Tuesday, June 22, 2021

హైందవీ స్వరాజ్యం లక్ష్యంగా పరాక్రమించిన శివాజీ


         హైందవీ స్వరాజ్యం లక్ష్యంగా పరాక్రమించిన శివాజీ 


         గడిచిన వెయ్యి సంవత్సరాల నుండి  ఇస్లాం భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నది,  ఆ ప్రయత్నాలను త్రిప్పి కొట్టేందుకు అనేక మంది అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మొగలుల కాలంలో  ఇస్లాం ఆక్రమణ  పరాకాష్టకు చేరుకున్నది, ఆ సమయంలో హిందూ సమాజం నుంచి చాలా తీవ్రమైన ప్రతిఘటన జరిగింది ఆ ప్రతిఘటన చేసినవారిలో మహారాణాప్రతాప్ అగ్రగణ్యుడు, ఆ తదుపరి  శివాజీ చేసిన పోరాటం చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. శివాజీ రాణాప్రతాప్ కంటే పూర్వం పోరాటానికి సజీవ ఉదాహరణ విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్య నిర్మాణం సమయంలో  విద్యారణ్యులు వారు హిందూ  రాజ్యం అని అన్నారు శివాజీ దాని ప్రేరణతోనే  హైందవీ స్వరాజ్యం లక్ష్యంగా సైన్యం ముందు ప్రజల ముందు ఉంచాడు. ఆ లక్ష్యమే శివాజీని విజయ పథం వైపు నడిపించటమే కాకా స్వాతంత్రపోరాటంకి కూడా ప్రేరణగా నిలిచింది. ఆ దిశలో పోరాటం చేసి శివాజీ 1674 సంవత్సరం జూన్ ఆరో తేదీన అనగా ఆనంద నామ సంవత్సరం జేష్ఠ శుద్ధ త్రయోదశి గురువారం నాడు ఒక  క్షత్రియ కుల వతంస సింహాసనాధీశ్వర మహారాజ  చత్రపతిగా పట్టాభిషేకం చేసుకొని అష్ట  ప్రధానులతో ధర్మపాలన చేశాడు. ఇప్పుడున్న కేంద్రప్రభుత్వానికి మార్గదర్శకం ఆనాటి పాలనా. ఆ శివాజీ గురించి ఎవరుఎవరెవరు ఏమన్నారో చూద్దాం. 

                                                                 1) కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వామిజీ  "ఈ రోజున మావంటి సన్యాసులు నిర్భయంగా రాజ విధులలో తిరుగుతున్నాము అంటే అది శివాజీ మహారాజు పెట్టిన భిక్ష '' అని అన్నారు. 

2) ఔరంగజేబు ''నేను ప్రాచీన సార్వభౌములనందరిని నాశనం చేస్తుంటే శివాజీ  స్వయంగా కొత్త సార్వభౌమత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రతిభాశాలి.  నా సైన్యాలు 19  సంవత్సరాల పాటు అతడిని వెంటాడుతూనే ఉన్నా అతని రాజ్యం పెరుగుతూనే ఉన్నది అని '' వాపోయాడు. 

3)వియత్నాం  కి చెందిన రక్షణ శాఖ మంత్రి మేడంబిన్ 1977 సంవత్సరంలో  ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో ఎక్కడైనా శివాజీ విగ్రహం ఉంటే  ఆ విగ్రహానికి పూలమాల వేయాలని మన పాలకులను ఆమె  అడిగారు.   ఢిల్లీ అధికారులు హడావిడిగా తిరిగి శివాజీ విగ్రహాన్ని  గుర్తించి ఆమెను తీసుకెళ్లారు ఆమె శివాజీ విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడుతూ ''మా పోరాటానికి స్ఫూర్తి చత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ఒక ప్రక్క యుద్ధ వ్యూహాలు పటిష్టంగా రచించుకుంటూ రెండో ప్రక్క తన సైన్యంలో జాతీయ భావాన్ని నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు చేశారు ఈ వ్యూహాన్ని  మేము కూడా  అనుసరించాం దాంతో శక్తివంతమైన అమెరికాదేశాన్ని ఓడించి మా స్వాతంత్రాన్ని మేము కాపాడుకుంన్నాం. అందుకే శివాజీ మహారాజ్ మాకు ప్రేరణ అని'' చెప్పింది.  

    శివాజీ కాలంనాటి పరిస్థితులు 

         శివాజీ జన్మించే నాటికీ దక్కన్ లో ఉన్న శక్తివంతమైన బహుమనీ రాజ్యం  మూడు ముక్కలైంది. అహ్మద్ నగరంలో నిజాంషాహీ,  గోల్కొండలో కుతుబ్ షాహీ,  బీజాపూర్ లో ఆదిల్షాహి  రాజ్యాలు ఉండేవి.  శివాజీ అహ్మద్ నగర్  నవాబు దగ్గర జాగీర్దార్ గా , సైన్యాధిపతిగా ఉండేవాడు.  ఢిల్లీలోని మొగలాయిల విశృంఖలత్వం హిందువుల మీద హిందూ ధర్మం మీద దాడి చేస్తుండేవారు. దేశమంతటా హిందువుల పరిస్థితి కడు  దయనీయంగా ఉండేది. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకుని వచ్చి అందరిలో  ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేసిన వారు శివాజీ. ఆ కాలంలో ఒక ప్రక్క శివాజీ, ఇంకొక ప్రక్క గురుగోవింద్ సింగ్, మరోప్రక్క ఛత్రసాల్ పోరాటం చేసారు. ఒక వేళా ఈ ముగ్గురు కలిసి పోరాటం చేసి ఉంటే భారతదేశ చరిత్ర మరోరకంగా ఉండేది. 

                                                        శివాజీ ఎటువంటి వాడు 

 పరాభవానికి లోనైన మనస్సు విజిగీషీ  ప్రవృత్తిగల మనస్సు రెండిటి మధ్య అంతరం ఉంది, విజిగీషీ ప్రవ్రుత్తి  ప్రతికూలతలను లెక్కపెట్టదు. శివాజీ అన్నిరకాల పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగినట్టుగా వ్యవరించేవాడు. కూట  నీతికి కూట నీటితోనే సమాధానం చెప్పేవాడు అందుకే శత్రువుతో ఏ సమయంలో ఎక్కడ తలపడాలో వ్యూహం రచించుకొని దెబ్బకొట్టేవాడు. శివాజీ తన సైన్యం ముందు హైందవి స్వరాజ్యం లక్ష్యంగా పెట్టేవాడు, తన సేనలు ఆత్మవిశ్వాసంతో ఉండటం  అత్యంత ఆవశ్యకము అయినది దాన్ని గుర్తించిన శివాజీ తగిన వ్యూహాలు అమలు చేసేవారు. తనపై దాడికి వచ్చిన జై సింగ్ కు శివాజీ వ్రాసిన ఉత్తరం  సంచలనమైంది దానిలో ''మీరు ఒకవేళ హైందవ ధర్మాన్ని రక్షించేందుకు పోరాటం చేసేందుకు సిద్ధమైతే నేను మీ పల్లకి మోసే బోయనవుతాఅని'' వ్రాసాడు. అది శివాజీ నీతి. శివాజీ యుద్ధనీతి కారణంగ ఢిల్లీలోని మొగల్ సామ్రాజ్యం బలహీనమైంది. దేశం నిలద్రొక్కుకొనే వ్యవధి లేకుండా ఆంగ్లేయలు భారత్ లో ప్రవేశించారు  దానితో మరో 190 సంవత్సరాలు పోరాటం కోనసాగించవలసి వచ్చింది, శివాజీ కూడా ఆంగ్లేయులతో నావికా యుధాలు చేసాడు దానికోసం నావికా సైన్యం తయారు చేసాడు. శివాజీకి అడుగడుగునా ప్రేరణ శివాజీ తల్లి జిజియామాత, గురువు సమర్ధరామస్వామి వారు.  


