిన వేళ బిడ్డల్ని చంకనెత్తుకొని వందల కిలోమీటర్లు నడుచుకొంటూ సొంతూళ్లకు పయనమైన లక్షలాది వలస శ్రామికుల వెతల పయనాన్ని మించిన మానవ మహా విషాదం ఉందా? దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించినా నేటికీ విద్యాసంస్థల్ని తెరవలేని పరిస్థితి, ఉపాధి మార్గాలు పూర్తిగా తెరుచుకోని దుస్థితి, ఆరోగ్య సేవలూ అన్ని స్థాయుల్లో అందుబాటులోకి రాని వైనం, సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలకూ అంతరాయం వంటివన్నీ కొవిడ్‌ విసిరిన ప్రచ్ఛన్న సవాళ్లే.  ఆ జాడ్యాలను రూపుమాపే సమర్థ కార్యాచరణ ప్రభుత్వాలనుంచి ప్రజలు ఆశిస్తోంది అది నేటి తక్షణ  అవసరం.  
                                             .  
 ఆర్థిక వికాసానికి  దోహదపడే చర్యలు 

      ఆర్థిక అసమానతలు...అనారోగ్యం వల్ల ఆదాయాన్ని కోల్పోవడం, చికిత్స కోసం జేబులో నుంచి ఖర్చు వల్ల దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలు ఏటా పేదరికంలోకి కుంగిపోతున్నారు. కాస్త చెప్పుకోదగిన స్థాయి నాణ్యమైన ఆరోగ్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తే చాలు ఆరోగ్య సంరక్షణతో పాటు మనం మౌలిక వసతుల నిర్మాణానికి, విద్య-నైపుణ్యాలను మెరుగుపరచడానికి, ఉపాధి ఆధారిత పరిశ్రమలను, సేవలను ప్రోత్సహించడానికి శరవేగంగా చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ సంక్షోభ సమయంలో జరిగిన సరఫరా గొలుసుల విచ్ఛిన్నం ప్రపంచ లావాదేవీల రీతిలో మార్పు తెచ్చింది. భారత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన దేశం 10-15 మెగా ఇండస్ట్రియల్‌ పార్కుల్ని పారిశ్రామిక కేంద్రాలుగా ఏర్పాటు చేయాలి. ఒక్కో దాంట్లో 25,000 - 50,000 ఎకరాల భూబ్యాంక్‌ను అందుబాటులో ఉంచాలి. ఈ పార్కుల వరకైనా ప్రపంచ స్థాయి మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసి, అనవసరమైన నియంత్రణల్ని తొలగించాలి. ఎన్ని ఉద్యోగాలిస్తారనే ప్రాతిపదికన ప్రోత్సాహకాలు కల్పించాలి. దీంతోపాటు, పెద్దయెత్తున కార్మికుల అవసరం ఉండే పరిశ్రమలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టి వస్త్ర, రెడీమేడ్‌, పాదరక్షలు, బొమ్మలు, తోలు, ఎలెక్ట్రానిక్స్‌ తదితరాల్లో అనవసర నిబంధనలన్నింటినీ తీసి పారేయాలి అప్పుడే ఈ దేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం అవుతుంది     కొవిడ్‌ ప్రభావం వ్యవసాయం మీద కన్నా పరిశ్రమలు, సేవల రంగాలపై ఎంతో ఎక్కువగా ఉంది. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. దాదాపు 30 కోట్ల మంది కొత్తగా పేదలు, పస్తులుండేవారి జాబితాలో చేరిపోయారు. 1929 నాటి మహా మాంద్యం సృష్టించిన ఆర్థిక విధ్వంసాని కన్నా ఇదేమీ తక్కువ కాదు ఇళ్లలో పనిచేసే శ్రామికుల్లో అనేక మందికి తిరిగి ఉద్యోగాలు లభించవు. వాషింగ్‌ మెషీన్లు, రోబో స్వీపర్లు తదితర వినియోగ వస్తువులతో పనుల్ని సొంతంగా చేసుకోవడాన్ని మధ్యతరగతి ప్రజానీకం అలవరచుకొంది. పేద వర్గాల్లో మహిళలు సంపద సృష్టిలో భాగం కావడం ఇప్పటికే ప్రమాదకర రీతిలో పడిపోతోంది. ఉపాధి కలాపాల్లో మహిళల వాటా తగ్గుతున్న పెద్ద దేశం ప్రపంచంలో భారత్‌ ఒక్కటే. కొవిడ్‌ నుంచి భారత్  మూడు పెద్ద పాఠాలను నేర్చుకోవాల్సి ఉంది. 1}, అభివృద్ధి చెందుతున్న      దేశాలను... ముఖ్యంగా భారత్‌ను పీడిస్తున్న ఆరోగ్య రంగ సంక్షోభం, ఆదాయ అసమానతలకు సంబంధించినది.2} గత శతాబ్దంలో పర్యావరణ విధ్వంసం వల్ల భవిష్యత్తులో తలెత్తే అవకాశమున్న ఆరోగ్య సంక్షోభాలకు సంబంధించినది. 3}, వచ్చే 30 ఏళ్లలో మన పిల్లలు ఎదుర్కోబోతున్న భూతాప (గ్లోబల్‌ వార్మింగ్‌) పెరుగుదల సంక్షోభం. మరిన్ని మహమ్మారులు, గ్లోబల్‌ వార్మింగ్‌... ఈ రెండూ ప్రపంచ స్థాయి సవాళ్లు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి చర్యలు అవసరం.