          ఔరంగజేబుకు చివరకు మిగిలింది ఏమిటి ?

           శివాజీని బ్రతికి ఉండగా  ఔరంగజేబు జయించలేకపోయాడు. శివాజీ, శివాజి కొడుకు శంభాజీ ఇద్దరు  పరమపదించారు, ఆ తరువాత దక్షిణా పథాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఔరంగజేబు యుద్ధానికి వచ్చాడు 25 సంవత్సరాలు ఇటే ఉన్నాడు. శివాజీ  పరమపదించిన తర్వాత కూడా హైందవి స్వరాజ్ లక్ష్యంగా శివాజీ సైన్య పోరాటం చేస్తూనే ఉన్నది ఆ పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమైన ది ఔరంగజేబు ను మహారాష్ట్ర లోపలి కూడా రానివ్వలేదు ఆ సమయంలో జరిగిన  గెరిల్లా పోరాటంతో దెబ్బతిని ఔరంగజేబు వెన్నుచూపి పారిపోవాలని చూసాడు కానీ అంత సులభం కాలేదు చివరకు దారిలోనే చనిపోయాడు, అతని శవం కూడా ఆగ్రా వరకు కూడా తీసుకుపోలేకపోయారు దారిలోనే సమాధి చేయవలసి వచ్చింది. కానీ చివరకు ఔరంగజేబుకు మిగిలిందేమిటి తన సైన్యం పీనుగుల పెంటగా,  తన రాజ్యం బంజరుగా మిగిలింది,  నాలుగు సంవత్సరాల పాటు ప్లేగు వ్యాధితో లక్షమందికి పైగా  సైనికులు చనిపోయారు. 

                                                             ముగింపు వాక్యాలు 

శివాజీ సామ్రాజ్యంలో ఎక్కడ మతకలహాలు జరగలేదు,  మహిళలు అవమానించబడలేదు, మసీదులు, మతగ్రంధాలు అవమానించబడలేదు. శివాజీ సామ్రాజ్యంలో శిక్షలు కూడా కఠినంగా ఉండేవి. శివాజీ మరి ఎక్కువకాలం పాలించలేదు కానీ ఆ పరిపాలన ఇప్పటి అనుసరణీయం. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు దిశా నిర్దేశము శివాజీ జీవితమే.                                             

-రాంపల్లి మల్లికార్జున్




      

                                   

Saturday, June 19, 2021

హిందూ సమాజం పై సాంస్కృతిక దాడి (Part-2)

హిందూ సమాజం పై సాంస్కృతిక దాడి (Part-2)

ఒక కవి చెప్పినట్టు "మన దేశాన్ని కులాల కుట్రలు, మతాల మంటలు పగల పగుళ్లు తెగల తెగుళ్లు తాటి చెట్టుకు కొండ చిలువ మెలికలు వేసిన భారతి వేదన". కులం పేరుతో మతం పేరుతో ప్రాంతీయత్త్వం పేరుతో, తెగల పేరుతో ఈ దేశం యొక్క అఖండత్వాన్ని విచిన్న చేసే ప్రయత్నం చేస్తున్నారు. కులం పేరుతో మన సంస్కృతిలో లేని   అంటరానితనంను ఈ దేశంలోకి చొప్పించారు  అగ్రవర్ణాలలు, నిమ్నవర్గాలు దళితులు అనే పేరుతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారు, మన సంస్కృతిలో కులం కన్నా గుణాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చారు. భగవద్గీత లో చెప్పిన చాతుర్వర్ణ మాయ సృష్టి అనే శ్లోకాన్ని తప్పుడు వకృభాష్యం చెపుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.  వేదాలు రాసిన వ్యాసుని ది ఏకులం భగవద్గీత ను బోధించిన కృష్ణుడిది ఏకులం రామాయణాన్ని రాసిన వాల్మీకి ది ఏ కులంనేటికి ఈ మహనీయులు రాసిన, చెప్పిన విషయాలు మానవ జాతికి ప్రామాణికం, మరియు అనుసరణీయం కదా. దళిత అనే పదం ఏదైతే ఉన్నదో ఆ పదం అసలు ఇక్కడిది కానే కాదు విదేశాలలలో అణిచివేయబడ్డ అనే పదానికి అర్ధంగా దళిత అనే పదానికి వాడుతారు. ఈ పదాన్ని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ సమాజంలో చొప్పించి ఆ పదాన్ని విభజన వాదానికి కేంద్రబిందువుగా మార్చడం జరిగింది.  CLADVEL అనే బిషప్ అనే అతను ఆర్యన్ థియరీని బహుజన వాదాన్ని లేవనెత్తారు సమాజంలో విభజన వాదాన్ని రేకెత్తించారు. ఇతిహాసపరంగా  సమాజమంలో  అందరూ అనాదిగా పూజించే రాముడు, కృష్ణుడి లను ఒక వర్గం కు చెందిన వ్యక్తులుగా మాత్రమే  చిత్రీకరిస్తూ రాక్షస గుణాలు కలిగిన వ్యక్తులను ఒక వర్గ ప్రజలకు చెందిన వారీగా చిత్రీకరిస్తూ ఇతిహాసాల్లో పేర్కొనబడ్డ విషయాలను తప్పుడుగా అర్ధం చేసుకునే విధమైన సాహిత్యాన్ని, సంస్థలను నిర్మాణం చేసి సమాజాన్ని విడదీసేప్రయత్నం జరుగుతున్నది. జ్ఞానార్జనకు  నిలయంగా ఉండవలసిన కాలేజీలులలో cultural studies పేరుతో అనాగరికమైన పండుగలు నిర్వహించి కాలేజీలలో విద్యార్థుల మధ్య  ఉద్రిక్తలు నెలకొనేవిదంగా చేస్తూ రాబోయే తరం యొక్క మెదళ్లలో విష సంస్కృతి నింపుతున్నారు.

         హిందూ ఆచార వ్యవహారాల్లో పవిత్రమైన పదాలను, పుణ్య స్థలాలను మీడియా లో  అసభ్య పదాలకు పర్యాయ పదాలుగా వాడుతూ హిందూ సంస్కృతి యొక్క పవిత్రతను  దిగ జార్చేపని  ప్రధానంగా  కొనసాగిస్తున్నారూ ఉదహారణకు ఏదైనా వ్యవస్థలో ఆర్థికపరమైన మోసం జరిగితే "కుంభకోణం" జరిగింది అని అంటారు. వాస్తవానికి కుంభకోణం అనే పేరుతో తమిళనాడులో పెద్ద దేవాలయం ఉన్నది.,. సమాజంలో  ఎక్కడైనా ఎవరైనా వ్యక్తులు కానీ వ్యవస్థలో కానీ  నిధులను  తింటే "స్వాహా "అనే పదాన్ని ఉపయోగిస్తారు "స్వాహా" అనే పదం హిందువులు పవిత్రంగా భావించే యజ్ఞ కార్యక్రమమములో వాడుతాము, గుడిలో పూజారి పెట్టె "శఠగోపం" ను కూడా తప్పుడు అర్ధం వచ్చే విధంగా పవిత్రమైన పదాలను సాహిత్య, సమాచార రంగాల్లోకి అపవిత్ర పదాలుగా అర్ధం వచ్చే విధంగా  చొప్పించారు. హిందూ సంస్కృతి యొక్క గొప్పదనంను సూచించే  మన పవిత్రమైన  పురాణాలను ఇతిహాసాలను కేవలము ఆయా రచయితల యొక్క  ఊహాజనిత గాథ లుగా  పుక్కిటి పురాణాలుగా  మాత్రమే అవి జరగలేదని  ప్రచారం చేశారు. వాడుక బాషలలో  " బూతు పురాణం" అనే  పదం వాడుతాము అంటే ఇక్కడ "పురాణం" ఒక బూతు అనే అర్ధం వచ్చే విధంగా ,"సోల్లుబాగవతం","సొల్లు రామాయణం"  అంటే రామాయణ బాగవతాలు పనికిరానివనే అర్ధం ఇచ్చే విధంగా కావాలనే వాడుక పదాలుగా సమాజం లో కి చొప్పించారు.

కమ్యూనిజం మరియు క్రైస్తవ మతంను అనుసరించే వ్యక్తులు కళారంగాలలోకి ప్రేవేశించి అక్కడ మన సంస్కృతికి మూలమైన వాటిని తొలగించి ఆయా కళా రంగాలలో క్రైస్తవానికి అనుకూలమైన పద్దతిలో మార్పులు చేసే ప్రయత్నం జరిగింది మన సంస్కృతిలో వారసత్వంగా వస్తున్న  నాట్య శాస్త్రంలో   మల్లికా సారాభాయి అనే క్రైస్తవ అనుకూల వ్యక్తి    భారత నాట్యంలో ఉన్న హిందు సంస్కృతి విలువల స్థానంలో క్రైస్తవ ముద్ర వేసే విధంగా  ప్రయత్నంజరిగింది T కృష్ణ కన్నడ యొక్క ఒకల్ సింగర్ రామన్ మెగాసేసె అవార్డు గ్రహీత భారత్ నాట్యంలో CHRITIANITY చొప్పించే ప్రయత్నం జరిగింది. 


   1960 సంవత్సరం తరువాత క్రమంగా  సినిమాల ఆధారంగా సాంస్కృతిక దాడి చెయ్యడం జరిగింది అప్పటి వరకు  కుటుంబం  పౌరాణిక  సినిమాలు ఉండేవి అటు తరువాత కమ్యూనిస్ట్ లు ప్రవేశించిన తరువాత, వాస్తవ విషయాలు మరుగున పడే విధంగా సినిమాలు తీయడం జరిగింది ఈస్టమన్ కలర్ సినిమాలు ప్రారంభం ఆయిన తరువాత మహాభారతంలోని  కర్ణుడిని ఎక్కువగా చేసి చూపించడం మిగతా వాళ్ళను విలన్ లుగా చేసి చూపించారు, కర్ణుడు కేవలం దానం విషయంలొనే గొప్పవాడు కానీ మిగతా అన్నివిషయాలల్లో కూడా అధర్మం వైపు లేదా వ్యక్తిగత స్వార్ధం వైపే నిలుచున్నవాడు. 1980 తరువాత వచ్చిన సినిమాలు అన్ని కూడా కమ్యూనిస్ట్ ల చేత ప్రభావితం చెయ్యబడినవే, అంటే ప్రతి సినిమాలో పెట్టుబడిదారుడు, దోపిడిదారుడు అనే అంశం 1985,1987  తరువాత నక్సలిజం సిద్ధాంతంతో, నక్సలైట్లు హీరోలుగా సమాజోద్దారుకులుగా, మిగతా సమాజం ఓ ని అందరూ చెడిపోయిన వాళ్ళ లాగా  చూపించబడ్డారు, అంటే సమాజంలోని మంచి విషయాలను చూపిస్తూ ఒక సందేశాత్మకంగా ఉండాల్సిన సినిమాలలో దానికి బదులుగా సమాజాన్ని విభజించి చూపించే ప్రయత్నం చేస్తూ విదేశీ బావ ప్రేరేపిత సిద్దతానికి అనుకూలమైన సమాజాన్ని తయారుచేయడం కోసం సినిమా రంగాన్ని వేదికగా ఎంచుకున్నారు..

    ఇలా అనేక రకాలుగా అనేక పద్దతులలో  చేస్తూ మన సంస్కృతిని నాశనం చెయ్యడం కొరకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మన సంస్కృతిని రక్షించుకోవడం కొరకు మనం అందరం నడుంబిగించాల్సిన అవసరం ఉన్నది 

స్వామి ఆరబిందో మహర్షి చెప్పినట్టు 

I say no longer that nationalism is a creed, a religion, a faith; I say that it is the Sanatan Dharma which for us is nationalism. This Hindu nation was born with the Sanatan Dharma, with it it moves and with it it grows. When the Sanatan Dharma declines, then the nation declines, and if the Sanatan Dharma were capable of perishing, with the Sanatan Dharma it would perish.

The Sanatan Dharma, that is nationalism.

This is the message that I have to speak to you.

                                                                                         కట్ట రాజ్ గోపాల్

                                                                                         9490791726



Friday, June 18, 2021

హిందూ సమాజం పై సాంస్కృతిక దాడి

హిందూ సమాజం పై సాంస్కృతిక దాడి 

(Part-1)


ఒక మనిషి శరీరంలో ఎలా అయితె ఆత్మ ఉంటుందో అలా ప్రతి దేశానికి  ఒక ఆత్మ ఉంటుంది. శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోతే ఆ శరీరంను శవం అంటారు. మరి దేశం యొక్క ఆత్మ ఏమిటి అంటే ఆ దేశపు యొక్క సంస్కృతి ని ఆ దేశం యొక్క ఆత్మగా మనం చెప్పుకోవచ్చు, అంటే ఒక వ్యక్తి శరీరంలో ఎన్నైనా మార్పులు జరగవచ్చు, శరీరంలో ఉన్న అవయవాలు రకరకాలుగా ఉండవచ్చు రంగుల్లో తేడా ఉండవచ్చు పని విధానంలో తేడా ఉండవచ్చు కానీ ఆ శరీరాన్ని కలిపి ఉంచి  నడిపించేది  ఆత్మ మాత్రం ఒకటే ఆదేవిధంగా ఈ దేశం అనే దేహంలో  అనేక రకాలు అయిన వర్ణాలు, కులాలు ప్రాంతాలు పంథాలు, మతాలు ఉండవచ్చు కానీ మన దేశపు యొక్క ఆత్మ సంస్కృతి మాత్రం ఒక్కటే అదే హిందూ సంస్కృతి. ఈ హిందూ సంస్కృతి జీవన మూల్యాలు ఒక ఆరాధన పద్దతి, కులవృత్తులు, ఆహారపు అలవాట్లు, ఆరాధనపద్దతి ప్రకృతి అనుకూల జీవనం మరియు ఏకత్వంలో బిన్నత్వం ఇవన్నీ  ఇక్కడి సంస్కృతికి ఆధార భూతాలు అవుతాయి. ఆరాధనపద్దతులలో మన చుట్టూ వుండే రాయి రప్ప ప్రతీజీవి నిర్జీవి అన్నింటిలో మన ఆ భగవంతుణ్ణి చూస్తాము ఈ భూమిలో ఉన్న ప్రతి కణ కణంకు ఇక్కడా సంస్కృతికి వారసులయిన రాముడు, కృష్ణుడు, పుణ్య తీర్థాలు పుణ్య క్షేత్రాలతో అనుబంధం ఉన్నది. కాశ్మీర్లో ఉన్న ఒక వ్యక్తి పేరు రాంసింగ్ అయితే తెలంగాణలో ఉన్న వ్యక్తి  రాముడు అని పెరుపెట్టుకుంటారు, ఉత్తర భారతంలో ఉన్న ఒక మహిళ పేరు రాధ అని పెట్టుకుంటే దక్షిణ భారత దేశం లో ఉన్న మహిళ రాధిక, రాధమ్మ అని పేరు పెట్టుకుంటుంది. దేశ అఖండత్వంను సూచించే చతుర్ధామాలు ఇవి అన్ని ఈ దేశం లో ఉన్న అన్ని ప్రాంతాలను అంతర్లీనంగా ఒకే సంస్కృతితో ముడి వేయబడి ఉన్నది అంటే ఈ దేశ అఖండతకు ఆధారం మన సంస్కృతి.