గుర్తించదగిన సంఘటనలు  

        ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తుల జీవితాలను ప్రశార్థకం చేసిన సంవత్సరం 2020. భారతదేశంలో  కరోనావైరస్ భారత్ లో  తుఫానులు,  హిమాలయాలపై చైనా తో ఉద్రిక్తతలు, ఆర్థిక అంతరాలుమొదలైన  అనూహ్య సంఘటనల పరంపర కొనసాగింది.  1]2020 సెప్టెంబరులో, పార్లమెంటు ఉభయ సభలునిరసనల మధ్య  మధ్య వ్యవసాయ బిల్లులను ఆమోదించాయి దానిపై పంజాబ్-హర్యానా రైతుల నిరసనలు  కొనసాగుతున్నాయి పౌరసత్వ చట్టాన్ని వివాదాస్పద చట్టంగా చిత్రీకరించి దానిపై నిరసనలు జరిగాయి. భారత్ నుండి విడిపోయిన భూభాగాలైన పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ల నుండి ముస్లింలు  కానివారు రక్షణ కోసం భారత్ కు వస్తే వారికోసం పౌరసత్వ చట్టాన్నిచేసారు. ముస్లిం ల కోసం కూడా ఉండాలని ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి ఢిల్లీ లోని షాహిన్ భాగ్ లో నిరసనలు దాడులు జరిగాయి చివరకు మతకలహాల కు దారితీసింది. 2} లడఖ్‌లో ఎల్‌ఒసి వెంట భారత్-చైనా ఘర్షణ కొనసాగుతున్నది స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి హిమాలయాలలో సమస్యల తీవ్రత పెరుగు వచ్చింది చైనా ఆకస్మికంగా లద్ధక్ లో ఆక్రమణకు దిగింది అక్కడ జరిగిన ఘర్షణలలో 20మంది భారతీయ సైనికులు బలిదానమైనారు చైనా సైనికులుఎంత  మంది చనిపోయారో చైనా ప్రకటించలేదు. ఉద్రిక్తత కొనసాగుతూనే ఉన్నాయి మొత్తానికి హిమాలయాలలో తలెత్తిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవటానికి భారత్ కృత నిశ్చయంతో ఉన్నది. అట్లాగే 490సంవత్సరాలు నలుగుతున్న అయోధ్య సమస్య  పరిష్కరించబడి 2020 Aug 5 భవ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ (శిలాన్యాస్) జరగటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.