 ఈ దేశంపై విదేశీయులు ఆక్రమణ చేసిన ప్రతి సారి మన దేశం యొక్క సంస్కృతి ని బౌతికంగా, మానసికంగా నాశనం చెయ్యడం కొరకు ప్రయత్నం చేశారు. సంస్కృతికి మూలం అయిన  గుడి, బడి, తల్లి ఒడిని నాశనం చేసే ప్రయత్నం చేశారు. మన దేశంలో ఆధ్యాత్మికతను, వైజ్ఞానికతకు  నిలయంగా అయిన  కొన్ని వేల సంఖ్య లో ఉన్న దేవాలయాలను, ప్రపంచ మానవాళికి విద్యను అందించిన నలంద ,తక్షశిలా వంటి మహా విద్యాలయాలను ధ్వంసం  చేసి అనేకమంది మాతృమూర్తులను చేరబట్టి మన సంస్కృతిని నాశనము చేసే ప్రయత్నం చేశారు.

అయితే ఈ రకమైన దాడి  మనకు స్వతంత్రం వచ్చిన తరువాత కూడా మన   సంస్కృతిపై  కొనసాగుతుంది. 

మన సంస్కృతిపై దాడి చెయ్యడం కోసం మన చేతితోనే మన కంటిని పొడిచే విధంగా కుటిల ప్రయత్నాలు చెయ్యడం జరుగుతుంది. మొదటి దశలో మన సంస్కృతిలో ఉన్న వాటిపై తప్పుడు పుస్తకాలను ప్రచురిస్తారు  RELIGEOUS ఫ్రీడమ్ అనే సంస్థ పుస్తకాలను ప్రింట్ చేసి ప్రచురించి మన దేశం లో ఉన్న కుహనా లౌకిక వాదులతో వాటిని అంగీకరింపచేసి వాటిని మన సమాజంలోకి ప్రవేశపెట్టిస్తారు ఉదాహరణకు రంగనాయకమ్మ  రామాయణం యెుక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా  రామాయణ విషవృక్షం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. 

SOCIETY AGAINST GENASIDE అనే సంస్థ రిలీజియస్ లో చిన్న విషయాలను బూతఅద్దంలో వెతికి వాటిని  తప్పుడు విషయాలుగా  చూపించే ప్రయత్నం  చేస్తారు. వీళ్ళు అందరూ అమెరికా గూడాచరి సంస్థ అయిన CIA కు రిపోర్ట్ చేస్తారు, ఇందులో కేవలం, CHRITIANITY వ్యక్తులనే తీసుకున్నారు ఆ తరువాత  ఇస్లాంలో ఉన్న వ్యక్తుల ఒత్తిడి మేరకు కొద్దిమంది ముస్లిం SCHOLORS ను కూడా తీసుకున్నారు కానీ హిందువులకు మాత్రం ఈ సంస్థలోకి చోటు కల్పించలేదు   భారతదేశంలోని మత స్వేచ్ఛ, మత ఆచార వ్యవహారాలపై తప్పుడు కథనాలతో పుస్తకాలను రాసి వాటిని పబ్లిష్ చేసి   పాఠ్యపుస్తకాలుగా పెడతారు. EX : వినాయకుడి  పై తప్పుగా పుస్తకం రాశారు దానికి రోమిల్లా తాపర్ అనే కమ్యూనిస్ట్ చరిత్రకారినితో దాన్ని AUTHENTIC చెయ్యిమని అడిగారు. సహజంగా రోమిల్ల తాపర్ విదేశీ భావజాలంతో ప్రేరేపితం  అయిన వ్యక్తి కాబటీ ఆ తప్పుడు పుస్తకాన్ని అంగీకరించింది   ఆ తరువాత ఆ పుస్తకం ఇప్పుడు అనేక చోట్ల పబ్లిష్ చెయ్యబడింది.

 GENERAL LORD WILIAM BENTINCK అనే బ్రిటిష్  గవర్నరు సతి సహగమనంపై నిషేధం విధించారు  దీనిపై దేశములోని బ్రిటిష్ ప్రెసిడెన్సీ GOVERNER లే ఒప్పుకోలేదు ఎందుకంటే దేశంలో ఈ ఆచారం అప్పటికి ఎక్కువగా లేదు. కేవలం కొన్ని రాజ వంశాలలో కొన్ని సంఘటనలకు ప్రతిక్రియాత్మకంగా మాత్రమే సతి సహగమనం జరిగింది అని చెప్పారు. PRESIDENCY GOVERNAR లు  5 సంవత్సరాల తరువాత కూడా సతిపై సంఘటన నమోదు కాలేదు అని వాళ్ళు ఉత్తరాలు రాయడం జరిగింది. సంధ్య జైన్ అనే ప్రముఖ రచయిత  2012 లో సతి పై ఒకపుస్తకం రాసింది ఇందులో సతి అనే ఆచారం దేశం లో ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఈ పుస్తకాన్ని ఎవరు కూడా కౌంటర్ చెయ్యలేదు కూడా. దేశము లో ఎక్కడో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఇక్కడి వ్యవస్థ లో నే  ఉందని ఇక్కడి సమాజం అనాగరికమయినది అని చెప్పే ప్రయత్నం బ్రిటిష్ వాల్లు చేశారు. ఈ దేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదని చదవ నివ్వలేదని అభూత కల్పనలు ప్రచారం చేశారు కొన్ని దేశాలలో ఇప్పటికి కొన్ని దేశాల లలో  మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు కానీ మన దేశం లో మహిళలు రాజ్యాలు ఎలారు. నేటికి మన స్వతంత్ర  భారతం లో కూడా మహిళను  వాణిజ్య ప్రకటన లలో   అసబ్యాంగా చూపిస్తూ మహిళల పట్ల పవిత్ర భావం పోయి చులకన భావం కలిగే విధంగా  ప్రయత్నం చేస్తున్నారు, వాలంటైన్స్ డే లాంటి రోజులను  ప్రోత్సహిస్తూ  సమాజంలో  విశృంఖలత్వాన్ని  పెంచే ప్రయత్నం విదేశీ శక్తులు దేశంలో చేస్తున్నారు.  