  మనదైన  జీవనం 

        2020వ సంవత్సరం అనేక సమస్యలను తెచ్చిన దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే అనేక మలుపులు కూడా తిప్పింది గ్రామాల  సమగ్రాభివృద్ధికి తెరలేపింది ప్రజలు మళ్ళీ ఒక్కసారి. పరంపరాగత భారతీయ ఆయుర్వేదం వైపు మళ్లారు. దృష్టి మళ్లుతున్న భారతీయ జీవనం మళ్ళీ  తెరపైకి వచ్చింది ఆహారవిహారాలలో చాల మార్పులు తెచ్చింది. అడంబరాలు,   భేషజాలు సరియినవి కాదని కూడా కోవిడ్ గుర్తుచేసింది. సాంకేతికత ఆవసరానుకూలంగా ఉపయోగపడింది, ఇట్లా చెప్పుకుంటూపోతే మన జీవితాలలో  అనేక మేలి మలుపులు కూడా తిప్పింది  కోవిద్ 19 మొత్తానికి మనదేశాన్ని ప్రపంచాన్ని U-turn చేసింది దీనిలో దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా  ఉన్నాయి. 2020 మొత్తానికి    కొంత   విషాదాన్ని కొంత కనువిప్పును కలిగించి వెళ్ళిపోతున్నది.

Saturday, December 19, 2020

స్వచ్ఛతకోసం తపించిన సంత్ గాడ్గే బాబా

స్వచ్ఛతకోసం తపించిన సంత్ గాడ్గే బాబా
    పరిశుభ్రత దైవమని నిర్వచించిన తొలి సంస్కర్త, చీపురుతో వీధుల్ని- కీర్తనలతో మస్తిష్కాలను శుభ్రం చేసిన వాగ్గేయకారుడు, బడిలో ఆధ్యాత్మికతను వెతికిన వాడు, నిమ్న వర్గాలకు అంబేద్కరే దేవుడు అన్న దార్శనికుడు, సామాజిక న్యాయం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు, మెహర్ బాబాకి ఆత్మీయుడు, సమస్త ఛాందసాలను హేతువుతో ఖండించిన సాధువు ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణ వాది, యావత్ జీవితాన్ని సమాజానికి అర్పించిన సర్వసంగ పరిత్యాగి సంత్ గాడ్గే బాబా.
     సంత్ గాడ్గే బాబా అసలు పేరు దేబు. ఇతను జింగ్రా, సక్కుబాయిలకు 1870 ఫిబ్రవరి 23వ తేదీన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో షేన్ గావ్ అనే చిన్న పల్లెటూరులో ఒక రజక కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి మేనమామ ఇంట్లో పెరిగాడు. ముక్కుపచ్చలారని వయసునుంచే పగలంతా చాకిరీ చేసే వాడు. రాత్రి అయితే చాలు ఊర్లోనో, పొరుగూరులోనో పాటకచేరికి వెళ్లిపోయేవాడు. పనీపాట ఆయన జీవితంలో భాగం. శ్రమించని రోజు కానీ, భజన చేయని రోజు కానీ ఆయన జీవితంలో లేనేలేదు. చిన్నతనంలో తన పాటలకు జనం ముగ్దులు అవుతున్నారని గమనించిన గాడ్గే బాబా పెద్దయ్యాక సమాజ హితం కోసం దాన్నే అస్త్రంగా వాడుకున్నాడు. వివాహమైన తర్వాత దేబుకు ఆడపిల్ల పుట్టింది. అలోక అని పేరు పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ కుల సంప్రదాయాల ప్రకారం బారసాల ఘనంగా జరపాలి. మేకలు బలి ఇవ్వాలి కల్లు, సారా ఏరులై పారాలి అప్పుడే దేవతలు దీవిస్తారు. కానీ వీటికి ఒప్పుకోక ఆచారం పేరుతో మేకను నరికినా చుక్క సారా తాగినా ఒప్పుకోను నేను అని ఇంట్లో వాళ్లకు చెప్పేసాడు. ఆచారాలు అనేవి కొన్నిసార్లు మంచిగా ఉండొచ్చు, కొన్నిసార్లు అదే చెడ్డగా మారొచ్చు, మనం కాలాన్ని బట్టి మార్చుకుంటూ వెళ్లాలి అని బారసాలకి వచ్చిన ఊరిలో వాళ్ళకి బంధువులకి మేక మాంసం బదులు మిఠాయి పెట్టాడు. దాంతో బంధువుల్లో చాలా మందికి కోపం వచ్చింది. వాళ్లకు తెలిసి ఒక చాకలి కుటుంబంలో నెత్తురు చూపించకుండా జరుగుతున్న తొలి శుభకార్యం ఇది. అప్పటికే కొంతమంది వాదనకు దిగారు. దీంతో దేబుజి కూతురు పుట్టిందని సంతోషించే సమయంలో మరొక జీవిప్రాణం తియ్యాలా, అలాగే సారా తాగి బాగుపడిన వాళ్ళు ఉన్నారా బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ తాగినట్టు మీరు ఎక్కడైనా చూశారా అని వాళ్లకు తన వాదన అర్థమయ్యేలా ప్రశ్నించాడు. దీంతో బంధువుల్లో కొందరు రాజీపడ్డారు. తర్వాత కొద్ది సంవత్సరాలకు అనగా 1905 ఫిబ్రవరి 5వ తేదీన ఒక సాధువు ప్రభావంతో దేబు తల్లినీ, భార్యాపిల్లలను వదిలి సత్యాన్వేషణకు ఇంటి నుంచి బయటపడ్డాడు. 

      సుమారు 2500 సంవత్సరాల కిందట బుద్ధుడు కావడానికి ముందు సిద్ధార్థుడు కూడా ఇంటి నుంచి ఇలాగే నిష్క్రమించాడు. అప్పుడు సిద్ధార్థుడు వయస్సు కూడ 29 సంవత్సరాలే.
ఆయన రాజు అయితే దేబు రైతు. ఇద్దరిలో ఉన్న పోలిక ఏమిటంటే అప్పటికి స్థిరపడి ఉన్న బాటలో నడవలేదు స్థిరపడి ఉన్న నమ్మకాలతో సర్దుకోలేదు, ఎంత కష్టమైనా సరే తమ సొంత మార్గాల్లోనే సత్యాన్వేషణకు పూనుకున్నారు. ఇలా ఇంటి నుంచి బయటపడ్డాక మట్టి మూకుడే దేబు తలకి మకుటం. మూకుడు, చీపురు ఈ రెండు ఆయన ప్రతీకలు. దర్జీల దగ్గర రంగురంగుల పీలికలను ఏరుకొని వాటితో దుస్తులను కుట్టుకునే వాడు. మూకుడునే నెత్తి మీద టోపీ లాగా బోర్లించుకునేవాడు. బిక్ష అవసరమైనప్పుడు అడుక్కొని తిన్నాక శుభ్రంగా కడిగి దాన్నే నెత్తి మీద పెట్టుకునేవాడు. మరాఠీలో మట్టిచిప్పను గాడ్గే అంటారు దీంతో ఆయనకి గాడ్గే బాబా అని పేరు వచ్చింది. సత్యాన్వేషణలో ఉన్నవాడు ముందుగా అహంను రద్దు చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గాడ్గే బాబా ఎవరైనా మీదే కులం అని అడుగుతే అంటరానివాడని చెప్పేవాడు. దానితో అవమానాలు చీత్కారాలు ఎదురయ్యాయి. ఆ రకంగా సమాజంలో ఓ ప్రధాన సమూహం వందల సంవత్సరాలుగా అనుభవిస్తున్న బాధల్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు.
ఊళ్ళో వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్లు పెట్టే జొన్న రొట్టెలు మాత్రమే తీసుకునేవాడు. కూలీ డబ్బులు ఇవ్వబోతే తీసుకునేవాడు కాదు. తన సంచారంలో గమనించింది ఏమిటంటే అన్ని ఊళ్లలోనూ చెత్తాచెదారం గుడి దగ్గర పారబోసి ఉండటం. ఇలా లాభం లేదని ఏ ఊరు వెళితే ఆ వూరి వాళ్లను చీపురు అడిగి చెత్తను ఊరు చేయడం మొదలుపెట్టాడు ఇదంతా చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. పిచ్చి వాడేమో అనుకునేవాళ్ళు. కొందరేమో ఉచితంగా రొట్టె లు అడగలేక ఈ పని చేస్తున్నాడు ఏమోనని భావించేవాళ్ళు. వారు ఏమనుకున్నా సరే ఊరంతా ఊడ్చిన తర్వాతగాని శాంతించే వాడు కాదు ఇక సాయంత్రం మళ్లీ అదే గుడి దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. రెండు రాళ్ళను తీసుకుని తాళం వేస్తూ తన అద్భుతమైన కంఠంతో కీర్తనలు పాడేవాడు. 