పాఠశాలలో సర్వమత సహనమ్ అనే పేరుతో క్రైస్తవ, ఇస్లాం పండుగలప్పుడు హిందూ విద్యార్థులకు ఫ్యాషన్ షో పేరుతో ఆయా మతాల వేషధారణాలను వేయించడం ఆ రోజు పాఠశాలలో పండుగలను నిర్వహించి చిన్నప్పుడే  సెమిటిక్ మతాల పట్ల ఆకర్షన పెరిగే విధంగా ప్రయత్నం కొనసాగుతుంది. అదే సమయం లో హిందూ పండుగలప్పుడు ఇస్లాం, క్రైస్తవంకు  చెందిన విద్యార్థులను వాటిలో భాగస్వామ్యం చెందిచే విధంగా ఫ్యాషన్ షో లు నిర్వహించరు కేవలం హిందు విద్యార్థులకు మాత్రమే సర్వమత సమానం అనే పేరుతో ఇతర సెమిటిక్ మతాల ఆచారాలను చిన్నప్పుడునుండే హిందూ విద్యార్థులు దాడికి గురి అవుతున్నారు.


-కట్ట రాజ్ గోపాల్

9490791726

                                                              

Saturday, June 5, 2021

ప్రకృతి తో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ



             ప్రకృతి తో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ            



పంచభూతాత్మకమైన  అనంత సృష్టిలో మానవుడు ఒక భాగం,  అంతే కానీ తానే  సర్వస్వం కాదు,  సృష్టికి ప్రతి సృష్టి చేయాలనే  ఆలోచనలు వినాశనానికి దారి తీస్తాయి అనే విషయాన్ని  మనం చరిత్ర నుండి గ్రహించవచ్చు.  పంచభూతాత్మకమైన ప్రకృతిలో  విలీనం కానీ ఏ పదార్థమైనా అది పర్యావరణానికి సమస్యగా మారుతుంది.  ఈరోజు మానవుడు తన అవసరాల కోసం కొండల్ని గుట్టల్ని తొలిచేసే  సమతలం చేస్తూ   అడవుల అన్నింటిని సమూలంగా నరికివేస్తూ  భూమాతను సంపదవిహీనం  గా చేస్తున్నాడు ,  భూగర్భ జల ప్రవాహాలను వాటి సహజ మార్గాలను మార్చివేసి తనకు అనుగుణంగామళ్ళించివేస్తున్నాడు .  భూగర్భ జలాలను అడుగంటించేస్తున్నారు  దాని కారణంగా ఈ రోజున మంచినీటి కటకట ఏర్పడుతున్నది.   అత్యంత విస్తృతమైన ప్రకృతి వనరులను తన గుప్పెట్లో బంధింప చూస్తున్నాడు, తనకు తానే సర్వశక్తిమంతుడైన సృష్టి స్థితి లయ కారకుడు అని భావించు కుంటున్నాడు , ఇది ప్రకృతి ప్రకోపించనంత   కాలం సాగుతుంది ఎప్పుడైతే ప్రకృతి  ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుందో అప్పుడు  సృష్టిలోని ఈ మానవమాత్రుడిన్ని  ఎవరు రక్షించగలరు  ? అందుకే భారత దేశంలో ఏకాత్మతా అనుభూతి చెందే జీవనము రచించబడింది.   ప్రకృతి అనుకూల జీవన విధానం తో  ప్రకృతిని కాపాడు కుంటూవస్తోంది . దాని నుంచి బయట పడటం దానికి విరుద్ధంగా వ్యవహరించటం అనేక సమస్యలకు దారి తీస్తుంది.  ఈరోజు కాలుష్యం కానీ పంచభూతాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే అన్నీ  కాలుష్యంతో నిండిపోయాయి.   ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు  ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చెయ్యాలని నినాదం చేస్తున్నారు .  కానీ ప్రకృతి అనుకూలంగా జీవించాలనే  మాట చెప్పడం లేదు,   ప్రకృతికి అనుకూలమైన జీవనం లోకి మానవుడు ఎప్పటివరకైతే  మారడో  అప్పటివరకు ఏవో సమస్యలు వచ్చి పడుతూనే ఉంటాయి. 

                                  ఈరోజు జల సమస్య చాలా తీవ్రంగా ఉంది నదులు సజీవనదులుగా  కనబడటం లేదు, ద్వాపర యుగ అంతంనుండి త్రివేణి సంగమం లోని సరస్వతి నది లుప్తం కావటం ప్రారంభమై ఇప్పుడు అంతర్వాహినిగా కనబడుతున్నది ఇట్లా అనేక నదులు ఆ దిశలో ఉన్నాయి కాబట్టి   నదులను,  వాగులు,  వంకలను  కాపాడు కోవాల్సిన అవసరం చాలా ఉంది.  ఈ దిశలో చేయవలసిన ప్రయత్నం అందరూ చేయాలి.  అందుకే మనం  ప్రతిరోజు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచిస్తుంటాం, అది మన జీవితంలో ఒక భాగము, అదే  పాశ్చాత్య దేశాలలో  సంవత్సరంలో ఒక రోజు పర్యావరణ పరిరక్షణ అనే నినాదం చేస్తారు. 


                                        


పర్యావరణ విద్వంసం చెయ్యి దాటిపోయే పరిస్థితులలో ప్రపంచ దేశాలు 1974 వ సంవత్సరంజూన్ 5 న ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమము చేస్తుంది. కరోనా ప్రపంచంలో విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో 47 వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం, ప్రకృతితో సంబంధాలనుతిరిగి పునరుద్ధరించుకోవటం పై  దృష్టి కేంద్రీకరించబడింది. 2021-2030 దశాబ్దం యుఎన్ లాంఛనంగా    . వాతావరణ సంక్షోభంపై పోరాడటానికి, ఒక మిలియన్ జాతుల నష్టాన్ని నివారించుకోవటానికి ,  మరియు ఆహార భద్రత, నీటి భద్రతా ,  జీవనోపాధిని పెంచడానికి క్షీణించిన నాశనం చేయబడిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణనులక్ష్యంగా పెట్టుకొన్నది. మనదేశంలో కూడా గడిచినరెండు  దశాబ్దాల  నుండి ప్రకృతి వ్యవసాయం పై ద్రుష్టి సారించి ఇప్పుడుదేశ వ్యాప్తంగా ఆ చరణ లోకి తీసుకోని  వస్తున్నది.కొద్దీ సంవత్సరాలపూర్వం దేశ వ్యాప్తం గ  విశ్వమంగళ గోగ్రామ యాత్ర జరిగింది దానితో గో ఆధారిత వ్యవసాయం ఊపు అందుకొంది,  దాని కొనసాగింపుగానే  ,  ఈ మధ్యనే భూమిసంరక్షణ , భూమిసుపోషణ , దిశలో పెద్దఎత్తున దేశమంతా  ఒక ఉద్యమం ప్రారంభమైనది.  ఇట్లా మనదేశంలో అనేక ప్రయత్నాలు దేశ వ్యాప్తంగా మొదలైయినాయి. 


                               నీటి సంరక్షణపై అవగాహన పెంచటానికి ఆ నీటి వనరులను కాపాడుకోవటానికి ప్రజలను జాగృతం చేయటానికి  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్ 'రివర్స్ ఆఫ్ ఇండియా' అనే మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది,  భారతదేశంలోని 51 నదులుపేర్ల ఆధారంగా.ఆ  వీడియో తయారు చేయబడింది . ఆ వీడియో లో  పెరుగుతున్న జనాభాపై, నదులను కాపాడుకోవటంపై , నీటి వనరుల  దోపిడీ  దాని పర్యవసానాల పై,  కథనం సాగుతుంది,  పర్యావరణ వ్యవస్థల విస్మరణపై హెచ్చరిస్తుంది , ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలనుచేయటానికి కేంద్రం యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది.అదే ఆ   మ్యూజిక్ వీడియో  మనకు ఇచ్చే సందేశమదే . ఆ వీడియో ను తిలకిద్దాం.  