       గాడ్గే బాబా ఎప్పుడూ కాలినడకనే ఇష్టపడేవాడు. దారిపొడవునా ప్రకృతిని జన జీవితాన్ని గమనించేవాడు. కొందరు డబ్బులో మునిగేలా మరికొందరు పేదరికంలో మగ్గేలా ఎవరు చేశారు? భిన్న కులాలను పుట్టించింది ఎవరు? బ్రాహ్మణుల, మరాఠాల, అంటరానివారి మధ్య గోడలను కట్టింది ఎవరు? పోనీ సంపదలో తూగుతున్న వారెవరైనా సంతోషంగా ఉన్నారా? ఇంతకీ ఆ సంతోషం అంటే ఏమిటి?అది ఎక్కడుంది? ఇంత సంపద ఉన్న సంతృప్తి ఎందుకు ఉండదు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆయన్ను తొలుస్తూ ఉండేవి. విద్యారంగానికి బాబా చేసిన సేవలకు గుర్తింపుగా 1983లో ఏర్పాటు చేసిన అమరావతి విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక 1998లో కేంద్రం బాబా పేరిట తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన స్మారకార్ధం జాతీయ అవార్డును ప్రకటించింది. పారిశుద్ధ్య రంగంలో ఆదర్శప్రాయంగా నిలిచిన గ్రామాలకు, వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వడం మొదలు పెట్టింది. *స్వచ్ఛత అంటే కేవలం వీధులను శుభ్రం చేయడమే కాకుండా ప్రజల మనసులను కూడా శుభ్రం చేయడమని* నిరూపించిన గాడ్గె బాబా 1956 డిసెంబర్ 20న మరణించారు. వీరి జీవితం అందరికీ ఆదర్శప్రాయమైనది. స్వచ్ఛత వైపు నడిచేలా సమాజానికి ప్రేరణ అందించిన ఆ మహనీయుని వర్ధంతి స్మృతిలో... అందరం మన మనస్సులని మలినం లేకుండా చేసుకుందాం. సామాజిక సమరసతను పెంపొందిద్దాం. విద్వేషాలు లేని సమ సమాజాన్ని నిర్మిద్దాం.
(డిసెంబర్ 20 సంత్ గాడ్గే బాబా వర్ధంతి)

-సామల కిరణ్-రచయిత
కరీంనగర్,9951172002.

Sunday, December 6, 2020

అంబేద్కర్ చెప్పిన జాతీయతని అర్ధం చేసుకోలేమా?

అంబేద్కర్ చెప్పిన జాతీయతని అర్ధం చేసుకోలేమా?
          అంబేద్కర్ ప్రఖర జాతీయతాభావ సంస్కర్త. దేశ సమగ్రత కు రాజీలేని ఉద్దీపనని అందించిన చారిత్రక మహాపురుషుడు. బాబాసాహెబ్ చెప్పిన జాతీయతని దేశ ప్రజలంతా పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా అర్ధం చేసుకోవాలి, అనుసరించాలి. 
     ఇటీవల గ్రేటర్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ జాతీయతా అంటూ ఓ కొత్త నిర్వచనాన్ని లేవనెత్తే ప్రయత్నం కొందరు పత్రికలకి లేఖల పేర చేశారు. విశాల భావాలు వ్యాప్తి చేసే మేధావులుగా, కళాకారులుగా కొత్త విద్రోహానికి ఒడి గట్టారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ విడదీసే ప్రయత్నమూ జరిగింది.అయితే దీనిని ఎవరు పెద్దగ హర్షించలేదు. పట్టించుకోనూ లేదు. కానీ జాతీయత పేరుతో సంకుచితత్వానికి అవకాశం ఇవ్వాల్సిన పనీ లేదు. జాతీయ భావనలో సమన్వయమే తప్ప సంఘర్షణ కు చోటు ఉండదని అందరు గుర్తించాలి. జాతీయతా విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల్ని గమనిద్దాం. 
     దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ
భారత రాజ్యాంగం తుది సమావేశంలో 25 నవంబర్, 1949 న ప్రసంగిస్తూ “నేడు మనకు లభించిన స్వాతంత్రం సుస్థిరంగా ఉండాలంటే మనం మనకులము, ప్రాంతము, పార్టీ, సంస్థల ప్రయోజనాల కంటే దేశప్రయోజనాలకు పెద్దపీట వేయాలి” అని అందరకూ పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఇచ్చిన ఈ పిలుపుని జాతీయతకు ఇచ్చిన గొప్ప నిర్వచనంగా చెప్పవచ్చు. అన్నింటి కన్నా దేశప్రయోజనాలే మిన్నగా భావించటం మించిన జాతీయత ఏముంటుంది? స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని కులం, మతం, వర్గం, ప్రాంతం పేరుతో చీల్చే చర్యల్ని అంబేద్కర్ వ్యతిరేఖించారు.
            భారత రాజ్యాంగం ద్వారా ఒకే రాష్ట్రంగా (Nation) భారతదేశాన్ని నిలబెట్టే ప్రయత్నం రాజ్యాంగ కర్తల ద్వారా జరిగింది. సాంస్కృతిక సమైక్యతతోపాటు సామాజిక సమైక్యత అవసరమని తెలియజేస్తూ భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వం అనే అమృతాన్ని అంబేద్కర్ అందించారు. సాంస్కృతిక భావ ధార తెగకుండా, బలమైన సమైక్య రాజకీయ భారతం అవసరమని భావిస్తూ బలమైన కేంద్రంగల భారత రాజ్యాంగాన్ని మనకందించారు.  ఒకే ప్రజనుండి ఒకే రాజ్యం - ఒకే రాష్ట్రం వైపు భారత్ రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని డా|| అంబేద్కర్ అందించారు. డా అంబేద్కర్ ఈ శతాబ్దపు మేధావి. అనేక రంగాలలో వారు ఎంతో అధ్యయనం చేశారు. కనుకనే భారత రాజ్యాంగ నిర్మాతగా వారికి అవకాశం లభించింది.
        ‘భారతదేశ విభజన – పాకిస్థాన్ ఏర్పాటు‘ అనే గ్రంథంలో కోట్ల సంఖ్యలో ఉన్న ముస్లింలను కలుపుకునే శక్తి హిందూసమాజంలో లేదని, కనుక పాకిస్థాన్ ఏర్పడటమే మిగిలిన భారతదేశంలోని హిందువులకు మేలు కలిగిస్తుందని అన్నారు. పాకిస్థాన్ ఏర్పడిన తరువాత హిందూ ముస్లిం జనాభా మార్పిడి జరగాలని వారు కోరారు. పాకిస్తాన్లో హిందువులకు, షెడ్యూల్ కులాల వారికి ఏమాత్రం రక్షణ ఉండదని బాబాసాహెబ్ అంబేద్కర్  చెప్పిన జోస్యం నేడు కళ్ళముందు కన్పిస్తుంది. మత రాజ్యంగా ఏర్పడ్డ పాకిస్థాన్ లో హిందువుల సంఖ్య తగ్గటమే దీనికి తార్కాణం. మెజార్టీ హిందువులుగా ఉన్న భారత్ లో మాత్రం సమన్వయముతో అందరం జీవించటం గొప్ప విషయం.దీనికి ప్రధాన కారణం హిందూత్వంలోని విశాలతయే తప్ప మరొకటి కాదు. ఏ మతానికి చెందిన వారైనా పుట్టిన దేశాన్ని మాతృభూమిగా, ఇక్కడి వారసత్వాన్ని తమదిగా, ఇక్కడి చారిత్రక పురుషులు నా వాళ్ళుగా భావించుకోవటంలో సందేహం ఉండక్కర్లేదు. ఇందులో సంకుచితానికి తావు లేదు. మతతత్వానికి అవకాశమే లేదు. ప్రాంతీయ వాదాలకు చోటు లేదు. వీటి అన్నిటికి సర్వోపరి జాతీయత అని గుర్తించాలి. డా|| అంబేద్కర్ దళితుల ఉన్నతికోసం, సమానత్వం కోసం పనిచేస్తూనే దేశ ప్రయోజనాల కోసం అహరహమూ శ్రమించారు. ఎక్కడా రాజీ పడలేదు. కనుక వారిని మనం జాతీయ నాయకుడిగా గుర్తించి గౌరవించాలి. జాతీయతను అర్ధం చేసుకోవాలి. ఆయన అందించిన సమరసతా స్ఫూర్తిని కొనసాగించాలి. సంకుచిత భావాలకు చోటివ్వకుండా, ప్రాంత,భాష,వర్గ,కుల, మతం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీలకు, నాయకులకు బుద్ధి చెప్పి, ప్రజాస్వామ్య కాంతులు పరిఢవిల్లేలా, దేశ శ్రేయస్సుకి కలిసి నడుద్దాం. ఇది మనందరి బాధ్యత. 
(డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి)