-రాంపల్లి మల్లికార్జున్

                                                  


Friday, June 4, 2021

విద్యలో నూతన అధ్యాయం జాతీయ నూతన విద్యా విధానం

విద్యలో నూతన అధ్యాయం జాతీయ నూతన విద్యా విధానం
మూడున్నర దశాబ్దాల తరువాత దేశీయ విద్యావిధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. కనీసం ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన, విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించడం, వారి నైపుణ్యానికి మెరుగుపెట్టుకొనే వెసులుబాటు, కారణాంతరాల వల్ల మధ్యలో చదువు మానివేసినా తిరిగి కొనసాగించుకునే అవకాశం లాంటివి ఎన్నో ప్రత్యేకతలతో డాక్టర్‌ ‌కృష్ణస్వామి కస్తూరి రంగన్‌ ‌నేతృత్వంలో రూపొందిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) రానున్న రోజుల్లో అమలులోకి రాబోతుంది.

గడచిన యాభయ్‌ ‌రెండేళ్లలో విద్యావిధానం ప్రకటించడం ఇది మూడవసారి. 1968,1986లో విద్యావిధానాలు రూపొందాయి. 1992లో పరిమిత సవరణలతో దానికి ముందటి విద్యావిధానమే కొనసాగింది. విద్యా విధానంపై కేంద్ర కేబినెట్‌ ‌మాజీ కార్యదర్శి టీఎస్సార్‌ ‌సుబ్రమణియన్‌ ‌నేతృత్వంలోని కమిటీ 2016 మేలో, ఇస్రో మాజీ అధిపతి డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌ ‌నేతృత్వంలోని కమిటీ గత ఏడాది మేలో నివేదికలు సమర్పించాయి. తాజా నివేదిక ముసాయిదాను కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉంచింది. పార్లమెంట్‌ ‌కమిటీలు, ఎంపీలతో పాటు 2.5 లక్షల గ్రామ పంచాయతీల అభిప్రాయాలను సేకరించింది.  (గత విద్యావిధానాల కంటే భిన్నంగా విప్లవాత్మక సంస్కరణలను సూచించిన తాజా నివేదికలో ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడంతో పాటు నైపుణ్యం పెంపుదలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.)

‘విభిన్న వర్గాలతో విస్తృతంగా చర్చించి ఆమోదించిన నూతన విద్యావిధానం-2020 భారత విద్యారంగ చరిత్రో మేలి మలుపని, దూరదృష్టితో రూపొందిన ఈ విధానం దేశాన్ని చైతన్యపూరిత విజ్ఞాన సమాజంగా తీర్చిదిద్ద్దగలదని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిలషించారు. కనీసం ఐదవ తరగతి వరకు మాతృభాషలో బోధించాలన్న సూచన హర్షణీయమని అన్నారు.

‘సంస్కరణల కోసం విద్యారంగం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. సరళత, సమానత్వం, నాణ్యత, జవాబుదారీతనం, అందరికీ అందుబాటు అనే పునాదులపై నూతన విద్యా విధానం ఉంటుంది. ఇది లక్షలాది మంది జీవితాలను మార్చబోతోంది. దేశంమరింత కాంతులీనాలి, సుసంపన్నత సాధించాలి’ అని ప్రధాని ఆకాంక్షించారు.

ఈ నూతన విద్యా విధానంలోని ముఖ్యాంశాలను స్థూలంగా పరిశీలిస్తే…..

మాతృభాషలకు పెద్దపీట

ప్రాథమిక విద్యాస్థాయిలోనే మాతృభాష అస్తిత్వానికి భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారతీయ భాషలకు, మాతృభాషకు తాజా విద్యా విధానం ప్రాధాన్యం కల్పించింది. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే బోధించాలని నిబంధన విధించింది. కుదిరితే 8వ తరగతి వరకు, ఆపై తరగతులలో కూడా ‘అమ్మభాష’లోనే చదువు నేర్పాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. బోధనలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఏ ఇతర భాషను బలవంతంగా అమలు చేయడం కాని, ఇతర భాషలను వ్యతిరేకిచడం కాని ఉండదని ఈ విద్యావిధానం స్పష్టం చేస్తోంది. ‘మాతృభాషలో విద్యాబోధన కారణంగానే జపాన్‌,‌దక్షిణ కొరియా లాంటి దేశాలు శాస్త్ర రంగంలో దూసుకుపోతున్నాయి. ప్రాథమిక చదువు సొంతభాషలో ఉంటేనే సామర్థ్యం, నైపుణ్యం వేగంగా వృద్ధి చెందుతాయని యునెస్కో, యునిసెఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో మాతృభాషలో విద్యాభ్యాసం చేయకపోవడం వల్లనే సైన్స్ ‌పరిశోధనలలో వెనుకబడి ఉన్నాం.వివిధ దేశాల విద్యా విధానాల సమగ్ర అధ్యయనం తరువాతే ఇక్కడ కూడా ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని సూచించాం. పదవ తరగతి వరకు ‘అమ్మభాష’లో చదివితే ఇంకా మంచిది. ఈ తరువాత ఆంగ్లం తదితర భాషలను సులువుగా నేర్చుకోగలుగుతారు’అని డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌ అభిప్రాయపడ్డారు.పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సంస్కృతాన్ని ఐచ్ఛిక అంశంగా బోధిస్తారు.మాధ్యమిక తరగతులలో విదేశీ భాషలను కూడా పరిచయం చేస్తారు.

నైపుణ్యాభివృద్ధికి..

విద్యార్థులు పాఠశాల విద్య పూర్తిచేసుకొని బయటికి వెళ్లే సమయానికి ఒక వృత్తి విద్యా నైపుణ్యాన్ని అయినా సాధించేలా చర్యలు తీసుకుంటారు. నిరుద్యోగ సమస్య నివారణకు దీనిని ఒక సాధనంగా పరిగణించారు. విద్యార్థులు ఏటా నేర్వవలసిన నైపుణ్యాలను తల్లిదండ్రులతో సంప్రదించి నివేదిక తయారు చేస్తారు.‘నైపుణ్యం అనేది ప్రాథమిక విద్యాస్థాయి పాఠ్యాంశాలలో ఒక భాగం కావాలి. పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచే పక్రియ ప్రాథమిక స్థాయి నుంచే ప్రారంభించాలి.అందుకు భిన్నంగా చదువు పూర్తయిన తరువాత నైపుణ్యంపై ఎంత శిక్షణ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. పిల్లలలో ఆసక్తి కల రంగాలను,సహజ నైపుణ్యాలను తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు గుర్తించగలగాలి. అందుకోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరం’ అని డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌ అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు గణితం, సైన్స్ ‌పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే ప్రోత్సహిస్తారు. ఆరవ తరగతి నుంచే కోడింగ్‌ ‌నేర్పిస్తారు. ప్రస్తుతం అంతగా పట్టించుకోని కళలు, సంగీతం, ఆటలు లాంటి వాటిని పాఠ్యాంశాలలో చేరుస్తారు. పిల్లలకు శారీరక, మానసిక వికాసంతో పాటు కళల పట్ల ఆసక్తి, భావప్రకటన సామర్థ్యం పెంచాలని ఈ విద్యావిధానం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుగుణంగా 8 ఏళ్ల పిల్లలకు ఎన్‌సీఈఆర్‌టీ అవసరమైన పాఠ్యప్రణాళికను రూపొందిస్తుంది.