-సాకి,9951172002.

Wednesday, December 2, 2020

భారతీయ తొలి సాహస వీరుడు

*భారతీయ తొలి సాహస వీరుడు*

ఓ వీరుడా
ప్రథమ సాహస యోధుడా
వయసుతో పనేముంది
దేశభక్తి లో నీవే ముందు
ఆంగ్లపాలకుల అక్రమగుండెల్ని
బాంబు వేసి భయపెట్టావు
నూనూగు మీసాల నవయవ్వనం
నూతన దారి దీపంలా వెలిగించావు
బాంబులనే బంతులుగా
ఉరికొయ్యనే ఊయలగా
స్వాతంత్ర్య ఉద్యమ సమిధవై
సాహస వీరునిగా నిలచిన
ఖుదీరాం నీకు కోటినమస్సులు..
మరువము నీ రణ జీవితం
తలతుము నిను అనుక్షణము..
అందుకో భారతీయుల నివాళులు
            భారత స్వాతంత్ర్య సమరంలో బలిదానం అయిన విప్లవవీరుల సంఖ్య లక్షల్లో... నేటి తరానికి తెలిసింది వేళ్ళ మీదని చెప్పొచ్చు. అలాంటి లక్షల భారతీయ స్వాతంత్ర్యసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్న వయస్కుడు ఖుదీరాం బోస్. భారతదేశ ప్రజల్ని పీడీస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు మాత్రమే. ఆ వయసులో ఈనాటితరం ఏం చేస్తుందో చెప్పక్కర్లేదు.