పాఠ్య ప్రణాళిక

ప్రస్తుత 10+2+3 ఏళ్ల పాఠ్య ప్రణాళిక 5+3+3+4 ఏళ్ల పాఠ్య ప్రణాళికగా మారుతుంది. 3,5,8 తరగతులకే నిర్దేశిత బోర్డుల ద్వారా పరీక్షలు ఉంటాయి.10,12 తరగతులకు పరీక్షలు యధాతథమే కానీ వాటి నమూనాలో మార్పు ఉంటుంది. విద్యార్థుల ప్రగతి నివేదికలో (పొగ్రెస్‌ ‌రిపోర్ట్) ‌ప్రస్తుతం వారు సాధించిన మార్కులతో పాటు వారి ప్రవర్తనపై ఉపాధ్యాయుల వ్యాఖ్యలు మాత్రమే ఉంటున్నాయి. నూతన విద్యా విధానం ప్రకారం, వాటితో పాటు సంబంధిత విద్యార్థి, సహ విద్యార్థుల అభిప్రాయాలనూ చేరుస్తారు. ‘12వ తరగతి వరకు ఆ నివేదికలలో వారి నైపుణ్యాలను నమోదు చేయవలసి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం పట్టభద్రులైన తరువాత నిరుద్యోగంతో బాధపడుతున్నారు.ఈ పరిస్థితిని నివారించేందుకే ఈ నూతన విద్యావిధానం రూపొందించాం’ అని కస్తూరి రంగన్‌ ‌వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇంటర్మీడియట్‌ ‌కోర్సు ఇప్పటికే పాఠశాల విద్యలో అంతర్భాగంగా ఉండగా, తెలుగు రాష్ట్రాలలోని ఇంటర్‌ ‌చదువు కూడా వాటి సరసన చేరబోతోంది.

చిన్నారుల సంరక్షణ విద్య

చిన్నారులకు మూడో ఏడు రాగానే ‘చిన్నారుల సంరక్షణ-విద్య’ (ఈసీసీఈ) మొదలవుతుంది.ఈ పథకం సమర్థంగా అమలు కావడానికి అంగన్‌వాడీలు, ప్రాథమిక, ప్రీ ప్రైమరీ పాఠశాలలు, ప్రీ స్కూల్స్‌ను బలోపేతం చేస్తారు. వాటిలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.ఈసీసీఈ అర్హత గల వారిని వాటిలో ఉపాధ్యాయులుగా నియమిస్తారు.10+2 అర్హత గల వారికి ఆరునెలల శిక్షణ ఇచ్చి నియమిస్తారు. అంతకంటే తక్కువ అర్హత గల వారు ఏడాది పాటు డిప్లమో చేయవలసి ఉంటుంది.
‘బేటీ పడావో-బేటీ బచావో’ నినాదమూ మరింత సాకారమయ్యేలా బాలికా విద్య ప్రోత్సాహానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల స్థాయిని ప్రస్తుతం ఉన్న 8,10 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పెంచుతారు. జిల్లాల్లో బాలభవన్‌లు నెలకొల్పుతారు. మహిళా విద్యతో పాటు దివ్యాంగులపై దృష్టి పెడతారు.

నిధుల కేటాయింపు

ప్రపంచ అత్యుత్తమ వ్యవస్థలో భారతీయ బోధన రంగం ఒకటిగా ఎదగాలన్న లక్ష్యంతో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో విద్యారంగానికి ప్రస్తుత 4.4 శాతం కేటాయింపును 6 శాతానికి పెంచాలని ఎన్‌ఈపీ ఉద్దేశించింది. 2035 నాటికి స్థూల నమోదు ఉత్పత్తిని ప్రస్తుత 26.3 శాతం నుంచి 50 శాతానికి చేర్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించింది. ఫలితంగా ఉన్నత విద్యాసంస్థలలో మూడు కోట్ల సీట్లు పెరుగుతాయని అంచనా. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఈ విధానం చెబుతోంది. వెనుకబడిన) ప్రాంతాలు, వర్గాలకు ప్రత్యేక విద్యా మండలాలను ఏర్పాటు చేస్తారు.

ఏకకాలంలో నచ్చిన అంశం…

డిగ్రీలో చేరిన తరువాత ఇష్టం లేకపోయినా అందులో పూర్తి కాలం కొనసాగవలసిన అవసరం ఉండదు. ఉదాహరణకు, ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు ఆర్టస్, ఆర్టస్ ‌కోర్స్‌ను ఎంచుకున్నవారు సైన్స్ ‌చదువుకునేలా అవకాశం కలుగుతుంది. వారు తమకు నచ్చిన పాఠ్యాంశాలను ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. డిగ్రీని పూర్తి కాలం పూర్తి చేయలేని వారికి అప్పటివరకు పూర్తయిన సంవత్సరాల ప్రాతిపదికగా సర్టిఫికెట్‌లు జారీ చేస్తారు. మళ్లీ కుదిరినప్పుడు ఆ చదువును కొనసాగించవచ్చు. మొదటి ఏడాదితో చదువు ఆపేసిన వారికి సర్టిఫికెట్‌, ‌రెండో ఏడాదితో ముగించిన వారికి అడ్వాన్స్ ‌డిప్లమో, మూడో ఏడాదికి బ్యాచిలర్‌ ‌డిగ్రీ, నాలుగవ సంవత్సరం పూర్తి చేసిన వారికి పరిశోధనతో కూడిన బ్యాచిలర్‌ ‌డిగ్రీ ప్రదానం చేస్తారు.మధ్యలో చదువు ఆపివేసిన వారికి డిగ్రీలో ఎంపిక చేసుకున్న కొన్ని కోర్సులను ‘ఆన్‌లైన్‌’ ‌ద్వారా పూర్తి చేసే అవకాశాన్ని ఈ నూతన విధానం కల్పిస్తుంది. పరిశోధనాసక్తి గలవారు నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఎంపిక చేసుకొని పీహెచ్‌డీలో ప్రవేశం పొందే అవకాశం కలుగుతుంది. ఇది వినూత్న ప్రయోగమని, మేధో వలసకు అడ్డుకట్టవేయాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పం ఈ విధానంలో ప్రతిఫలిస్తోందని పలువురు విదావేత్తలు అభివర్ణిస్తున్నారు.