         ఖుదీరాం బోస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లా హబిబ్‌పూర్‌లో 1889 డిసెంబర్ 3న జన్మించాడు. చిన్ననాటి నుంచి తీవ్రమైన స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోయేవాడు. మొదట్లో అఖ్రా అనే విప్లవ సంస్థలో చేరాడు. తన నాయకత్వ లక్షణాలు, సాహసోపేతమైన స్ఫూర్తితో ఆ సంస్థలో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇతనికి ప్రేరణ సత్యేంద్రనాథ్ బోస్. 1905లో బెంగాల్ విభజన అతడిలో బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసి రేపింది. 16 ఏళ్ల వయసులోనే ఆంగ్లప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్‌లను బాంబులతో పేల్చివేశాడు.

        భారతీయులపట్ల క్రూరత్వానికి పెట్టింది పేరైన జడ్జి కింగ్స్ ఫోర్డ్. చిన్నవాడన్న దయలేకుండా సుశీల్ కుమార్ సేన్ అనే విప్లవకారునికి ఫోర్డ్ 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీసాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడాదెబ్బకు వందేమాతరం అని నినదించాడు. ఈ సంఘటన తరువాత స్వతంత్రవీరులంతా కింగ్స్ ఫోర్డ్ కు గుణపాఠం చెప్పాలని అనుకున్నారు. మానవరూపంలో ఉన్న మృగమైన ఫోర్డ్ లాంటి వారు ఉన్నంతవరకు దేశభక్తులకు కష్టాలేనని భావించి అతన్ని చంపడానికి నిశ్చయించుకున్నారు.

         1908 ఏప్రిల్ మొదటివారంలో జుగాంతర్ అనే విప్లవ సంస్థకి చెందిన విప్లవవీరులు కొందరు కలకత్తలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్ ఫోర్ట్ ను అంతంచెయ్యడానికి ఒకప్రణాళిక రచించారు. సమావేశంలో అరవిందఘోష్ కూడా ఉన్నాడు. ఖుదీరాంబోసునూ, ప్రఫుల్లచాకి అనే మరో నవయువకుడినీ ఈ పనికై నియమించారు. 1908 ఏప్రిల్ 30 రాత్రివేళ వీరిద్దరూ ముజఫర్ పూర్ లోని యురోపియన్ క్లబ్ కు ఒకబాంబు, రివాల్వర్ తీసుకొనివెళ్లారు. కింగ్స్ ఫోర్డ్ క్లబ్ బయటకురాగానే బాంబును విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తి వెళ్లిపోయారు. అయితే ఖుదీరాం, ప్రఫుల్లచాకిలు గమనించని విషయం ఏమిటంటే అసలు ఆ వాహనంలో కింగ్స్ ఫోర్డ్ లేదు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఒక రైల్వే స్టేషన్‌లో టీ తాగుతుండగా ఖుదీరాంబోస్‌ను పోలీసులు పట్టుకోగలిగారు. ఖుదీరాంను నిర్బంధించి రెండునెలలపాటు విచారణచేశారు. ముజఫర్ పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికికారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. 1908 ఆగష్టు 11న ఈ శిక్ష అమలుపరచబడింది. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. అతి చిన్న వయసులో దేశం కోసం బలిదానం అయిన ఖుదీరాం బోస్ నేటి నవతరానికి ధైర్యసాహసాల్లో స్ఫూర్తి. అవినీతిని, అన్యాయాన్ని ఎదిరించటంలో భయపడకుండా నిలబడాలని బోస్ జీవితం మనకు నేర్పుతుంది.

-సాకి,9951172002.

*మరణం లేని మహావీరులు*

*మరణం లేని మహావీరులు*          "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...