నియామకాలపై మార్గదర్శకాలు

విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ), జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్టీఈసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) లాంటివి ఇక ఒకే ఉన్నత విద్యావ్యవస్థ కిందికి వస్తాయి. ప్రైవేట్‌, ‌ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర, డీమ్డ్ ‌విశ్వ విద్యాలయాలు, ఇతర ప్రత్యేక సంస్థలు ఒకే విధమైన ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది. వాటికంటూ ప్రత్యేక నిబంధనలు ఉండవు. కళాశాలల ‘అనుబంధ’ (అఫిలియేషన్‌) ‌పద్ధతి మారుతుంది. కళాశాలలన్నీ పదిహేను సంవత్సరాలలో దశలవారీగా ‘స్వయం ప్రతిపత్తి’కి లేదా ‘కాలేజీ ఆఫ్‌ ‌యూనివర్శిటీ’ స్థాయికి చేరుకోవలసి ఉంటుంది. ప్రపంచంలోని వంద అగశ్రేణి విశ్వవిద్యాలయాలు మన దేశంలో ‘ప్రాంగణాలు’ (క్యాంపస్‌లు) నెలకొల్పుకునేందుకు ఈ విద్యా విధానం అవకాశం కల్పిస్తుంది. డిజిటల్‌ ‌విద్యను ప్రోత్సహించేందుకు ‘జాతీయ విద్య సాంకేతిక వేదిక’ (ఎన్‌ఈటీఎఫ్‌) ఏర్పాటవుతుంది.2022నాటికి ఎన్‌సీఈఆర్‌టీ ఉపాధ్యాయులందరికీ ‘జాతీయ వృత్తి ప్రమాణాలు’ను, ఉపాధ్యాయ శిక్షణకు జాతీయ పాఠ్యప్రణాళికను రూపొందిస్తుంది.నాలుగేళ్ల బీఈడీ డిగ్రీ ఉంటేనే బోధనకు అర్హత లభిస్తుంది. ఉపాధ్యాయ నియామకాలకు జాతీయ స్థాయిలో విధివిధానాలు రూపొందిస్తారు.వాటి ప్రకారం…విద్యావిషయకంగా, బోధన, పరిశోధన పరంగా, ప్రజాసేవపై నిబద్ధత, అంకిత భావాలను పరిశీలించి నియామకాలు చేపడతారు.వారి సామర్థ్యాలను మదించిన మీదటే పదోన్నతులు కల్పిస్తారు.

మరోవంక ఈ నూతన విద్యావిధానం పట్ల మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఈ విధానం ఉద్దేశాలు, ఆశయాలు బాగున్నాయని, ఇవి అమలైతే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని, అయితే వాటి సాధననకు చేపట్టే కార్యాచరణను స్పష్టం చేయవలసి ఉందని విద్యావేత్తలు,విశ్వవిద్యాలయాల ఆచార్యులు, వివిధ రాజకీయపక్షాల నేతలు అభిప్రాయపడుతున్నారు. విద్య ఉమ్మడి జాబితాలోని అంశం కనుక దీని అమలులో రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, సహకారం ఏ మేరకు ఉంటుందో వేచిచూడాలంటున్నారు. ఏదిఏమైనప్పటికీ లక్షలాదిమంది విజ్ఞప్తులను తీసుకొని రూపొందించిన నూతన విద్యా విధానం విజయవంతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు, తల్లిదండ్రులూ, సమాజం అంతా కలిసి కృషిచేసి భవిష్యత్ భారత నిర్మాణానికి పునాది అయిన విద్యా వ్యవస్థ అభివృద్ధికి దోహదం పడాలని కోరుకుందాం.

పిన్నింటి బాలాజీ రావు
 వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు
 తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు ఎస్)
9866776286

Wednesday, June 2, 2021

*స్వామి వివేకానంద ఈ విపత్కర* పరిస్థితులలో*

స్వామి వివేకానంద ఈ విపత్కర పరిస్థితులలో 


        1896-1898 సంవత్సరం లో భారత దేశం లో ప్లేగు వ్యాధి సంభవించి చాలా మంది మృత్యువాత పడ్డారు ఆ సమయం లో ఎలా ఉండాలో స్వామి వివేకానంద చెప్పడం జరిగింది ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము ఈ సందర్భం లో స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఒక సారి మనం గుర్తుచేసుకుందాం.


1.మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము, మీరు బాధపడితే మేము కూడా బాధపడుతాం మీ సంక్షేమం కోసం మేము నిరంతరం ప్రార్థన చేస్తున్నాము, అని అన్నారు. అందుకే మనం ప్రతిరోజు ఉదయం లేవగానే సర్వేజన సుఖినోభవంతు అంటూ   అందరూ క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చెయ్యాలి. ఈ ప్రార్థనకు ఎంతో శక్తి ఉంటుంది.


2. మీ ఇంటిని, మీ చుట్టూ ఉన్న పరిసరాలను నిరంతరం పరిశుభ్రముగా ఉంచుకోండి, అలాగే మీ ఇంటి లో ఉన్న నిల్వ ఉన్న చెడిపోయిన (బేకరీ పదార్థాలు) పదార్థాలను తీసుకోవద్దు అందుకు బదులుగా తాజా గా పుష్టిని ఇచ్చే, శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోండి. బలహీనమైన శరీరం సులభంగా రోగగ్రస్త మవుతుంది.. కాబట్టి శరీరాన్ని దృడంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి.


3. ఈ మహమ్మారి కాలం లో మనం కామ, క్రోధాలకు దూరంగా ఉండండి.


4. వదంతులను నమ్మవద్దు అంటే సోషల్ మీడియా లో వచ్చే విషయాలలో వాస్తవ విషయాలని గ్రహించాలి.


5. బయాల వలన ఆందోళనకు గురి కావద్దని ముందుగా మీకు మేము చేసే   వినయ పూర్వక ప్రార్ధన అందుకు బదులుగా భగవంతుడిపై విశ్వాసంతో ఈ సమస్యను దూరం చెయ్యడం కోసం ఉత్తమమైన మార్గం ఏదో తెలుసుకోవడం కోసం ప్రయత్నించండి. లేకపోతే అదే పని చెయ్యడం కోసం ప్రయత్నిస్తున్న వారితో చేతులు కలపండి..భయం ఆందోళనను మనం దూరంగా ఉంచకపోతే మనకు లేని పోనీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


6.   మనం దేనికి భయపడాలి రండి అర్ధం లేని ఈ భయాన్ని విడిచిపెట్టి భగవంతుడి అనంతమైనన కృపలో నమ్మకం ఉంచి దైర్యంగా ఉండాలి, నడుములు బిగించి కార్యరంగంలోకి దూకుదాం మనం పవిత్రంగా  మానసికంగా శారీరకంగా  శుభ్రంగా ఉంచే జీవితాలను గడుపుదాం భగవంతుడి కరుణతో  ఈ మహమ్మారి  దాని గురుంచి భయం గాలికి ఎగిరిపోతాయి.


7. అవినీతితోను ఇతరులకు హాని చేసేవిధంగా పని చేస్తూ డబ్బు సంపాదించేవారిని భయం ఎప్పటికి వదిలిపెట్టి పోదు కాబట్టి మరణ భయం వెన్నాడుతున్న ఈ రోజులలో ఆ విధమైన ఆవినీతి ధోరణులను విడిచిపెట్టడడం మంచిది.,మనం చక్కనైన ధర్మ మార్గం లో వెళ్ళాలి.


8. మనస్సును ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరుకూడా ఎదో ఒకరోజు మరణించాల్సిందే, పిరికి వారు మరల మరల మరణ బాధలకు లోనవుతుంటారు ఎందుకంటే అది వారి మనసులలోని భయం వల్ల కలుగుతుంది కాబట్టి బయటి పరిస్థితులకు మన హృదయం స్పందించాలి కానీ మన మనస్సు నిర్వీర్యం కాకూడదు.


9. ప్రతి సాయంత్రం మనం భగవంతుని నామ సంకీర్తన చేస్తుండాలి మనం ఇంట్లోనుండే  సాంకేతిక  పరిజ్ఞానం ఆధారంగా మంచి మంచి నామ సంకీర్తనలు చెయ్యాలి అప్పుడు ఇంటిలోని వాతావరణం ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది అప్పుడు భయమనేది మన నుండి దూరం అవుతుంది.


10. ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో వారికి జగన్మాతే రక్షణ ఇస్తుంది. ఆ జగన్మాత మనలను రక్షిస్తుంది అనే భావన తో మనం ఉండాలి. అంటే నిర్భయంగా ఉండాలి.

*మరణం లేని మహావీరులు*

*మరణం లేని మహావీరులు*          "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...